ఫ్యాక్ట్ చెక్: ఫ్రాన్స్ ప్రెసిడెంట్ రాఫెల్ డీల్ విషయంలో భారత్ ను విమర్శించారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు
ఫ్రాన్స్ ప్రెసిడెంట్ రాఫెల్ డీల్ విషయంలో భారత్ ను విమర్శించారంటూ
మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భారత్ కు వచ్చారు. విమానాశ్రయంలో ఆయనకు మహారాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సాదర స్వాగతం పలికారు. భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ పర్యటనకు వచ్చారు. మాక్రాన్‌తో పాటు ఆయన సతీమణి, ఫ్రాన్స్ ప్రథమ పౌరురాలు బ్రిజిట్ మాక్రాన్ కూడా భారత్‌కు విచ్చేశారు.
రాఫెల్ ఫైటర్ జెట్ల అమ్మకాలు, మార్కెట్ తగ్గడానికి భారత వైమానిక దళం కారణమైందని ఆయన విమర్శించినట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. పూర్తి రక్షణ భాగస్వామ్యం కోసం భారతదేశం చేసిన అభ్యర్థనను ఫ్రాన్స్ తిరస్కరించిందని మాక్రాన్ పేర్కొన్నట్లుగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారతదేశం రాఫెల్ జెట్లను ఉపయోగించడం, వైఫల్యం చెందడం వల్ల విమానం మార్కెట్ విలువ తగ్గిందని ఆయన అన్నట్లుగా పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఆర్కైవ్ చేసిన లింక్స్ ను ఇక్కడ చూడొచ్చు.
వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేశాం. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భారతదేశానికి వ్యతిరేకంగా అలాంటి వ్యాఖ్యలు ఏవీ చేయలేదని స్పష్టంగా తెలుస్తోంది.
భారత్ అంటే తనకు చాలా ఇష్టమని ఆయన చెప్పారు. రాఫెల్ యుద్ధ విమానాలు భారత్‌ను బలీయమైన సైనిక శక్తిగా మారుస్తాయని తెలిపారు. అదేవిధంగా రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత మెరుగుపరుస్తాయని చెప్పుకొచ్చారు. భారత్-ఫ్రాన్స్ మధ్య ఉన్న బంధం ప్రత్యేకమైనది. వ్యూహాత్మక ప్రయోజనాలున్న అనేక రంగాల్లో సహకారాన్ని విస్తరించుకోవడానికి అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు. 114 రాఫెల్ యుద్ధ విమానాల కోసం ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం, భారత రక్షణ సన్నద్ధతకు వ్యూహాత్మక బలాన్ని ఇస్తుందని మాక్రాన్ అన్నారు.
అందుకు సంబంధించిన కథనాలను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
ఆయన స్పీచ్ ను కూడా ఇక్కడ చూడొచ్చు
గూగుల్ జెమిని వైరల్ వీడియోను విశ్లేషించింది. వైరల్ వీడియోలోని ఆడియోను డిజిటల్ గా మానిప్యులేట్ చేశారని స్పష్టం చేసింది. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు.
డిజిటల్ మానిప్యులేషన్ జరిగినట్లుగా పలు ఏఐ డిటెక్షన్ టూల్స్ స్పష్టం చేసింది. ఆడియో మాక్రాన్ నిజమైన ప్రసంగం నుండి రాలేదని సూచించాయి.
కాబట్టి, వైరల్ అవుతున్న వీడియోలోని వాయిస్ ను డిజిటల్ గా సృష్టించారు.
Claim : ఆయన అలాంటి ప్రకటన ఏదీ చేయలేదు
Claimed By : Social Media Users
Fact Check : Unknown