ఫ్యాక్ట్ చెక్: అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్న సభలో పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేసిన వీడియో ఇటీవలిది కాదు

2020లో జరిగిన సభకు సంబంధించిన విజువల్స్

Update: 2025-05-19 11:35 GMT

పీఓకే, పాకిస్తాన్ లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత కేంద్రం తరపున విదేశాలకు వెళ్లే అఖిలపక్ష ప్రతినిధుల బృందంలో AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ చేరారు.

అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్ కుట్రలను ఎండగట్టేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన ఏడు అఖిలపక్ష బృందాలు 33 దేశాల రాజధానులను సందర్శించనున్నాయి. ఎన్డీయే నుంచి 31 మంది, ఇతర పార్టీలకు చెందిన 20 మంది, 8 మంది మాజీ దౌత్యవేత్తలు కలిపి మొత్తం 59మంది సభ్యులు ఉంటారు. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లోని యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శిస్తారు. మే 23 నుంచి ఈ బృందాల పర్యటనలు ప్రారంభం కానున్నాయి.

"పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాద బాధితదేశంగా పాకిస్థాన్ తయారయ్యింది. ఇది (పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు) ముహమ్మద్ జియా-ఉల్-హక్ కాలంలో ప్రారంభమైంది, కాందహార్ విమాన హైజాక్, 26/11 ముంబై ఉగ్రవాద దాడి, 2001 పార్లమెంటు దాడులు, ఉరి, పఠాన్‌కోట్ సంఘటనలు, రియాసిలో ఏడుగురు పర్యాటకుల హత్య, పహల్గామ్ గురించి కూడా మనం ప్రపంచానికి చెప్పాలి. ఇది మానవాళికి ప్రమాదకరం" అని ఒవైసీ ఇటీవల తెలిపారు. పాకిస్తాన్ తనను తాను 'ఇస్లామిక్' దేశంగా చూపించుకోవడం అంతా అబద్ధమని, భారతదేశంలో కూడా 20 కోట్ల మంది ముస్లింలు ఉన్నారని ప్రపంచం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అసదుద్దీన్ అన్నారు.

ఇంతలో అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్న కార్యక్రమంలో పాకిస్థాన్ కు అనుకూలంగా నినాదాలు చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.



ఈ వీడియోకు 87000కు పైగా లైక్స్ వచ్చాయి. చాలా మంది ఇటీవల చోటు చేసుకున్న ఘటనగా భావించి విమర్శలు గుప్పిస్తున్నారు.



వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు



 



ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వీడియో ఇటీవలిది కాదు. 2020లో చోటు చేసుకున్న ఘటన.

మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేయగా ఈ వీడియోను పలు మీడియా సంస్థలు తమ తమ యూట్యూబ్ ఛానల్స్ లో అప్లోడ్ చేశాయి.

Full View


Woman interrupts Owaisi with ‘Pakistan Zindabad’ slogans at anti-CAA rally అనే టైటిల్ తో అదే వీడియోను హిందుస్థాన్ టైమ్స్ తన యూట్యూబ్ ఛానల్ లో 20 ఫిబ్రవరి 2020న పోస్టు చేసింది.


Full View


'Pakistan zindabad' slogans raised at AIMIM's anti-CAA rally అనే టైటిల్ తో 21 ఫిబ్రవరి 2020న ది ప్రింట్ సంస్థ కూడా వీడియోను పోస్టు చేసింది. సిఏఏకు వ్యతిరేకంగా సాగుతున్న నిరసనల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ ఘటనకు సంబంధించి పలు మీడియా సంస్థలు ఫిబ్రవరి, 2020లో పలు నివేదికలు ప్రచురించాయి. పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన అమ్మాయిని ఓ స్టూడెంట్ యూనియన్ నేతగా గుర్తించారు.

బెంగళూరులో జరిగిన CAA వ్యతిరేక కార్యక్రమంలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసినందుకు దేశద్రోహం కేసును అమూల్య లియోనా నోరోన్హాపై నమోదు చేశారు. AIMIM చీఫ్, లోక్‌సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నిర్వహించిన ర్యాలీలో అమూల్య నోరోన్హా వేదికపైకి వచ్చారు. 19 ఏళ్ల అమ్మాయి "పాకిస్తాన్ జిందాబాద్" అని మూడుసార్లు నినాదాలు చేయడంతో, ఒవైసీతో సహా నిర్వాహకులు ఆమెను ఆపడానికి పరిగెత్తారు.

ఓవైసీ ఆమె చేతుల్లో నుండి మైక్ లాక్కోవడానికి పరుగెత్తారు. పోలీసులు జోక్యం చేసుకుని ఆమెను వేదిక నుండి దించేశారు.ఆ మహిళతో తాను ఎన్నటికీ ఏకీభవించనని ఓవైసీ సభలో ప్రసంగించారు.

"నాకు లేదా నా పార్టీకి ఆమెతో ఎటువంటి సంబంధం లేదు. మేము ఆమె వ్యాఖ్యలను ఖండిస్తున్నాము. నిర్వాహకులు ఆమెను ఇక్కడికి ఆహ్వానించి ఉండకూడదు. ఇలాంటి విషయం గురించి తెలిసి ఉంటే నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదు. అందరం భారతదేశం కోసం ఉన్నాము. శత్రు దేశం పాకిస్తాన్‌కు ఏ విధంగానూ మద్దతు ఇవ్వము. మా మొత్తం పోరాటం భారతదేశాన్ని రక్షించడమే" అని AIMIM MP అన్నారు.

ఈ ఘటనకు సంబంధించిన పలు నివేదికలను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.

2020లో బెంగళూరులో నిర్వహించిన CAA వ్యతిరేక కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

వైరల్ అవుతున్న వీడియో ఇటీవలిది కాదు.


Claim :  2020లో జరిగిన సభకు సంబంధించిన విజువల్స్
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News