ఫ్యాక్ట్ చెక్: 2024 ఏపీ ఎన్నికల్లో నటి సమంత టీడీపీకి ఓటు వేయమని కోరలేదు. సమంత పాత వీడియోను ఎడిట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో 2024 అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు ముందు, నటి సమంతా రూత్ ప్రభు కనిపించిన

Update: 2024-03-12 08:09 GMT

ఆంధ్రప్రదేశ్‌లో 2024 అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు ముందు, నటి సమంతా రూత్ ప్రభు కనిపించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఇందులో రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో ఉంచాలంటే సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరుతూ ఉన్నట్లు ఉంది. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) పార్టీ గుర్తు సైకిల్ అని తెలిసిందే. సమంత టీడీపీకి మద్దతుగా మాట్లాడుతూ ఉన్నారనే విధంగా వీడియోను షేర్ చేశారు

మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ Xలోని ఒక వినియోగదారు తెలుగు క్యాప్షన్‌తో సమంత వీడియోను షేర్ చేసారు.
"నేను మీ సమంత .. అభివృద్ధి కి వోట్ చేయండి .
సైకిల్ గుర్తుకే మీ ఓటు..
జై తెలుగుదేశం." అంటూ వీడియోను పోస్టు చేశారు.

Full View

ఫ్యాక్ట్ చెకింగ్:
సమంత సైకిల్ గుర్తుకు మీరు ఓటేయండి అంటూ చెప్పడం ప్రస్తుత ఎన్నికలకు సంబంధించినది కాదు.
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికలకు సంబంధించి సమంత రూత్ ప్రభు టీడీపీకి మద్దతు ఇస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. వైరల్ వీడియో ప్రజలను తప్పుదారి పట్టించేది. గతంలో సమంత అప్లోడ్ చేసిన ఓ వీడియోకు సంబంధించిన ఫుటేజీతో ఎడిట్ చేశారు.
'Samantha Prabhu vote for Telugu Desam Party' అని గూగుల్ కీవర్డ్ సెర్చ్‌ని నిర్వహించగా.. ఏప్రిల్ 10, 2019 నాటి 'ది హిందూ' మీడియా సంస్థకు సంబంధించిన వార్తా కథనాన్ని మేము కనుగొన్నాము. ఆ కథనం ప్రకారం, అనగాని సత్య ప్రసాద్‌ కు ఓటు వేయమని బాపట్ల జిల్లాలోని రేపల్లె ఓటర్లను టీడీపీకి ఓటు వేయమని సమంత కోరారు. అనగాని సత్య ప్రసాద్‌ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలోని రేపల్లె నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే (శాసనసభ సభ్యుడు)గా ఉన్నారు.
మేము YouTubeలో 2019లో వైరల్ వీడియోకు సంబంధించి నిడివి ఎక్కువ ఉన్న వీడియోను మేము కనుగొన్నాము. ఆ వీడియోలో, సమంత సత్య ప్రసాద్‌కు మద్దతు ఇవ్వాలని, ఆయనను గెలిపించాలని రేపల్లె ఓటర్లను కోరారు. అనగాని సత్య ప్రసాద్, సమంతా ప్రభు స్థాపించిన ప్రత్యూష ఫౌండేషన్‌కు సహ వ్యవస్థాపకులు. అతని సోదరి డాక్టర్ మంజులతో సమంతకు చాలా ఏళ్ల నుండి స్నేహం ఉంది.
2019 ఎన్నికల సమయంలో చిత్రీకరించిన సమంత ఒరిజినల్ ఫుటేజ్ నుండి "అభివృద్ధికి ఓటు వేయండి", "సైకిల్ గుర్తుకు ఓటు వేయండి" అనే భాగాలను మాత్రమే తీసుకుని ఎడిట్ చేసి పోస్టు చేశారు. అంతే తప్ప ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ప్రచారానికి, ఎలాంటి సంబంధం లేదు.
Full View

‘Samantha supports TDP’ అనే కీవర్డ్ సెర్చ్‌ని ఉపయోగించి.. మేము ఇండియా టుడేలో ఏప్రిల్ 11, 2019 నాటి కథనాన్ని కూడా కనుగొన్నాము. సమంత టీడీపీకి మద్దతు ఇచ్చిన తర్వాత విమర్శలు ఎదుర్కొన్నట్లు తెలిసింది. సత్య ప్రసాద్‌ కు మీరు మద్దతు ఇస్తున్నారా అని ఒక ట్విట్టర్ యూజర్ ప్రశ్నించగా.. అందుకు సమంత సమాధానం కూడా ఇచ్చింది. సత్య ప్రసాద్ ఒక మంచి వ్యక్తి అని.. తాను హైదరాబాద్ కు వచ్చినప్పటి నుండి ఆయనతో పరిచయం ఉందని సమంత వివరించింది. అందుకే ఆయనకు ఓటు వేయమని కోరానని తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికలకు ముందు సైకిల్ గుర్తుకు సమంత ప్రభు ఓటు వేయమన్నారని.. సోషల్ మీడియా యూజర్ చేసిన వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. సోషల్ మీడియాలో సర్క్యులేషన్‌లో ఉన్న వైరల్ వీడియో సెలెక్టివ్ షాట్‌లను ఎడిట్ చేసి, సమంత ప్రభు ప్రకటనలకు వక్రీకరించారు.


Claim :  Video showing actress Samantha Prabhu appealing to voters to vote for TDP is edited
Claimed By :  Social media users
Fact Check :  Misleading
Tags:    

Similar News