ఫ్యాక్ట్ చెక్: తిరుమల క్యూలైన్ లో భక్తురాలికి పాముకాటు అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్న టీటీడీ

తిరుమల క్యూలైన్ లో భక్తురాలికి పాముకాటు అంటూ

Update: 2026-02-23 11:40 GMT

తిరుమల క్యూ లైన్ లో భక్తురాలిని పాము కాటేసింది అంటూ కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రూ.300 దర్శన క్యూలైన్‌లో.. ఓ భక్తురాలిని పాము కాటేసింది.. దీంతో అప్రమత్తమైన తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది ఆమెను అశ్విని ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతి స్విమ్స్‌‌కు తరలించి చికిత్స అందించారని కథనాలు వెలువడ్డాయి. తెలంగాణలోని భూపాలపల్లి చెందిన మౌనిక అనే మహిళకు ఇలా జరిగింది అంటూ కథనాలు వచ్చాయి.


వైరల్ పోస్టులు ఇక్కడ చూడొచ్చు

Full View


Full View



Full View


వైరల్ కథనాలకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇక్కడ ఉన్నాయి



 



ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని టీటీడీ తెలిపింది.

తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన శరత్ బాబు, మౌనిక దంపతుల తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. మౌనిక రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూ లైన్‌లో ఉన్న సమయంలో ఆమెను పాము కాటు వేసినట్టుగా వార్తలు వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న టీటీడీ సిబ్బంది వెంటనే స్పందించారు.

ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల కోసం టీటీడీ అధికారిక వెబ్సైట్ ను పరిశీలించాం. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదంటూ టీటీడీ వివరణ ఇచ్చింది.

"తిరుమలలో ” దర్శన క్యూలైన్ లో మహిళా భక్తురాలికి పాము కాటు” అని వివిధ ప్రసార మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా వాస్తవ దూరమని టీటీడీ తెలిపింది. తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాకు చెందిన శరత్ బాబు, మౌనిక అనే దంపతులు ఆదివారం రాత్రి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చారు. ఈ నేపథ్యంలో ట్యాక్సీలో మ్యూజియం సమీపాన ఉన్న ఆర్.బి.సెంటర్ పార్కింగ్ ఏరియాకు చేరుకోగానే శ్రీమతి మౌనిక తన పాదాలకు పసుపు రాసుకునేందుకు చీకటిలో పక్కనే ఉన్న స్థలంలోకి వెళ్లింది. ఈ క్రమంలో కాలుపై స్పర్శ తగలడంతో భయబ్రాంతులకు లోనైంది. తన భర్త శరత్ ఆ ప్రాంతాన్ని పరిశీలించగా చిన్న పాము కనిపించింది. వెంటనే భద్రతా సిబ్బందికి సమాచారం అందించడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే తిరుమలలోని అశ్వినీ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించే ఎలాంటి పాము కాటు లేదని నిర్ధారించారు. అయినప్పటికీ మహిళా భక్తురాలి ఆరోగ్య శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి పంపించడం జరిగింది. అక్కడ కూడా వైద్యులు పరీక్షలు నిర్వహించి ఎలాంటి సమస్య లేదని నిర్ధారించారు. ఆ పాము కూడా విషపూరితం కాదని విచారణలో తేలింది. సదరు భక్తులు టీటీడీ సిబ్బంది సహకారానికి కృతజ్ఞతలు తెలియజేశారు." అంటూ టీటీడీ ఓ ప్రకటనను విడుదల చేసింది.

అధికారిక ప్రకటనకు సంబంధించిన లింక్ ను ఇక్కడ చూడొచ్చు. 

అంతేకాకుండా టీటీడీ భక్తులకు ఓ విజ్ఞప్తి కూడా చేసింది. భక్తులు తమ భద్రత దృష్ట్యా టీటీడీ నిర్దేశించిన ప్రాంతాల నుండి మాత్రమే క్యూలైన్లలోకి వెళ్లాలి గానీ, తిరుమల పరిసరాల్లోని నిషేధిత అటవీ ప్రాంతాల్లో సంచరించకూడదని టీటీడీ కోరింది.

ఇక మహిళ భర్త మాట్లాడిన క్లిప్ ను ఇక్కడ చూడొచ్చు.

Full View



ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం కూడా ఈ ఘటనపై స్పందించింది. "తిరుమల క్యూలైన్ లో భక్తురాలు పాము కాటుకు గురి అయినట్లు కొందరు చేస్తున్న ప్రచారంలో నిజం లేదు. వాస్తవానికి జరిగింది ఏమిటంటే వరంగల్ కు చెందిన శరత్ బాబు, మౌనిక దంపతులు ఆదివారం (ఫిబ్రవరి 22, 2026) రాత్రి స్వామి దర్శనం కోసం టాక్సీలో ఎస్వీ మ్యూజియం వద్దకు వచ్చారు. ఆర్.బి. సెంటర్ పార్కింగ్ ఏరియా వద్దకు రాగానే తన కాలికి పసుపు రాసుకునే ఉద్దేశ్యంతో మౌనిక కారు నుంచి క్రిందకు దిగారు. ఆ సమయంలో తన కాలికి ఏదో తాకడంతో ఆమె భయంతో గట్టిగా అరిచారు. వెంటనే ఆమె భర్త శరత్ బాబు వెతికి చూడగా అక్కడ ఒక పాము పిల్ల కనిపించింది. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది మౌనికను తిరుమల లోని అశ్విని హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. భక్తురాలిని పరిశీలించిన డాక్టర్లు ఆమె పాముకాటుకు గురి కాలేదని నిర్ధారించారు. అయినప్పటికీ భక్తురాలి క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తు జాగ్రత్తగా ఆమెను తిరుపతిలోని స్విమ్స్ లో చేర్చడం జరిగింది. స్విమ్స్ డాక్టర్లు కూడా మౌనిక పాము కాటుకు గురికాలేదని చెప్పారు. పైగా విచారణలో అక్కడ కనిపించిన పాము విషరహిత సర్పంగా తేలింది. ఘటన జరిగిన వెంటనే టీటీడీ సిబ్బంది స్పందించిన తీరుకు ఆ దంపతులు కృతజ్ఞతలు తెలియజేసారు. సోమవారం ఉదయం ఆ దంపతులు స్వామిని దర్శించుకున్నారు. జరిగింది ఇది. కాబట్టి కొందరు చేస్తున్న ఫేక్ ప్రచారాలను భక్తులు నమ్మకండి." అంటూ వివరణ ఇచ్చింది. 



తిరుమల క్యూలైన్ లో భక్తురాలికి పాముకాటు అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని టీటీడీ ధృవీకరించింది.


Claim :  తిరుమల 300 రూపాయల క్యూలైన్ లో భక్తురాలికి
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News