ఫ్యాక్ట్ చెక్: సౌదీ అరేబియాలో 42 భారతీయులు సజీవదహనం అయిన ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ ఇవి కావు

వైరల్ అవుతున్న విజువల్స్ భారత ప్రయాణీకులకు సంబంధించిన ప్రమాద వీడియో కాదు

Update: 2025-11-18 17:55 GMT

సౌదీ అరేబియాలో ఉమ్రా యాత్రకు వెళ్లిన భారతీయ యాత్రికులు ప్రమాదంలో మరణించారు. మక్కా నుండి మదీనాకు వెళ్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో 42 మంది యాత్రికులు మరణించారని, వీరిలో చాలా మంది తెలంగాణకు చెందినవారని అధికారులు తెలిపారు. బాధితుల మృతికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కూడా బాధితుల కుటుంబాలకు ₹5 లక్షల పరిహారాన్ని ప్రకటించింది.

ఈ ప్రమాదంలో మరణించిన 42 మంది భారతీయ యాత్రికులలో ఒకే కుటుంబానికి చెందిన పద్దెనిమిది మంది సభ్యులు ఉన్నారు, వారిలో తొమ్మిది మంది పిల్లలు ఉన్నారు. హైదరాబాద్ విద్యానగర్ కు చెందిన నసీరుద్దీన్ కుటుంబంలోని 18 మందితో ఉమ్రా యాత్రకు వెళ్లారు. నవంబర్ 17న జరిగిన బస్సు ప్రమాదంలో నసీరుద్దీన్ సహా కుమార్తెలు, కోడళ్లు పిల్లలతో అందరూ చనిపోయారు. అయితే కుమారుడు సిరాజుద్దీన్ మాత్రం ఉద్యోగ రీత్యా యూఎస్ లో ఉంటున్నాడు. ఆ కుటుంబంలో అతనొక్కడే మిగిలాడు. నజీరుద్దీన్‌ దక్షిణ మధ్యరైల్వేలో ట్రైన్‌గార్డుగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. ఉమ్రాయాత్రకు కుటుంబమంతా కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. సిరాజుద్దీన్‌ అమెరికాలో ఉండడంతో రాలేకపోయారు.

ప్రమాద క్షణాన్ని చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. సౌదీ అరబ్‌లో ఇటీవల జరిగిన బస్సు ప్రమాదానికి సంబంధించిందని చెబుతున్నారు. పలు తెలుగు మీడియా సంస్థలు కూడా ఈ వీడియోను ఇటీవలిదిగా ప్రచారం చేస్తున్నారు.




వైరల్ అవుతున్న పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు:



 

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వీడియో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది.

వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ ఫుటేజ్ జూన్ 24, 2017న @abuazzozy అనే సోషల్ మీడియా ఖాతాలో“Fuel tanker overturns, driver burned to death in Aqaba Shaar.” అనే టైటిల్ తో యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు.

Full View


24 జూన్ 2017లో ఈ వీడియో అప్లోడ్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.

మేము సంబంధిత కీవర్డ్స్ తో సెర్చ్ చేయగా పలు మీడియా సంస్థల్లో కథనాలను ప్రచురించారు. వాటి లింక్ లను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.

అభాలోని అక్వాబా షార్‌లో ఒక ఇంధన ట్యాంకర్ మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సజీవ దహనం అయ్యాడని మీడియా నివేదికలు తెలిపాయి.



 

32 టన్నుల డీజిల్‌ను మోసుకెళ్తున్న ఇంధన ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడిందని అభా సివిల్ డిఫెన్స్ తెలిపింది. ఈ సంఘటన ఫలితంగా ట్యాంకర్ మంటల్లో చిక్కుకుంది, డ్రైవర్ లోపల సజీవంగా కాలిపోయాడు. ఇంధనం ట్యాంకర్ నుండి కిందకు పడిపోవడంతో ప్రాంతాలలో మంటలు చెలరేగాయి. సంఘటన స్థలంలో ఉన్న రక్షణ బృందాలు పరిస్థితిని పరిష్కరించాయి. ట్యాంకర్ శిథిలాల నుండి డ్రైవర్ మృతదేహాన్ని బయటకు తీశారు.

అల్ అరేబియా కథనాన్ని కూడా మనం చూడొచ్చు.

ఇక సౌదీ అరేబియాలో భారతీయులు చనిపోయిన ఘోర రోడ్డు ప్రమాదం ఘటనకు సంబంధించిన మీడియా నివేదికలను ఇక్కడ చూడొచ్చు.


సౌదీ అరేబియా ప్రమాదం ముందు కంటే వైరల్ విజువల్స్ ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయి.

కాబట్టి, వైరల్ అవుతున్న విజువల్స్ భారత ప్రయాణీకులకు సంబంధించిన ప్రమాద వీడియో కాదు.  


Claim :  వైరల్ వీడియో జూన్ 24, 2017 నుండి ఆన్ లైన్ లో అందుబాటులో ఉంది
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News