ఫ్యాక్ట్ చెక్: భారత ఆర్మీ పాకిస్థాన్ పై దాడి చేస్తోందంటూ వైరల్ అవుతున్న వీడియో ఇటీవలిది కాదు
వైరల్ అవుతున్న వీడియో 2020 నుండి ఆన్ లైన్ లో అందుబాటులో
పహల్గామ్ లో చోటు చేసుకున్న తీవ్రవాద దాడిలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రవాదులకు పాకిస్థాన్ మద్దతు ఇస్తోందని భావించిన భారత ప్రభుత్వం పాకిస్థాన్ పై పలు ఆంక్షలు విధించింది. పహల్గామ్ ఘటనపై అంతర్జాతీయ దర్యాప్తు అవసరమని పాకిస్తాన్ విశ్వసిస్తోంది. అంతర్జాతీయ దర్యాప్తుదారులతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉందని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్‌ను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. ఏ దర్యాప్తుకైనా పాకిస్తాన్ సహకరించడానికి సిద్ధంగా ఉందని ఆసిఫ్ తెలిపారు. ఈ ఉగ్రదాడిలో తమకు ఎటువంటి ప్రమేయం లేదని పాకిస్థాన్ ఖండించింది. ఈ పరిణామాల అనంతరం భారతదేశం కీలకమైన సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. పాకిస్తాన్ తన వైమానిక ప్రాంతాన్ని భారత విమానయాన సంస్థలకు మూసివేసింది.
కాశ్మీర్ రెసిస్టెన్స్ తీవ్రవాద సంస్థ సోషల్ మీడియా సందేశంలో పహల్గామ్ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు పేర్కొంది. కశ్మీర్ రెసిస్టెన్స్, పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థలలో ఒక భాగమని భారత భద్రతా సంస్థలు చెబుతున్నాయి.
ఇంతలో భారత సైన్యం పాకిస్థాన్ సైన్యం మీద దాడి చేస్తోందంటూ ఓ వీడియో వైరల్ అవుతూ ఉంది. "BREAKING : At least 12 Pakistani soldiers killed, 3 posts & 2 Artillery positions destroyed after Indian Army retaliated the ceasefire violation in Tatta Pani Sector. Heavy Artillery & Mortar shelling reported.(Sources)
#PahalgamTerroristAttack to Hindus" అంటూ పోస్టు పెట్టారు.
"బ్రేకింగ్: తట్టా పానీ సెక్టార్‌లో కాల్పుల విరమణ ఉల్లంఘనకు భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. కనీసం 12 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు, 3 పోస్టులు & 2 ఆర్టిలరీ స్థానాలు ధ్వంసమయ్యాయి." అంటూ పోస్టులు పెట్టారు.
వైరల్ అవుతున్న పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వీడియో ఇటీవలిది కాదు. 2020 నుండి ఆన్ లైన్ లో అందుబాటులో ఉంది.
మేము సంబంధిత కీవర్డ్ తో సెర్చ్ చేయగా ఇటీవలి కాలంలో భారత సైన్యం చేసిన దాడిలో 12 మంది పాక్ సైనికులు మరణించారనే కథనాలు మాకు ఎక్కడా లభించలేదు.
అయితే పహల్గామ్ ఘటన తర్వాత పాకిస్థాన్ సైన్యం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచిందంటూ కథనాలు లభించాయి. పహల్గామ్‌లోని పర్యాటక ప్రాంతంలో 26 మంది పౌరులను ఊచకోత కోసిన ఘటనపై ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న తరుణంలో, ఏప్రిల్ 25, 26 తేదీల్లో పాకిస్తాన్ దళాలు నియంత్రణ రేఖ వెంబడి ఉన్న భారత పోస్టులపై కాల్పులు జరిపాయి. రెండు రాత్రులలో పాకిస్తాన్ దళాలు భారత దేశాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నించడం ఇది రెండోసారి. జమ్మూ కశ్మీర్, లడఖ్‌లోని భారత, పాకిస్తాన్ సైన్యాలను వేరు చేసే నియంత్రణ రేఖ వెంబడి ఉన్న బహుళ పోస్టుల నుండి కాల్పులు జరిపినట్లు భారత సైన్యం నివేదించింది. పాకిస్తాన్ కాల్పులకు భారత దళాలు తగిన విధంగా ప్రతిస్పందించాయని అధికారులు తెలిపారు. కాల్పుల్లో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని భారత సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఆ కథనాలను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
వైరల్ అవుతున్న వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా వైరల్ వీడియో 2020 నుండి ఆన్ లైన్ లో అందుబాటులో ఉందని మేము నిర్ధారించాం.
రిపబ్లిక్ భారత్ యూట్యూబ్ ఛానల్ లో J&K: Pakistan ने पुंछ में किया सीजफायर का उल्लंघन, सेना दे रही मुहतोड़ जवाब అనే టైటిల్ తో 14 జూన్ 2020న వీడియోను అప్లోడ్ చేశారు.

పూంఛ్ సెక్టార్ లో పాకిస్థాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించిందని భారత్ బదులు ఇచ్చిందని ఈ కథనాలు తెలిపాయి. ఇదే వీడియోను పలు సోషల్ మీడియా ఖాతాలలో 2020, ఏప్రిల్ నెలలో అప్లోడ్ చేశారని మేము ధృవీకరించాం.
ఫేక్ న్యూస్ గురించి సమాచారాన్ని అందించే D-Intent Data కూడా వైరల్ వీడియో ఇటీవలిది కాదంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. భారత సైన్యం కాల్పుల విరమణ ఉల్లంఘనకు ప్రతీకారం తీర్చుకున్న తర్వాత 12 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారని, మూడు సైనిక పోస్టులు, రెండు సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయని పేర్కొంటూ ఫిరంగి కాల్పుల వీడియోను ప్రచారం చేస్తున్నారని, అందులో నిజం లేదని వివరించింది.
వైరల్ అవుతున్న వీడియో ఎక్కడ రికార్డు చేశారనే విషయాన్ని తెలుగు పోస్ట్ అధికారికంగా ధృవీకరించలేకపోయినప్పటికీ 2020 నుండి ఆన్ లైన్ ఉందని స్పష్టంగా తెలుస్తోంది.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : వైరల్ అవుతున్న వీడియో 2020 నుండి ఆన్ లైన్ లో అందుబాటులో
Claimed By : Social Media Users
Fact Check : Unknown