ఫ్యాక్ట్ చెక్: వైసీపీ రంగులు పోలి ఉన్న ప్రభ కాలిపోయిన ఘటన గతంలో చోటు చేసుకుంది. ఆ ప్రమాదాన్ని ఇప్పటిదిగా ప్రచారం చేస్తున్నారు

వైసీపీ రంగులు పోలి ఉన్న ప్రభ కాలిపోయిన ఘటన

Update: 2026-02-17 06:58 GMT

తెలుగు రాష్ట్రాల్లోనే పేరుగాంచిన కోటప్పకొండ తిరునాళ్లను అత్యంత వైభవంగా నిర్వహించారు. రంగురంగుల కాంతులతో అలంకరించిన భారీ ప్రభలు కొండ వైపు సాగాయి. ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన సందర్శకులతో కొండ పరిసరాలు కళకళలాడాయి. వివిధ ప్రాంతాల నుంచి ప్రభంనిధి వద్దకు 24 భారీ విద్యుత్‌ ప్రభలు చేరుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించడానికి లక్షలాది సంఖ్యలో జనం కోటప్పకొండకు చేరుకున్నారు.


గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో ఉన్న కోటప్పకొండలో మహాశివరాత్రి సందర్భంగా జరిగే ప్రభల ఉత్సవం రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. త్రికోటేశ్వర స్వామిని ప్రసన్నం చేసుకోవాలనే భక్తి భావంతో గ్రామాలు గ్రామాలుగా భక్తులు అద్భుతంగా అలంకరించిన భారీ ప్రభలను ఊరేగింపుగా తీసుకువచ్చి కొండపైకి చేరుకుంటారు. దేశంలోనే అతి పెద్ద శివరాత్రి తిరునాళ్లలో ఒకటిగా పేరు గాంచిన ఈ జాతర రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది. కోటప్పకొండ శివరాత్రి సందర్భంగా సమర్పించే ఒక్కో ప్రభ తయారీకి సుమారు 20 నుంచి 25 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని అంచనా. గ్రామ ప్రజలంతా కలసి విరాళాలు సేకరించి ఈ ప్రభలను నిర్మిస్తూ ఉంటారు.

అయితే కోటప్ప కొండలో వైసీపీకి చెందిన ప్రభ కూలిపోయింది అంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఆర్కైవ్ లింక్స్ ను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు. 

ఆ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు



 ఫ్యాక్ట్ చెకింగ్:


వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ వీడియో చాలాకాలం నుండి ఆన్ లైన్ లో అందుబాటులో ఉంది.

మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేయగా ఇటీవలి కాలంలో అలాంటి ఘటన చోటు చేసుకున్నట్లుగా ఎలాంటి ఫలితాలు మాకు లభించలేదు.

ఇక వైరల్ వీడియో లోని కీఫ్రేమ్స్ ను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించాం.

వైరల్ అవుతున్న వీడియోలోని అదే వీడియో మార్చి 1, 2014న PRASAD KANTU అనే యూట్యూబ్ ఛానల్ లో Kotappa kondalo lighting prabha short circuit in 27-02-2014 అనే టైటిల్ తో అప్లోడ్ చేశారు.

Full View


దీన్ని బట్టి వైరల్ వీడియో 2014 నుండి ఆన్ లైన్ లో అందుబాటులో ఉంది.



 



మా తదుపరి పరిశోధనలో పల్నాడు పోలీసులు చేసిన ఒక పోస్టును గుర్తించాం.

"కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవస్థానం వద్ద ఎలాంటి ప్రభలు తగలబడిన ఘటనలు చోటుచేసుకోలేదని అధికారులు స్పష్టం చేశారు. కొంతమంది కావాలనే పాత వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ అపోహలు సృష్టిస్తున్నారని గుర్తించబడింది.
#Kotappakonda #PublicSafety" అంటూ వివరించారు.



కాబట్టి, వైరల్ అవుతున్న వీడియో ఇటీవలిది కాదు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.


Claim :  వైరల్ వీడియో 2014 నుండి ఆన్ లైన్ లో అందుబాటులో ఉంది
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News