ఫ్యాక్ట్ చెక్: శ్రీదేవి నటించిన మామ్ సినిమాలోని సన్నివేశాన్ని నిజ జీవితంలో చోటు చేసుకున్న ఘటనగా ప్రచారం చేస్తున్నారు

శ్రీదేవి నటించిన మామ్ సినిమాలోని సన్నివేశాన్ని నిజ జీవితంలో

Update: 2026-02-23 08:28 GMT

భారతదేశంలో మహిళలపై నేరాలు పెరిగిపోతున్నాయి. గృహ హింసకు సంబంధించిన కేసులు కూడా ఎప్పటికప్పుడు పెరిగిపోతూ ఉన్నాయి. 18 నుండి 49 ఏళ్ల మధ్య ఉన్న మహిళల్లో దాదాపు మూడింట ఒక వంతు తమ జీవితంలో గృహ హింసను ఎదుర్కొన్నట్లు అంగీకరించారు. ఇది సమాజంలో హింస ఎంత సాధారణంగా మారిందో సూచిస్తుంది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వేధింపుల తీరు కూడా మారుతోంది. ఆన్‌లైన్‌లో మానసిక హింసను, బెదిరింపులను ఎదుర్కొంటున్నారు.


చట్టాలను కఠినతరం చేస్తూ 'భారతీయ న్యాయ సంహిత', 'వన్-స్టాప్ సెంటర్లు', 'ఫాస్ట్ ట్రాక్ కోర్టులు' వంటివి తీసుకొచ్చినప్పటికీ.. ఆశించిన స్థాయిలో మార్పు లేదు. విచారణల్లో జాప్యం, నిందితులు తేలికగా తప్పించుకోవడం నేటికీ కొనసాగుతోంది. కేవలం చట్టాలు చేస్తే సరిపోదని.. పాఠశాల స్థాయి నుంచే లింగ సమానత్వం గురించి నేర్పించడం, కోర్టుల ద్వారా త్వరితగతిన న్యాయం అందించడం, మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించడం అత్యవసరమని పలువురు చెబుతున్నారు.

ఇక అమ్మాయిలు బయటకు వెళుతున్నా వారిపై దాడులు సర్వసాధారణం అవుతున్నాయి. అందుకు సంబంధించిన ఓ వీడియో అంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు. రుగు కాలువ దగ్గర ఆపి ఉంచిన కారులోంచి ఒక అమ్మాయిని బయటకు తోసేయడంతో వీడియో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఒక వ్యక్తి కారు నుంచి దిగి, ఆమెను మురుగు కాలువలోకి తన్నడం వంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆ ఇద్దరు నైట్ పార్టీ నుంచి తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగిందని, ఆ అమ్మాయి బాగా తాగి ఉందని సోషల్ మీడియా యూజర్లు తెలిపారు.

వైరల్ పోస్టులకు సంబంధించిన ఆర్కైవ్ లింక్స్ ను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.

వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇక్కడ ఉన్నాయి.



 



ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ వీడియో నిజమైన ఘటన కాదు. శ్రీదేవి ముఖ్యపాత్రలో నటించిన మామ్ సినిమాలో సన్నివేశం.

వీడియోలో చిత్రీకరించబడిన సంఘటన భారతదేశంలో ఎక్కడైనా జరిగిందా అని తెలుసుకోడానికి మేము Googleలో సంబంధిత కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాం. అటువంటి సంఘటనను నిర్ధారించే విశ్వసనీయ వార్తా నివేదికలు లభించలేదు. ఇది నిజమైన సంఘటనగా తేలి ఉంటే మీడియా సంస్థలు నివేదించే అవకాశం తప్పకుండా ఉండేది.

ఇక మేము కీఫ్రేమ్స్ ను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. అయితే మాకు యూట్యూబ్ లో మామ్ సినిమాలో అదే వీడియో కనిపించింది.

Bollywood Premium అనే యూట్యూబ్ ఛానల్ లో ఈ వీడియోను మేము గుర్తించాం. Mom (2017) - Superhit Hindi Movie With English Subtitles | Sridevi, Sajal Ali & Nawazuddin అనే టైటిల్ తో వీడియోను అప్లోడ్ చేశారు.

24:10 టైమ్ స్టాంప్ దగ్గర వైరల్ వీడియో సినిమాలో కనిపిస్తుంది. వైరల్ క్లిప్ లాగానే, యూట్యూబ్ వీడియోలో ఒక అమ్మాయిని మురుగు కాలువలోకి తోసే దృశ్యం చూడొచ్చు. 2 గంటల 26 నిమిషాలకు పైగా ఉన్న పూర్తి వీడియో ఇది. ఓ అమ్మాయిపై జరిగిన అఘాయిత్యానికి సంబంధించిన వీడియో ఇది. వైరల్ క్లిప్ నిజమైన సంఘటనను చూపించలేదు. 2017లో శ్రీదేవి నటించిన మామ్ చిత్రం నుండి వచ్చిన దృశ్యమని తేలింది. యూట్యూబ్ వీడియో వివరణలో హిందీ సినిమా ఇదని స్పష్టంగా తెలిపారు.

Full View


వైరల్ వీడియో, సినిమాలోని సన్నివేశం రెండూ ఒకటేనని ఈ పోలికను బట్టి స్పష్టంగా అర్థం అవుతుంది.



 

కాబట్టి, 2017లో శ్రీదేవి నటించిన మామ్ చిత్రం లోని సన్నివేశాన్ని నిజమైన ఘటనగా భావించి షేర్ చేస్తున్నారు.


Claim :  శ్రీదేవి నటించిన మామ్ సినిమాలోని సన్నివేశాన్ని నిజ జీవితంలో
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News