ఫ్యాక్ట్ చెక్: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆసుపత్రి పాలయ్యారంటూ వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆసుపత్రి పాలయ్యారంటూ వైరల్ అవుతున్న వాదనలో
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 21 పుట్టినరోజు జరుపుకున్నారు. వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా వైసీపీ నేతలు, అభిమానులు, కార్యకర్తల శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియా వేదికగా వైఎస్ జగన్‌కు పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వంటి నేతలు వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.
రాజమండ్రి గోదారి లంకలో వైసీపీ నేతలు ఏర్పాటు జగన్ కు భారీ ఫ్లెక్సీ ని ఏర్పాటు చేశారు. గోదావరి మధ్య బ్రిడ్జి లంకలో వైఎస్ జగన్ భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. జగన్ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాల చిత్రాలతో ఈ ఫ్లెక్సీని రూపొందించారు. గోదావరి మధ్యలో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 23 నుంచి మూడు రోజుల పాటు కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గంలో పర్యటించారు. ఆయన షెడ్యూల్ లో పులివెందుల వైసీపీ క్యాంప్ ఆఫీస్‌లో ప్రజాదర్బార్ కూడా ఉంది. ఇడుపులపాయ ప్రేయర్ హాల్‌లో జరిగే క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో వైఎస్ జగన్ పాల్గొన్నారు.
అయితే వైఎస్ జగన్ ఆసుపత్రి పాలయ్యారంటూ కొన్ని మీడియా సంస్థలు కథనాలను ప్రచారం చేశాయి. ఆయన ఆసుపత్రి బెడ్ మీద ఉన్న ఫోటోలను వైరల్ చేస్తున్నారు. ఆ కథనాలకు వైఎస్ జగన్ ఆసుపత్రి బెడ్ మీద ఉన్న ఫోటోలను ఉపయోగించారు. వాటిని ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
అందుకు సంబంధించిన ఆర్కైవ్ లింక్స్ ను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇక్కడ ఉన్నాయి.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేశాం. వైఎస్ జగన్ ఇటీవల జ్వరంతో బాధపడుతున్నారని కథనాలు లభించాయి. అంతేకానీ ఆయన ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారనే కథనాలు లభించలేదు.
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ డిసెంబర్ 24న అస్వస్థతకు గురయ్యారు. ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో పులివెందుల పర్యటలో డిసెంబర్ 24న కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. పులివెందుల పర్యటనలో భాగంగా వైఎస్ జగన్ డిసెంబర్ 24న ఇడుపులపాయలో ప్రార్థనల్లో పాల్గొనాల్సి ఉంది. పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండాల్సి ఉండగా.. అనారోగ్యం కారణంగా ఈ కార్యక్రమాలు రద్దు చేశారు. ఆ కథనాలను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
ఇదే విషయాన్ని వైసీపీ అఫీషియల్ అకౌంట్ లో కూడా డిసెంబర్ 24న పోస్టు ద్వారా తెలియజేశారు.
అయితే డిసెంబర్ 25న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పలు మీడియా సంస్థలు కూడా ప్రత్యక్ష ప్రసారం చేశాయి.
కాబట్టి వైఎస్ జగన్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారనే వాదనల్లో ఎలాంటి నిజం లేదు.
ఇక వైరల్ వీడియోలోని థంబ్నైల్స్ లో ఉన్న ఫోటోలు ఇటీవలివి కావు. 2013 నుండి ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయి. ఆ కథనాలను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు. 2013 నుండి ఆ ఫోటోలు ఆన్ లైన్ లో ఉన్నాయి
Claimed By : Social Media Users, Media Outlets
Fact Check : Unknown