ఫ్యాక్ట్ చెక్: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈవీఎం హ్యాకింగ్ జరిగిందంటూ అమెరికా నేతలు చెప్పలేదు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈవీఎంల హ్యాకింగ్

Update: 2025-04-25 13:03 GMT

భారత దేశంలో పలు ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (EVMలు) ఉపయోగిస్తూ ఉన్నారు. ఈవీఎంల ట్యాపరింగ్ జరుగుతోందంటూ పలు పార్టీల నేతలు గతంలో ఆరోపించారు.

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ట్యాంపరింగ్ చేశారని, పేపర్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరగాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇది వరకే తిరస్కరించింది. అందుకు సంబంధించిన అధికారి ముందు ఫిర్యాదులను తెలియజేయాలని పిటిషనర్‌ను కోరింది. "మీరు ఎన్నికల్లో గెలిస్తే, EVMలు ట్యాంపరింగ్ జరిగి ఉండదు. మీరు ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు, EVMలు ట్యాంపరింగ్ అయినట్లా" అని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ప్రసన్న బి వరలేలతో కూడిన ధర్మాసనం తెలిపింది. చాలా దేశాలు EVMలను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉన్నందున పేపర్ బ్యాలెట్ ఓటింగ్‌కు వెళ్లాయని పిటిషనర్ కె.ఎ. పాల్ ఈ సందర్భంగా వాదించారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాపరింగ్ జరిగిందంటూ పలువురు నాయకులు ఆరోపించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాక వైసీపీ నేతలు కూడా ఈవీఎంలపై ఆరోపణలు గుప్పించారు.

అమెరికా నేతలు కూడా అదే మాట చెబుతున్నారంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
"అతి త్వరలో ఏపీలో పెద్ద స్కాం బయటకు రాబోతుంది. ఏపీలో ఓట్లు మిస్ మ్యాచ్ అవ్వడానికి ໐ ໑໖ EVM software engineer ఈవీఎంలు హ్యాక్ చేస్తున్నారు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి" అనే టెక్స్ట్ ఉన్న వీడియో వైరల్ అవుతూ ఉంది. ఈ వీడియోలో అమెరికా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసీ గబ్బార్డ్ మాట్లాడుతూ ఉండడం చూడొచ్చు. ఇక కింద ఫ్రేమ్ లో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఆయన ముందు ఈవీఎం మెషీన్ ఉంది.



"భారత్ లో ఈవీఎం లను హ్యాక్ చేస్తున్నారు మా దగ్గర రుజువులు ఉన్నాయి...
- అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బార్డ్..
Best example - AP Assembly Results , Telangana parliament results. ..Hack avvakunda Aa results undevi kaavu ..just saying.
@PMOIndia @BJP4India @INCIndia @ECISVEEP" అంటూ మరో పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

Full View


వైరల్ అవుతున్న పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు



 


ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. భారతదేశంలో ఈవీఎం ట్యాపరింగ్ జరిగిందంటూ తులసీ గబ్బార్డ్ చెప్పలేదు.

వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్లను తీసుకుని మేము గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. తులసీ గబ్బార్డ్ ఈవీఎంల గురించి మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించిన విజువల్స్ లభించాయి.

Full View


Full View



మేము సంబంధిత కీవర్డ్స్ తో సెర్చ్ చేయగా ఏప్రిల్ 10, 2025న అమెరికా క్యాబినెట్ సమావేశంలో తులసీ గబ్బార్డ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా ఎక్కువ నిడివి ఉన్న వీడియో మాకు లభించింది. Right Side Broadcasting Network యూట్యూబ్ ఛానల్ లో "FULL MEETING: President Trump Holds a Cabinet Meeting from the White House - 4/10/25" అనే టైటిల్ తో వీడియోను అప్లోడ్ చేశారు.

Full View


వైరల్ క్లిప్పింగ్ 34:00 వద్ద మొదలవుతుంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ వ్యవస్థలు హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశం ఉందని అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పేపర్ బ్యాలెట్‌లకు మారాలని పిలుపునిచ్చారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరైన క్యాబినెట్ సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు, అక్కడ ఆమె ఓటింగ్ యంత్రాల భద్రతా లోపాలకు సంబంధించిన ఆధారాలను ప్రదర్శించారు. 2020 ఎన్నికల సమయంలో మాజీ సైబర్ సెక్యూరిటీ చీఫ్ క్రిస్ క్రెబ్స్ చర్యలపై దర్యాప్తు చేయాలని న్యాయ శాఖ ని ఆదేశించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేసిన ఒక రోజు తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది.

ఆమె చేసిన వ్యాఖ్యలను పలు మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురించాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.

తులసీ గబ్బార్డ్ ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే భారత ఎన్నికల కమీషన్ భారతదేశంలో ఉపయోగించే ఈవీఎం మెషీన్లను ట్యాపరింగ్ చేయడానికి వీలవ్వదంటూ ప్రకటనను విడుదల చేసింది. భారతదేశంలో ఉపయోగించే EVMలు సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్నాయని, పోలింగ్ ప్రారంభానికి ముందు మాక్ పోల్స్ నిర్వహించడంతో సహా వివిధ దశలలో రాజకీయ పార్టీలు వీటిని ఎల్లప్పుడూ తనిఖీ చేస్తాయని EC వర్గాలు తెలిపాయి. పార్టీల ముందు లెక్కింపు సమయంలో ఐదు కోట్లకు పైగా VVPAT స్లిప్‌లను ధృవీకరించి సరిపోల్చినట్లు తెలిపారు.

ఆ కథనాలను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.


ఈ కథనాలను, తులసీ గబ్బార్డ్ చేసిన వ్యాఖ్యలను పరిశీలించిన తర్వాత ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ లో లేదా భారతదేశంలో ఈవీఎంలు హ్యాక్ అయ్యాయని ఆమె చెప్పలేదని తెలుస్తోంది.

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.


Claim :  ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈవీఎంల హ్యాకింగ్ జరిగిందని
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News