ఫ్యాక్ట్ చెక్: వైరల్ వీడియో పాకిస్థాన్ పై భారత్ చేసిన దాడికి సంబంధించింది కాదు

గాజాకు సంబంధించిన విజువల్స్ ను ఇటీవలివిగా షేర్ చేశారు

Update: 2025-05-07 08:22 GMT

ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ పౌరుడు మరణించిన తరువాత, మే 7, బుధవారం తెల్లవారుజామున భారతదేశం జైష్-ఎ-మొహమ్మద్ (జెఎం), లష్కరే-ఎ-తోయిబా (ఎల్‌ఇటి) వంటి పాకిస్తాన్‌కు చెందిన గ్రూపులు నిర్వహిస్తున్న ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత దళాలు క్షిపణి దాడులను చేశాయి.


ఆపరేషన్ సింధూర్ మొత్తం ఆపరేషన్ నిమిషాల్లోనే ముగించారు. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ ను నిర్వహించాయి. భారత్ సైన్యం ఇంటలిజెన్స్ రిపోర్టును అనుసరించి భారత్ గడ్డపై నుంచి మిసైళ్లతో దాడులకు దిగింది. ఉగ్రవాద స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్న దాడులు సక్సెస్ అయ్యాయి. భారత్‌పై ఉగ్రదాడులు, చొరబాట్ల యత్నాలకు పాల్పడిన కీలకమైన తొమ్మిది ప్రాంతాలను ఈ ఆపరేషన్ కోసం ఎంపిక చేశారు. భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు ఈ స్థావరాలు ఎంత కీలకమైనవో అంచనా వేసి, వాటిని లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు.

ఈ దాడుల తర్వాత పాక్ మీడియా, పాకిస్థాన్ మద్దతు ఉన్న అనుబంధ సంస్థలు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత కొన్ని గంటల్లోనే, పాకిస్తాన్ ప్రభుత్వానికి సంబంధించిన అనేక మీడియా ఛానెల్‌లు, సోషల్ మీడియా ఖాతాలు ధృవీకరించని వాదనలను ప్రసారం చేయడం ప్రారంభించాయి. భారత్ లోని పలు మీడియా సంస్థలు కూడా పాకిస్థాన్ మీద జరిగిన దాడి అంటూ పోస్టులను పెట్టడం మొదలుపెట్టాయి.

"ఆపరేషన్ సిందూర్ లో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థల పై విరుచుకుపడుతున్న భారత సైన్యం. పరుగులు తీస్తున్న పాకిస్తాన్ ఉగ్రవాదులు.." అంటూ కూడా పోస్టులు వైరల్ అవుతున్నాయి. చుట్టుపక్కల పేలుళ్లు జరుగుతూ ఉండగా, కొందరు పారిపోతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.




వైరల్ అవుతున్న వాదనకు సంబంధించిన స్క్రీన్ షాట్లు ఇక్కడ చూడొచ్చు



 

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వీడియోకు ఆపరేషన్ సింధూర్ కు ఎలాంటి సంబంధం లేదు.

వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా వైరల్ వీడియో 2023 నవంబర్ నుండి ఆన్ లైన్ లో ఉందని మేము ధృవీకరించాం.

ఈ వీడియో గాజాలోని ఇండోనేషియా ఆసుపత్రిపై ఇజ్రాయెల్ వైమానిక దాడికి సంబంధించింది. 2023 నవంబర్‌లో అల్ జజీరా మీడియా సంస్థ వైరల్ వీడియోను తొలిసారిగా షేర్ చేసింది. వీడియోలో అల్ జజీరా లోగో కనిపిస్తుంది.

వైరల్ వీడియోలోని కీఫ్రేమ్‌ను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు అల్ జజీరా ఎక్స్ ఖాతాలో పోస్టు చేసిన ట్వీట్ మాకు కనిపించింది. గాజాలోని ఇండోనేషియా ఆసుపత్రిపై ఇజ్రాయెల్ వైమానిక దాడిని నివేదించారు. అదే వీడియోలో గుడారాలు, పేలుళ్ల నుండి పారిపోతున్న వ్యక్తులను చూపిస్తుంది.



At least 8 killed in Israeli strikes on Indonesian Hospital అనే టైటిల్ తో నవంబర్ 20, 2023న Al Jazeera English ఛానల్ లో ఈ ఘటనను నివేదించారు.

Full View






పాకిస్థాన్ మీద ‘ఆపరేషన్‌ సిందూర్‌ ’ పేరుతో జరిపిన ఈ దాడుల్లో పాక్‌లోని 9 కీలక ఉగ్ర స్థావరాలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది. అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల లోపు ఉన్న క్యాంపులను టార్గెట్‌ చేసిందని నివేదికలు తెలిపాయి. పాకిస్థాన్‌లోని 4, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని 5 స్థావరాలను ధ్వంసం చేసింది. ఇందులో జైషే మహ్మద్‌కు చెందిన నాలుగు, లష్కరే తోయిబాకు చెందిన 4 క్యాంపులు ఉన్నాయి. రెండు హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ శిబిరాలు ఉన్నాయి.

అయితే వైరల్ వీడియోలు 2023 నవంబర్ నుండి ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయి. ఇది గాజాలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించింది.

వైరల్ అవుతున్న వాదనలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి.


Claim :  గాజాకు సంబంధించిన విజువల్స్ ను ఇటీవలివిగా షేర్ చేశారు
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News