ఫ్యాక్ట్ చెక్: సింగపూర్ లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాన్వాయ్ అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు
ప్యారిస్ పర్యటనలో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఈ ఘటన
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనను ముగించుకొని బుధవారం(30-07-2025) రాత్రి 11:25 గంటలకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. హైదరాబాద్ మీదుగా ప్రత్యేక విమానంలో రాష్ట్రానికి చేరుకున్న చంద్రబాబుకు పలువురు మంత్రులు అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో సీఎం చంద్రబాబు ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ సంస్థలను ఆహ్వానించేందుకు సీఎం నాలుగురోజుల పాటు సింగపూర్ పర్యటనకు వెళ్లారు. ఆయన వెంట మంత్రులు లోకేశ్, నారాయణ, టీజీ భరత్ సహా వివిధశాఖల ఉన్నతాధికారులు సింగపూర్‌కు తరలి వెళ్లారు.
భారతదేశం-సింగపూర్ సంబంధాలలో భాగంగా రాష్ట్ర ప్రపంచవ్యాప్త సంబంధాలలో ఒక కొత్త అధ్యాయంగా సీఎం చంద్రబాబు అభివర్ణించారు. ఈ పర్యటన ఆగ్నేయాసియా దేశంతో దీర్ఘకాలిక సంబంధాలను పునరుద్ధరించిందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విస్తారమైన పెట్టుబడి సామర్థ్యాన్ని హైలైట్ చేసిందన్నారు. ఇక నవంబర్‌లో విశాఖపట్నంలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు పాల్గొనేవారిని ఆహ్వానించినట్లు చంద్రబాబు నాయుడు తెలిపారు.
ఈ పర్యటన సందర్భంగా, చంద్రబాబు నాయుడు సింగపూర్ అధ్యక్షుడు థర్మన్‌ను కలిశారు, పెట్టుబడులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఫిన్‌టెక్, పోర్టులు, పట్టణాభివృద్ధిపై 27 సమావేశాలు నిర్వహించారు. చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన కుమారుడు నారా లోకేష్, ఇతర మంత్రులు కూడా పర్యటనలో ఉన్నారు. ఐటి మంత్రి నారా లోకేష్ గురువారం ఉదయం సింగపూర్ నుండి బయలుదేరారు. లోకేష్ 19 వన్-ఆన్-వన్ సమావేశాలు, ఆరు ప్రభుత్వం-ప్రభుత్వ (G2G) సెషన్‌లు, నాలుగు సైట్ సందర్శనలలో పాల్గొన్నారు.
సింగపూర్ లో సీఎం చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ను చూస్తే షాక్ అవుతారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. భారీ సంఖ్యలో మోటార్ సైకిళ్ళు, కార్లు వీడియోలో కనిపిస్తూ ఉన్నాయి.
"సింగపూర్ లో సీఎం చంద్రబాబు కాన్వాయ్ చూస్తే షాక్ అవుతారు Nara Chandrababu Naidu Convoy Singapore
#singapore #cmchandrababu #tdp #mahaanews" అంటూ పోస్టులు పెట్టారు.
https://www.facebook.com/reel/
"సింగపూర్ ప్రెసిడెంట్ కాన్వాయ్ కాదు...
సింగపూర్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
@ncbn
కాన్వాయ్ !!
రాజు ఎక్కడున్నా రాజేరా...
#ChandrababuNaidu #TeluguDesamParty #SingaporeTelugusWelcomeCBN" అంటూ మరికొందరు పోస్టు పెట్టారు.
https://x.com/RakhiNbk/status/
వైరల్ అవుతున్న పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్యారిస్ పర్యటనకు సంబంధించింది.
వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇవే దృశ్యాలు కలిగి ఉన్న నిడివి ఎక్కువ ఉన్న వీడియో ‘Stephane Paris production’ అనే యూట్యూబ్ ఛానెల్లో 16 ఫిబ్రవరి 2025న అప్లోడ్ చేశారు. ఫిబ్రవరి 2025లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో పర్యటించినప్పటి విజువల్స్ అని తెలుస్తోంది.
Narendra Modi's Grand Motorcade Rolls Through Paris అంటూ వీడియోను 16 ఫిబ్రవరి 2025న అప్లోడ్ చేశారు. వీడియో వివరణలో "పారిస్‌లో నరేంద్ర మోదీ మోటర్‌కేడ్!
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పారిస్‌కు అధికారిక పర్యటనలో ఉన్నారు, ఆకట్టుకునే హై సెక్యూరిటీ కాన్వాయ్‌తో పాటు. ఫ్రెంచ్ రాజధానికి ఆయన రాకకు సంబంధించిన ఈ ప్రత్యేక చిత్రాలను చూడండి, అక్కడ ఆయనకు పూర్తి గౌరవాలతో స్వాగతం పలికారు." అని ఉంది.

వైరల్ విజువల్స్ చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన కంటే ముందు నుండి ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది.
జూలై 27 నుండి జూలై 31, 2025 మధ్య చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనకు సంబంధించిన విజువల్స్ ను మేము పరిశీలించాం. ఎక్కడా కూడా ఆయన పర్యటనలో భారీ మోటారు కేడ్ తో స్వాగతం పలికినట్లుగా కనిపించలేదు.
వైరల్ పోస్టులను పలు మీడియా సంస్థలు నిజ నిర్ధారణ చేశాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు. వీటన్నింటిలోనూ ఇది ప్రధాని నరేంద్ర మోడీకి లభించిన స్వాగతం అంటూ తెలిపారు. ఎక్కడా కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తావన రాలేదు.
కాబట్టి, వైరల్ అవుతున్న విజువల్స్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు సింగపూర్ లో లభించిన స్వాగతం అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు.
Claim : ప్యారిస్ పర్యటనలో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఈ ఘటన
Claimed By : Social Media Users
Fact Check : Unknown