ఫ్యాక్ట్ చెక్: రాహుల్ గాంధీ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేతిలో పత్రాలను తీసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది

Update: 2024-04-19 10:10 GMT

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేతిలో పత్రాలను తీసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. షేర్ చేసిన 30 సెకన్ల వీడియోలో రాహుల్ గాంధీ పేపర్లను పట్టుకుని కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నట్లు చెబుతున్నట్లు అందులో ఉంది.

“मैं राहुल गाँधी , आज कांग्रेस से इस्तीफा दे रहा हूं , मुझसे और चुनावी हिंदू बनने का ढोंग नहीं होगा । अन्याय यात्रा के बाद न्याय पत्र भी निकला, लेकिन मोदी जी भ्रष्टाचारियों को जेल भेज रहे हैं । अब मोदी राज में हम सब भ्रष्टाचारियों को जेल भेज दिआ जायेगा I इस लिये मैं अपने नाना के घर इटली जा रहा हूं। ”.
“నేను, రాహుల్ గాంధీ కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నాను. ఎన్నికల్లో ఓట్ల కోసం నేను అసలైన హిందువునని చెప్పి విసిగిపోయాను. న్యాయ పత్రాన్ని కూడా విడుదల చేశాను కానీ.. అన్యాయ్‌ యాత్ర చేశాను, మోదీ అవినీతిపరులను జైలుకు పంపుతూనే ఉన్నారు. మనం కూడా అవినీతికి పాల్పడ్డాం.. జైలుకు వెళ్లే అవకాశం ఉంది. అందుకే నేను ఇటలీకి మా తాతయ్య ఇంటికి వెళ్తున్నాను." అని ఆ వీడియోలో వాయిస్ ఉంది.
చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు.. వివిధ కామెంట్లతో ఈ వీడియోను షేర్ చేశారు. అయితే, వారిలో చాలా మంది.. ఈ వీడియోను ఎవరు చేసారు? ఈ వీడియో నిజమో, ఎడిట్ చేసినదో తెలియదంటూ పోస్టులు పెట్టారు.





ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ క్లిప్‌ ను ఎడిట్ చేశారు. అసలు వీడియోలో, రాహుల్ వాయనాడ్ నియోజకవర్గం నుండి నామినేషన్ దాఖలు చేస్తున్నానని ప్రతిజ్ఞ చేస్తున్నారు.
"రాహుల్ గాంధీ కాంగ్రెస్‌కు రాజీనామా" అని సెర్చ్ చేసినప్పుడు, మాకు ఎలాంటి ఫలితాలు కనిపించలేదు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఉండి ఉంటే.. అది తప్పకుండా సంచలనమై ఉండేది.
మేము Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఏప్రిల్ 3, 2024న రాహుల్ గాంధీ తన సోషల్ మీడియా ఖాతాలో నామినేషన్ దాఖలు చేసిన వీడియోను షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము. వైరల్ అవుతున్న వీడియో కూడా అదే. ఆ పోస్ట్‌లో, “వయనాడ్ నా ఇల్లు, వాయనాడ్ ప్రజలు నా కుటుంబం. వారి నుండి, నేను గత ఐదు సంవత్సరాలుగా చాలా నేర్చుకున్నాను. ప్రేమ, ఆప్యాయతలను పొందాను. సగర్వంగా, వినయంతో నేను ఈ సుందరమైన భూమి నుండి 2024 లోక్‌సభకు మరోసారి నామినేషన్ దాఖలు చేస్తున్నాను." అని తెలిపారు.
రాహుల్ షేర్ చేసిన వీడియోను పరిశీలించగా.. ఆయన ఆంగ్లంలో ప్రతిజ్ఞ చేశారు. "నేను, రాహుల్ గాంధీ, ప్రజల సభలో ఒక స్థానాన్ని భర్తీ చేయడానికి అభ్యర్థిగా నామినేషన్ వేయడాన్ని ధృవీకరిస్తున్నాను. భారత రాజ్యాంగంపై నిజమైన విశ్వాసం, విధేయతను కలిగి ఉంటాను. నేను భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతాను." అని చెప్పడం మనం వినవచ్చు.

"Rahul Gandhi Filling Nomination for Wayanad Constituency" అనే కీవర్డ్స్ ను ఉపయోగించి మేము గూగుల్ సెర్చ్ చేయగా.. పలు మీడియా సంస్థలు ఈ వీడియోను షేర్ చేయడాన్ని మేము గుర్తించాం.
“Congress leader #RahulGandhi submitting nomination papers to #Wayanad district collector Renu Raj on Wednesday” అనే క్యాప్షన్ తో ఏప్రిల్ 3, 2024న, ది హిందూ తమ సోషల్ మీడియా ఖాతాలో ఈ వీడియోను షేర్ చేసింది.


హిందుస్థాన్ టైమ్స్ “Rahul Gandhi's 1st reaction after filing nomination from Wayanad Lok Sabha seat: ‘Will not rest until…’ అంటూ ఆర్టికల్ ను పబ్లిష్ చేసింది.
ఇండియా టుడే కూడా “‘I, Rahul Gandhi…’: Watch Congress leader filing nomination from Wayanad” అంటూ రాహుల్ గాంధీ గురించి కథనాన్ని ప్రచురించింది. ఎక్కడా కూడా రాహుల్ గాంధీ రాజీనామా చేసి.. ఇటలీకి వెళ్ళిపోతున్నట్లు చెప్పలేదు.
వైరల్ అవుతున్న వీడియోలో ఎలాంటి నిజం లేదు. రాహుల్ గాంధీ నామినేషన్ వేయడానికి ముందు ప్రతిజ్ఞ బూనాడు. వాయిస్ ను మిమిక్రీ చేయించి.. ఒరిజినల్ వీడియోలోకి ఉంచారు.


Claim :  రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News