ఫ్యాక్ట్ చెక్: లెబనాన్ కు సంబంధించిన దృశ్యాలు ఢిల్లీ బాంబు పేలుడికి సంబంధించినవిగా ప్రచారం చేస్తున్నారు
ఎర్రకోట పేలుడు తర్వాత పరిస్థితిని సమీక్షించడానికి హోంమంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి
నవంబర్ 10న ఎర్రకోట వెలుపల జరిగిన భారీ పేలుడు. వెలుపల రద్దీగా ఉండే వీధిని కుదిపివేసింది. ఈ ఘటనలో 12 మంది మరణించారు. డజన్ల మంది గాయపడ్డారు. పేలుడు దుకాణాలను బద్దలు కొట్టింది. రాజధానిలోని అత్యంత రద్దీ ప్రాంతాలలో ఒకటైన ఓల్డ్ ఢిల్లీ ప్రాంతంలో భయాందోళనలను సృష్టించింది.
ఎర్రకోట పేలుడు తర్వాత పరిస్థితిని సమీక్షించడానికి హోంమంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు. ఉగ్రవాద దాడి, కొనసాగుతున్న దర్యాప్తు పురోగతిపై దృష్టి సారించిన ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, హోం కార్యదర్శి గోవింద్ మోహన్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ డేకా హాజరయ్యారు. ప్రధాని మోదీ నాయకత్వంలో గత 11 సంవత్సరాలుగా ఉగ్రవాదంపై భారతదేశం చేసిన పోరాటాన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఢిల్లీ ఉగ్రవాద దాడిలో ప్రభావితమైన వారందరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు.
అయితే ఎర్రకోట బాంబ్ బ్లాస్ట్ కు సంబంధించిన విజువల్స్ అంటూ పలు వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతూ ఉన్నాయి.
వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి.
ఢిల్లీ పేలుడు తర్వాత పలు వాహనాలు దగ్ధమవుతున్నట్లు ఫోటోలో కనిపిస్తోంది. ఇందులో నిజం తెలుసుకోవడం కోసం గూగుల్ లెన్స్ ద్వారా వైరల్ ఫోటోను సెర్చ్ చేసాం. మాకు దొరికిన రిజల్ట్స్ లో ఈ ఫోటో 2014 నుండి ఆన్ లైన్ లో ఉందని, అది కూడా లెబనాన్ దేశానికి సంబంధించిందని స్పష్టంగా తెలుస్తోంది.
రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా "Beirut car bomb blast causes death and injury in Hezbollah stronghold" అనే హెడ్ లైన్ తో ది గార్డియన్ అప్లోడ్ చేసిన కథనాన్ని మేము గుర్తించాం. లెబనాన్ దేశ రాజధానిలో ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది. ఆ కథనానికి సంబందించిన లింక్ ను ఇక్కడ చూడొచ్చు.
"దక్షిణ బీరుట్‌లోని హిజ్బుల్లా భద్రతా జోన్ సమీపంలో ఒక శక్తివంతమైన కారు బాంబు పేలింది. ఈ దాడిలో ఐదుగురు మరణించారు. డజన్ల కొద్దీ మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. లెబనీస్ రాజధాని డౌన్‌టౌన్ ప్రాంతంలో మరో బాంబు దాడిలో ఒక సీనియర్ ప్రతిపక్ష నాయకుడు, ఏడుగురు పౌరులు మరణించిన వారం తర్వాత ఈ పేలుడు జరిగింది. దాడులు పెరుగుతూ ఉండటం వలన, పలు ప్రాంతాలలో నివసించే వారిలో భయాన్ని రేకెత్తించింది." అంటూ ఆ కథనంలో ఉంది. జనవరి 2, 2014న ఈ కథనాన్ని పోస్టు చేశారు.
ఈ ఘటనను జనవరి 2, 2014న అల్ జజీరా మీడియా సంస్థ కూడా నివేదించింది. లెబనీస్ రాజధాని బీరూట్ దక్షిణ శివారు ప్రాంతంలో జరిగిన శక్తివంతమైన పేలుడులో ఆరుగురు మరణించగా, మరో 66 మంది గాయపడ్డారని మీడియా కథనంలో తెలిపారు. నగరంలోని హరెత్ హ్రీక్ పరిసరాల్లో రద్దీగా ఉన్న సమయంలో ఈ కారు బాంబు దాడి జరిగింది.
ఈ కథనానికి సంబంధించిన లింక్ ను ఇక్కడ చూడొచ్చు.
వాల్ స్ట్రీట్ జనరల్, ది న్యూయార్క్ టైమ్స్ లాంటి కథనాలలో కూడా లెబనాన్ రాజధానిలో జరిగిన పేలుడును నివేదిస్తూ ఇదే ఫోటోను పోస్టు చేశారు. అందుకు సంబంధించిన లింక్స్ ను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
స్క్రీన్ షాట్ ను కూడా ఇక్కడ చూడొచ్చు.
కాబట్టి, జనవరి 2, 2014న లెబనాన్ లో చోటు చేసుకున్న పేలుడుకు సంబంధించిన విజువల్స్ ను ఢిల్లీ లో ఎర్రకోట సమీపంలో చోటు చేసుకున్న పేలుళ్లతో సంబంధం ఉన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు.
వైరల్ అవుతున్న విజువల్స్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి.
Claim : వైరల్ అవుతున్న దృశ్యాలు ఢిల్లీ ఎర్ర కోట బాంబు పేలుడు
Claimed By : Social Media Users
Fact Check : Unknown