ఫ్యాక్ట్ చెక్: వైరల్ వీడియో అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంలో మృతులకు సంబంధించింది కాదు

వైరల్ వీడియో జూన్ 12 కంటే ముందు నుండి ఆన్ లైన్ లో అందుబాటులో

Update: 2025-06-17 16:43 GMT

అహ్మదాబాద్ నుండి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం AI 171 ప్రమాదానికి గురైన నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఎయిర్ ఇండియా CEO కాంప్‌బెల్ విల్సన్‌ను కలిసింది. ఈ సమావేశంలో టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్‌లైన్స్ సకాలంలో బయలుదేరేలా చూసుకోవడంతో పాటు, విమానాల భద్రత, నిర్వహణపై దృష్టి పెట్టాలని ఏవియేషన్ బాడీ కోరింది. ఆపరేటింగ్ విమానాల భద్రత, వాటితో ప్రయాణించే ప్రయాణీకులకు అందించే సేవలను నిర్ధారించడంలో కఠినమైన ప్రోటోకాల్‌లను అమలు చేయాలని ఎయిర్ ఇండియాను కోరింది. విమాన ఆలస్యం సమయంలో ప్రయాణీకులకు కలిగే అసౌకర్యం గురించి కూడా DGCA ఎయిర్‌లైన్‌ను ప్రశ్నించింది, అటువంటి సమస్యలపై చర్యలు తీసుకోవాలని కోరింది. జూన్ 12న ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ లో కూలిపోయిన తర్వాత ఎయిర్ ఇండియా సంస్థ తన దగ్గర ఉన్న బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానాల భద్రతా తనిఖీలను పెంచింది.


ఇంతలో ఎయిర్ ఇండియా విమాన ప్రమాద బాధితుల మృతదేహాలకు సంబంధించిన విజువల్స్ అంటూ కొన్ని పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. అందులో తెల్లటి వస్త్రంతో కప్పి ఉంచిన శవపేటికలు చూడొచ్చు. ఇది అహ్మదాబాద్ నుండి లండన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించిందంటూ పోస్టులు పెడుతున్నారు.

Full View


Full View




వైరల్ అవుతున్న పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు



 



ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వీడియోకు అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి ఎలాంటి సంబంధం లేదు.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం జరిగింది. ఎయిర్ ఇండియా ప్యాసింజర్ విమానం AI-171 టేకాఫ్ సమయంలో కూలిపోయింది. అందులో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు సహా మొత్తం 270 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన మిగిలిన వ్యక్తులు అహ్మదాబాద్‌లోని మేఘనానగర్ ప్రాంతంలో ఉన్న B.J. మెడికల్ కాలేజీ, సివిల్ హాస్పిటల్ క్యాంపస్‌కు చెందినవారు.

మేము ఈ ప్రమాదంలో మరణించిన వారికి సంబంధించిన సమాచారం కోసం వెతికాం. ఈ ప్రమాదంలో చాలా మంది శరీరాలు కాలి బూడిదయ్యాయి. దీంతో అధికారులు డీఎన్ఏ రిపోర్టు ఆధారంగా గుర్తించి బంధువులకు, కుటుంబ సభ్యులకు అప్పగిస్తూ ఉన్నారు.

జూన్ 17, 2025 నాటికి అందిన కథనాల ప్రకారం అధికారులు DNA పరీక్ష ద్వారా 163 మంది బాధితులను విజయవంతంగా గుర్తించారని ధృవీకరించారు. ఇప్పటివరకు, 124 మృతదేహాలను వారి కుటుంబాలకు అంత్యక్రియల కోసం ఇచ్చామని తెలిపారు. ప్రమాదం తీవ్రత, దాని ఫలితంగా సంభవించిన అగ్నిప్రమాదం కారణంగా, చాలా మృతదేహాలు తీవ్రంగా కాలిపోయాయి. DNA సరిపోలికలను పూర్తి చేయడానికి ఫోరెన్సిక్ బృందాలు 24 గంటలూ పనిచేస్తున్నాయి. ఈ ప్రక్రియ సున్నితమైనది, సమయం తీసుకునేది కావడంతో అన్ని ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని అధికారులు వివరించారు.

అందుకు సంబంధించిన కథనాలను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.


ఇక వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను తీసుకుని మేము గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాం

itz_army_jaat_01 అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో మే 13, 2025న ఈ వీడియోను అప్లోడ్ చేశారని గుర్తించాం.




ramanuj9309 అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో మే 11, 2025న ఈ వీడియోను అప్లోడ్ చేశారని గుర్తించాం.



ఈ సాక్ష్యాల ప్రకారం వైరల్ వీడియో అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదం జరగడం కంటే ముందు నుండే ఆన్ లైన్ లో అందుబాటులో ఉందని గుర్తించాం.

ఈ వీడియో మొదట ఎప్పుడు, ఎక్కడ రికార్డు చేశారో మేము స్వతంత్రంగా ధృవీకరించలేకపోయాము. ఇక అందుబాటులో ఉన్న ఆధారాలు అది జూన్ 12, 2025న అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి ముందు ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.

ఎయిర్ ఇండియా ప్రమాద ఘటనకు వైరల్ వీడియోకు ఎలాంటి సంబంధం లేదని నిర్ధారిస్తున్నాయి.


Claim :  వైరల్ వీడియో జూన్ 12 కంటే ముందు నుండి ఆన్ లైన్ లో అందుబాటులో
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News