ఫ్యాక్ట్ చెక్: ఎమ్మెల్సీ పదవి దక్కకపోవడంతో పిఠాపురంలో వర్మ అనుచరులు విధ్వంసం సృష్టించారంటూ జరుగుతున్న ప్రచారం నిజం కాదు

వైరల్ వీడియో ఇటీవలిది కాదు. 2024లో అసెంబ్లీ ఎన్నికల

Update: 2025-03-13 05:31 GMT

రోజుల తరబడి తీవ్ర చర్చల తర్వాత, టీడీపీ మార్చి 9, 2025న ఎమ్మెల్యే కోటాలో ఐదు శాసనమండలి స్థానాలకు జరగనున్న ఎన్నికలకు ముగ్గురు నాయకులను అభ్యర్థులుగా ప్రకటించింది.ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా టీడీపీ నేతలు బీటీ నాయుడు, బీద రవిచంద్రయాదవ్‌, కావలి గ్రీష్మ నామినేషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీ ఆవరణలో రిటర్నింగ్ అధికారికి వీరు నామినేషన్‌ పత్రాలు సమర్పించారు.

నలుగురు టీడీపీ ఎమ్మెల్సీలు యనమల రామకృష్ణుడు, పి. అశోక్ బాబు, బి.టి.నాయుడు, దువ్వరపు రామారావు పదవీ కాలం మార్చి 29న ముగియనుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ)కి రాజీనామా చేసి టీడీపీలో చేరిన జంగా కృష్ణమూర్తి ఖాళీ చేసిన సీటు మే 14, 2024 నుండి ఖాళీగా ఉంది. ఈ ఐదు ఖాళీలను భర్తీ చేయడానికి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.

ఐదు స్థానాల్లో, జనసేన పార్టీ (జెఎస్పీ) అభ్యర్థి కొణిదెల నాగబాబు నామినేషన్ దాఖలు చేయగా, మిగిలిన నాలుగు స్థానాలలో మూడు స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది.

సీనియర్ నాయకుడు సోము వీర్రాజును భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలోని ఐదు స్థానాలకు ఎమ్మెల్యే కోటా కింద ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల సంఘం మార్చి 20న పోలింగ్ షెడ్యూల్ చేసింది. ఫలితాలు కూడా అదే రోజున రానున్నాయి.

2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయి. ఆ సమయంలో పలువురు టికెట్లను త్యాగం చేశారు. పిఠాపురం నియోజకవర్గం నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. టీడీపీకి చెందిన వర్మ ఆ సమయంలో వెనక్కు తగ్గారు. అయితే వర్మకు తప్పకుండా ఎమ్మెల్సీ పదవిని ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.

ఇటీవల టీడీపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ వర్మ పేరు కనిపించకపోవడంపై ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.

"పిఠాపురం లో వర్మకి MLC ఇవ్వకపోవడం పైన రగులుతున్న తెగులు తమ్ముళ్లు" అంటూ పలువురు పోస్టులు పెట్టారు.







Full View


వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు



 


ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి. ఈ వీడియోలు ఇటీవలివి కాదు. 2024 నుండి ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయి.

మేము సంబంధిత కథనాల కోసం వెతకగా ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు పిఠాపురంలో చోటు చేసుకోలేదని తెలుస్తోంది.

వర్మ ఎమ్మెల్సీ పదవి దక్కకపోవడంతో స్పందించారు. ఆయన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో మాట్లాడిన వ్యాఖ్యలను పోస్టు చేశారు.

"@ncbn గారు @naralokesh గారు నా నాయకులు. వాళ్లకు అన్ని తెలుసు. మాకు సరైన న్యాయం జరుగుతుంది అనే నమ్మకంతో ఉన్నాం" అని ఆ పోస్టు ఉంది. అందులో ఉన్న వీడియోలో తనకు న్యాయం జరుగుతుంది అంటూ వర్మ చెప్పడం వినవచ్చు.



ఇక వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను తీసుకుని మేము గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం.

Pithapuram TDP Activists Warning to Pawan Kalyan | SVSN Varma | ‪@SakshiTV‬ అనే టైటిల్ తో సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్ లో మరింత నిడివి ఉన్న వీడియోను మేము గమనించాం. వైరల్ వీడియోను 14 మార్చి 2024న అప్లోడ్ చేశారు. దీన్ని బట్టి ఎన్నికల సీట్ల పంపకాల సమయంలో చోటు చేసుకుందని ధృవీకరించాం.

Full View


పిఠాపురం టీడీపీలో అసంతృప్తి సెగలు అంటూ న్యూస్ ప్రెజెంటర్ ఈ వీడియో ఆరంభంలో నివేదించారు.

Pithapuram TDP Activists Warning to Pawan Kalyan | SVSN Varma | ‪@SakshiTV‬ అనే టైటిల్ తో సాక్షిటీవీ యూట్యూబ్ ఛానల్ లో వీడియోలు మాకు కనిపించాయి.

Full View


కాబట్టి, వైరల్ వీడియో ఇటీవలిది కాదని 2024 నుండి ఆన్ లైన్ లో ఉన్నాయని ధృవీకరించాం. తప్పుడు వాదనతో ప్రజలను ఈ వీడియోలతో తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు.


Claim :  వైరల్ వీడియో ఇటీవలిది కాదు. 2024లో అసెంబ్లీ ఎన్నికల సమయం లోనిది
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News