ఫ్యాక్ట్ చెక్: సూర్య కుమార్ యాదవ్ షేక్ హ్యాండ్ ఇస్తే పాకిస్థాన్ కెప్టెన్ స్పందించలేదనే వాదనలో ఎలాంటి నిజం లేదు

సూర్య కుమార్ యాదవ్ షేక్ హ్యాండ్ ఇస్తే పాకిస్థాన్ కెప్టెన్

Update: 2026-02-18 06:49 GMT

2026 టీ20 వరల్డ్ కప్ లో భారత్ పాకిస్తాన్ పై సునాయాసంగా విజయం సాధించింది. కొలంబోలో జరిగిన టీ20 వరల్డ్ కప్ లో భారత్ అద్భుతమైన విజయం సాధించింది. అభిషేక్ శర్మ త్వరగా అవుటయినా ఇషాన్ కిషన్ మరోసారి తన సత్తా చాటాడు. దూకుడుతో ఆడుతూ భారత్ కు పరుగులు తెచ్చిపెట్టాడు. ఇక తర్వాత హార్ధిక్ పాండ్యా, జస్ప్రిత్ బుమ్రాఅద్భుత బౌలింగ్‌తో పాకిస్థాన్‌పై 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఫలితంతో భారత్ సూపర్–8 దశకు చేరుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల కోల్పోయి 175 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ 114 పరుగులకే ఆలౌట్ అయింది.


టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ నెమ్మదిగా ఉన్నా ఇషాన్ 40 బంతుల్లో 77 పరుగులతో జట్టును గట్టెక్కించాడు. తిలక్ వర్మతో కలిసి రెండో వికెట్‌కు 87 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. తిలక్ 25 పరుగులు చేశాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (32), శివమ్ దూబే (27) కలిసి జట్టు స్కోరును 150 దాటించారు. చివరి ఓవర్లో అఫ్రిదీ ఓవర్లో 15 పరుగులు సాధించడంతో భారత్ 175కు చేరింది.

176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. హార్దిక్ పాండ్యా తొలి ఓవర్లో ఫర్హాన్‌ను ఔట్ చేశాడు. ఆ వెంటనే బుమ్రా అయూబ్‌ను యార్కర్‌తో ఎల్బీడబ్ల్యూ చేశాడు. సల్మాన్ అలీ ఆఘాను మిడ్వికెట్‌లో క్యాచ్ ఇచ్చాడు. పదమూడు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన పాకిస్థాన్ ఆ తర్వాత కోలుకోలేకపోయింది. బాబర్ ఆజమ్ అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. పవర్‌ప్లేలోనే 38 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది. మిడిల్ ఓవర్లలో కుల్దీప్ యాదవ్, అక్షర్, తిలక్ వర్మ, వరుణ్ చక్రవర్తి కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. బుమ్రా, హార్థిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి రెండేసి వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్, తిలక్ వర్మ చెరో వికెట్ తీసి పాక్ పతనాన్ని శాసించారు.

ఈ మ్యాచ్ సమయంలో భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ షేక్ హ్యాండ్ ఇచ్చినా కూడా పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా ముందుకు రాలేదంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.

వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు.



 



ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ సమయంలో ఇలాంటి ఘటన చోటు చేసుకుని ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం మేము సంబంధించిన కీలక పదాలను ఉపయోగించి కీవర్డ్ సెర్చ్ చేశాం. అయితే సూర్యకుమార్ యాదవ్‌ షేక్ హ్యాండ్ ఇస్తే సల్మాన్ అలీ ఆఘా తిరస్కరించారని తెలిపే విశ్వసనీయ వార్తా నివేదికలు ఏవీ లభించలేదు.

టాస్ సమయంలో కెప్టెన్ల మధ్య షేక్ హ్యాండ్ లాంటివి జరగలేదని పలు వార్తా సంస్థలు పేర్కొన్నాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు. 




 

మేము ఐసీసీ పోస్టు చేసిన అధికారిక టాస్ వీడియోను కూడా నిశితంగా పరిశీలించాం. ఎక్కడా కూడా సూర్యకుమార్ యాదవ్ సల్మాన్ అలీ ఆఘాతో షేక్ హ్యాండ్ కోసం చేయి చాచినట్లుగా ఎలాంటి విజువల్స్ మాకు లభించలేదు.



ఇక వైరల్ అవుతున్న ఫోటోను నిశితంగా పరిశీలించగా సూర్యకుమార్ యాదవ్ శరీర భంగిమ సహజంగా కనిపించలేదు. చిత్రం కుడి దిగువ మూలలో “జెమిని AI” వాటర్‌మార్క్ కనిపిస్తుంది, ఇది AI జనరేషన్ లేదా ఎడిట్ చేసినట్లుగా సూచిస్తుంది.



 



ఇది ఏఐ సృష్టా అని తెలుసుకోవడం కోసం మేము ఏఐ డిటెక్షన్ టూల్స్ ను ఉపయోగించి పరిశీలించాం. అయితే ఇది ఏఐ సృష్టి అని డిటెక్షన్ టూల్స్ తెలిపాయి.

చిత్రంలో AI- జనరేటెడ్ లేదా డీప్‌ఫేక్ ఎలిమెంట్స్ ఉన్నాయని హైవ్ మోడరేషన్ టూల్ గుర్తించింది.



 



మ్యాచ్‌లోని ఒరిజినల్ స్టిల్‌ను డిజిటల్‌గా రూపొందించారని స్పష్టంగా తెలుస్తోంది. వైరల్ చిత్రం మ్యాచ్ కు సంబంధించిన నిజమైన క్షణాన్ని చూపించదు.

కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు


Claim :  ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ సమయంలో భారత కెప్టెన్ చేయి ఇచ్చినా
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News