ఫ్యాక్ట్ చెక్: 2020 నుండి ఆన్ లైన్ లో ఉన్న వీడియోను బారాముల్లాలో సైన్యంపై జరిగిన దాడిగా వైరల్ చేస్తున్నారు
2026 లో జమ్మూ కశ్మీర్‌లో యుద్ధం లాంటి పరిస్థితి కొనసాగుతుందనే వాదనతో
జమ్మూ కశ్మీర్ లోని ఉగ్ర మూకలపై భారత భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు విరుచుకుపడుతూ ఉన్నాయి. 2026 ఫిబ్రవరి నెలలో కూడా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భారత సైన్యం పని చేసింది. ఫిబ్రవరి 22న కిష్త్వార్ జిల్లాలోని చత్రూ ప్రాంతంలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన ముగ్గురు ఉగ్రవాదులలో జైష్-ఎ-మహమ్మద్ టాప్ కమాండర్ కూడా ఉన్నాడు. ఇది పిర్ పంజాల్ శ్రేణికి దక్షిణంగా పనిచేస్తున్న ఉగ్రవాద నెట్‌వర్క్‌లకు గణనీయమైన దెబ్బ. ప్రాథమిక అంచనాల ప్రకారం హతమైన వారిలో ఒకరు సైఫుల్లా అని అధికారులు తెలిపారు. అతను దాదాపు ఐదు సంవత్సరాల క్రితం జమ్మూ కశ్మీర్‌లోకి చొరబడి అప్పటి నుండి చురుకుగా ఉన్నాడు.
జూలై 2024లో జరిగిన దాడితో సహా భద్రతా దళాలపై జరిగిన అనేక ప్రాణాంతక దాడులకు అతను సూత్రధారి అని అనుమానిస్తున్నారు, ఈ దాడిలో నలుగురు సైనికులు మరణించారు. సైఫుల్లా గతంలో జరిగిన అనేక దాడుల నుండి తప్పించుకున్నట్లు సమాచారం. నిర్దిష్ట నిఘా సమాచారం ఆధారంగా సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, పారామిలిటరీ దళాల సంయుక్త బృందం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించిన తర్వాత పాసర్‌కుట్-చత్రూ దట్టమైన అడవులలో కాల్పులు జరిగాయి. ఉగ్రవాదులు దాక్కున్నారని భావిస్తున్న మట్టి ఇంటిని బలగాలు చుట్టుముట్టడంతో, ఉగ్రవాదులు కాల్పులు జరిపారు, దీనితో తీవ్ర ఘర్షణ జరిగింది.
2026 లో జమ్మూ కశ్మీర్‌లో యుద్ధం లాంటి పరిస్థితి కొనసాగుతుందనే వాదనతో భారత ఆర్మీ సిబ్బంది ఉగ్రవాదులతో సాగిస్తున్న పోరాటం అంటూ చూపించే ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. ఒక గదిలో ఉన్న సాయుధ సైనికులు కిటికీ నుండి బయట ఉన్న వ్యక్తులపై కాల్పులు జరుపుతున్నట్లు ఫుటేజ్‌లో ఉంది. వైరల్ పోస్టులకు సంబంధించిన ఆర్కైవ్ లింక్స్ ఇక్కడ ఉంది.
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియో ఇటీవలిది కాదు.
బారాముల్లాలో ఇటీవల ఎన్‌కౌంటర్ గురించి ఒకే సంఘటనలో ముగ్గురు సైనికులు మరణించారని, ఎనిమిది మంది గాయపడ్డారని వైరల్ వాదనకు అనుగుణంగా అధికారిక నివేదికలు లేవు. 'యుద్ధం లాంటి పరిస్థితి' అక్కడ తలెత్తిందంటూ ఎలాంటి కథనాలు లభించలేదు.
భారత ఆర్మీకి సంబంధించిన పలు కథనాలను ఎప్పటికప్పుడు ప్రచురించే సోషల్ మీడియా ఖాతాలను ఇక్కడ చూడొచ్చు.
https://x.com/adgpi
ఇటీవల జరిగిన సంఘర్షణలకు సంబంధించి ఇండియన్ ఆర్మీ చేసిన ట్వీట్ ను ఇక్కడ చూడొచ్చు
ఎన్‌కౌంటర్ స్థలం నుండి రెండు AK-47 రైఫిళ్లు, ఇతర యుద్ధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని ఇండియన్ ఆర్మీ అధికారులు తెలిపారు. ప్రాథమిక సమాచారాన్ని ఉటంకిస్తూ, హతమైన ఉగ్రవాదులు పాకిస్తాన్ జాతీయులు, నిషేధిత జైష్-ఎ-మొహమ్మద్ సంస్థ సభ్యులని అధికారులు తెలిపారు.
ఆర్మీకి చెందిన వైట్ నైట్ కార్ప్స్ Xలో “వ్యూహాత్మక ఖచ్చితత్వం, సజావుగా సినర్జీ, దృఢమైన దూకుడును ప్రదర్శిస్తూ, దళాలు ఎన్‌కౌంటర్ ప్రదేశంలో ఆధిపత్యం చెలాయించాయి, ఇక్కడ ఇద్దరు ఉగ్రవాదులను హతం చేశారు.” అని అందులో ప్రస్తావించారు.
ఇక వైరల్ వీడియోలోని స్క్రీన్ షాట్స్ ను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా 2020 నుండి ఆన్ లైన్ లో ఉందని మేము నిర్ధారించాం.
అయితే ఈ వీడియో జమ్మూకశ్మీర్ నుండి వచ్చిందా? లేక ఇతర ప్రాంతాల నుండి వచ్చిందా? అనే విషయాన్ని తెలుగు పోస్ట్ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్వతంత్రంగా నిర్ధారించలేకపోయింది.
అయితే వైరల్ వీడియో మాత్రం 2020 నుండి ఆన్ లైన్ లో ఉందని నిర్ధారించాం.
Claim : జమ్మూ కశ్మీర్ లోని ఉగ్ర మూకలపై భారత భద్రతా బలగాలు
Claimed By : Social Media Users
Fact Check : Unknown