ఫ్యాక్ట్ చెక్: ఉత్తరాఖండ్ హెలికాఫ్టర్ ప్రమాద ఘటనకు సంబంధించిన విజువల్స్ కు ఈ విజువల్స్ కు ఎలాంటి సంబంధం లేదు

జూన్ 15, 2025న కేదార్‌నాథ్ ధామ్ నుండి గుప్త్ కాశి వెళ్తున్న ఆర్యన్ ఏవియేషన్‌కు

Update: 2025-06-16 02:09 GMT

కేదార్‌నాథ్ ధామ్ నుండి గుప్త్ కాశి వెళ్తున్న ఆర్యన్ ఏవియేషన్‌కు చెందిన హెలికాప్టర్ గౌరికుండ్ అడవుల్లో కూలిపోవడంతో పైలట్‌తో సహా 7 మంది మరణించారు. ఈ ప్రమాదం తర్వాత చార్ ధామ్ ప్రాంతంలో నడుస్తున్న హెలికాప్టర్ సేవలను తదుపరి నోటీసు వచ్చే వరకు నిలిపివేశారు. UCADA (ఉత్తరాఖండ్ సివిల్ ఏవియేషన్ డెవలప్‌మెంట్ అథారిటీ), DGCA (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి. హెలికాప్టర్‌లోని వారిలో రాజ్‌వీర్ - పైలట్, విక్రమ్ రావత్, వినోద్, త్రిష్టి సింగ్, రాజ్‌కుమా, శ్రద్ధ, రాశి ఉన్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేశారు.


ఉదయం 05:17 గంటలకు గుప్త్ కాశికి బయలుదేరిన హెలికాప్టర్, ప్రయాణీకులను ఎక్కించుకుని కేదార్‌నాథ్ నుండి తిరిగి వస్తుండగా, కేదార్‌నాథ్ లోయలో వాతావరణ పరిస్థితులు సరిగా లేకపోవడంతో దారి తప్పింది. ఈ ప్రాంతంలో వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్లే హెలికాప్టర్ దారి తప్పిందని అధికారులు నిర్ధారించారు. పశువులకు మేత సేకరించడానికి వెళ్లిన స్థానికులు కూలిపోయిన హెలికాప్టర్‌ను గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) బృందాలు ఉదయం 7 గంటలకు గౌరికుండ్‌కు చేరుకున్నాయి. అక్కడి నుండి, వారు సంఘటన స్థలానికి వెళ్లి ఉదయం 8:55 గంటలకు సహాయక చర్యలను ప్రారంభించారు. అన్ని మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాలను గుర్తించడం కష్టం కాబట్టి, వాటిని కుటుంబాలకు అప్పగించే ముందు DNA పరీక్ష నిర్వహిస్తామని ఇన్‌స్పెక్టర్ జనరల్ రాజీవ్ స్వరూప్ తెలిపారు.

ఈ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ అంటూ సోషల్ మీడియా వినియోగదారులు కొన్ని హెలీకాప్టర్ కు చెందిన వీడియోలను షేర్ చేస్తున్నారు.

https://x.com/priyanshu__63/status/1934091989319811238

https://x.com/ThePulseIndia/status/1934105249729626577



వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు



 

ఫ్యాక్ట్ చెకింగ్:

మే 2025లో చోటు చేసుకున్న ఘటనను ఇటీవలిదిగా ప్రచారం చేస్తున్నారు.

జూన్ 15న కేదార్‌నాథ్ ధామ్ నుండి గుప్త్ కాశి వెళ్తున్న ఆర్యన్ ఏవియేషన్‌కు చెందిన హెలికాప్టర్ గౌరికుండ్ అడవుల్లో కూలిపోయిన ఘటనకు సంబంధించిన పలు వీడియోలను మేము పరిశీలించాం. అందులో ఎక్కడా కూడా వైరల్ పోస్టులతో మ్యాచ్ అయ్యే విజువల్స్ లభించలేదు.

అది కూడా అధికారులు ఈ విమానం అడవుల్లో కూలిపోయిందని తెలిపారు. పలు మీడియా సంస్థలు అప్లోడ్ చేసిన విజువల్స్ ను ఇక్కడ చూడొచ్చు.





ఇక వైరల్ పోస్టుల్లోని హెలికాఫ్టర్ విజువల్స్ ను స్క్రీన్ షాట్ తీసుకుని గూగుల్ సెర్చ్ చేయగా మే, 2025లో ఎయిర్ అంబులెన్స్ ప్రమాదానికి సంబంధించిన పలు కథనాలు మాకు లభించాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు. 

ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో సాంకేతిక లోపం తలెత్తి ఎయిర్ అంబులెన్స్ హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అవుతున్న వీడియోను ఈ కథనాల్లో చూడొచ్చు. హెలికాప్టర్ టెయిల్ రోటర్ పనిచేయకపోవడంతో పైలట్ దానిని చాలా కష్టపడి ల్యాండ్ చేశాడు. పైలట్ త్వరగా ఆలోచించడం వల్ల ముగ్గురు ప్రాణాలను కాపాడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన ఫుటేజ్‌లో హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ కోసం వేగంగా వస్తున్నట్లు చూపించింది. కానీ హెలిప్యాడ్‌కు దగ్గరగా ఢీకొట్టింది. హెలిప్యాడ్ దగ్గర నిలబడి ఉన్న వ్యక్తులు రక్షించడంలో సహాయం చేయడానికి హెలికాప్టర్ వైపు పరుగెత్తుతూ కనిపించారు.

'సంజీవని' హెలికాప్టర్ అంబులెన్స్‌ను రిషికేశ్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) ఉపయోగిస్తూ ఉందని వార్తా సంస్థ PTI నివేదించింది. హెలికాప్టర్‌లో ఉన్న ఇద్దరు వైద్యులు, ఒక పైలట్ సురక్షితంగా ఉన్నారని జిల్లా పర్యాటక అభివృద్ధి అధికారి రాహుల్ చౌబే తెలిపారు.

వైరల్ వీడియో లోని విజువల్స్ ను పలు మీడియా సంస్థలు తమ తమ యూట్యూబ్ ఛానల్స్ లో పోస్టు చేశాయి.

Full View


Full View


Full View


కాబట్టి, వైరల్ అవుతున్న విజువల్స్ కు జూన్ 15, 2025న కేదార్‌నాథ్ ధామ్ నుండి గుప్త్ కాశి వెళ్తున్న ఆర్యన్ ఏవియేషన్‌కు చెందిన హెలికాప్టర్ గౌరికుండ్ అడవుల్లో కూలిపోయిన ఘటనకు సంబంధించింది కాదు.

వైరల్ అవుతున్న వీడియోలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి.


Claim :  ఎయిర్ అంబులెన్స్ సర్వీస్‌కు చెందిన హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించింది
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News