ఫ్యాక్ట్ చెక్: బిచ్చగాడు భరత్ జైన్ IIM కోల్‌కతా నుండి MBA పట్టా పొందాడంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు
భరత్ కు సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోవడం కోసం
అడుక్కోవడం.. కొందరు అవసరాల కోసం అడుక్కుంటూ ఉంటారు. మరికొందరు ఉపాధి కోసం, భారీగా ఆస్తులు కూడబెట్టడం కోసం అడుక్కుంటూ ఉంటారు. కొన్ని నగరాల్లో పెద్ద సిండికేట్ నడుస్తూ ఉంది కూడా!! ఇలాంటి వాటిని కంట్రోల్ చేయడానికి కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నా ఫలితాలు అనుకున్నట్లుగా రావడం లేదు.
ఇండోర్ నగరంలో ఈ ఏడాది నుండి అడుక్కునే వారికి డబ్బులు వేయడాన్ని నిషేధించారు. వ్యవస్థీకృత బెగ్గింగ్ నెట్‌వర్క్‌లను ఎదుర్కోవడానికి ఒక పెద్ద ప్రయత్నంలో భాగంగా యాచించడంపై నిషేధం అమలు చేస్తున్నారు. చాలా మంది యాచకులు చట్టవిరుద్ధమైన సమూహాలలో భాగమని, వారు ఈ జీవితంలోకి బలవంతంగా నెట్టబడినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే అలాంటి చాలా మంది వ్యక్తులకు పునరావాసం కల్పించారు. యాచకులకు డబ్బు ఇవ్వడం మానేయడం కూడా అందరికీ మంచిదే. కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఈ కార్యక్రమం దీర్ఘకాలిక పరిష్కారాలను అందించడం ద్వారా నగరాలను యాచకులు లేని నగరాలుగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలోని పలు నగరాల్లో యాచకవృత్తి లేకుండా చేయాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ వస్తున్నారు.
అయితే ఓ అడుక్కుతినే వ్యక్తి దగ్గర కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయంటూ, అంతేకాకుండా ఉన్నత చదువులు చదివాడంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.
భారతదేశానికి చెందిన బిచ్చగాడు భరత్ జైన్ ఫోటోతో కూడిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతను ఐఐఎం కలకత్తా పూర్వ విద్యార్థి అని చెబుతున్నారు. భరత్ దాదాపు 18000 మంది బిచ్చగాళ్లను కలిగి ఉన్న భిక్షాటన సామ్రాజ్యాన్ని నడుపుతున్నాడని, అతను తన వ్యాపారాన్ని అంతర్జాతీయంగా విస్తరిస్తున్నాడని వైరల్ పోస్టుల్లో ఉంది.
సోషల్ మీడియా యూజర్ ఈ పోస్ట్‌ను షేర్ చేసి “ప్రపంచంలోని అత్యంత ధనవంతుడైన బిచ్చగాడు ముంబైలో ఉన్నాడు. అతను బిఇ చేశాడు. తన యాచక సామ్రాజ్యాన్ని నిర్వహించడానికి, అతను IIM కోల్‌కతా నుండి MBA చేసాడు. అతను ర్యాంక్ హోల్డర్ కూడా. నెలకు ₹7 కోట్ల ఆదాయం పన్ను రహితం. అతని పేరు భరత్ జైన్. నేడు అతని వద్ద 18,000 మంది బిచ్చగాళ్ళు పనిచేస్తున్నారు. అతను ధారావిలో మంచి ఇల్లు ఉంది. అతనికి ముంబైలో 8 విల్లాలు, అద్దెకు 18 హై-ఎండ్ అపార్ట్‌మెంట్‌లు, ఒక హోటల్ ఉన్నాయి." అని తెలిపారు.
https://www.facebook.com/groups/1047459843078275/posts/1128258631665062/

https://www.facebook.com/
వైరల్ అవుతున్న పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు:
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు.
వైరల్ పోస్టుకు సంబంధించి కీవర్డ్ సెర్చ్ చేయగా భరత్ జైన్ కు సంబంధించి పలు నివేదికలు లభించాయి.
ఆగస్టు 8, 2023 నాటి హిందూస్తాన్ టైమ్స్ నివేదికలో ఇదే చిత్రాన్ని కనుగొన్నారు. "Meet Bharat Jain: World’s richest beggar with a net worth of ₹7.5 crore" అంటూ నివేదిక ఉంది. భిక్షాటన ద్వారా అతని నెలవారీ సంపాదన ₹60,000- 75,000 మధ్య ఉంటుందని నివేదికల్లో తెలిపారు. వైరల్ పోస్ట్‌లో చెప్పినంత భారీ ఆదాయంలో నిజమైతే లేదు.
మరొక మీడియా కథనం ప్రకారం ఆర్థిక అస్థిరత కారణంగా జైన్ విద్యను అభ్యసించలేకపోయాడని ఉంది. భరత్ IIM కోల్‌కతా నుండి పట్టభద్రుడయ్యాడనే వాదనలో ఎలాంటి నిజం లేదని పలు నివేదికలు చెబుతున్నాయి.
భరత్ కు సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోవడం కోసం పలు మీడియా సంస్థల కథనాలను పరిశీలించాం. వాటిని ఇక్కడ , ఇక్కడ చూడొచ్చు.
అయితే ఎక్కడా కూడా భరత్ ఉన్నత విద్యను అభ్యసించాడనే కథనాలు మాకు లభించలేదు. భరత్ అడుక్కోవడం ద్వారా కోట్ల రూపాయలను సంపాదించాడని, దేశంలో అత్యంత ధనికుడైన బిచ్చగాడంటూ పలు కథనాలు గతంలో వైరల్ అయ్యాయి. వాటన్నింటినీ నిశితంగా పరిశీలించగా ఎక్కడా కూడా అతడు ఉన్నత విద్యను అభ్యసించాడని, విదేశాల్లో కూడా బెగ్గింగ్ మాఫియా నడుపుతున్నాడని నివేదించలేదు.
https://www.financialexpress.
https://www.patrika.com/weird-
భరత్ జైన్ ఉన్నత విద్యకు సంబంధించిన వాదనలు గతంలో కూడా వైరల్ అయ్యాయి. వాటిని పలు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు ఖండించాయి. అందుకు సంబంధించిన లింక్ లను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు
Claimed By : Social Media Users
Fact Check : Unknown