ఫ్యాక్ట్ చెక్: జాతీయ రహదారులపై టూ-వీలర్లకూ టోల్ ఛార్జీలు వసూలు చేయనున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు.

జాతీయ రహదారులపై ఇకపై టూ-వీలర్లకూ టోల్ ఛార్జీలు

Update: 2025-06-26 13:07 GMT

భారతదేశంలో FASTag వినియోగదారులు త్వరలోనే మరింత సౌకర్యవంతమైన, సంవత్సరానికి ఒకసారి వార్షిక పాస్‌ను అందించనుంది. భారత రహదారులపై ఇబ్బంది లేకుండా ప్రయాణించడానికి వీలుగా FASTag వార్షిక పాస్‌ను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రకటించింది. వార్షిక పాస్ ధర రూ.3,000తో ఈ సంవత్సరం ఆగస్టు 15 నుండి కొనుగోలుకు అందుబాటులోకి వస్తుంది. ఈ పాస్ కార్లు, జీపులు, వ్యాన్లు వంటి వాణిజ్యేతర ప్రైవేట్ వాహనాలకు మాత్రమే చెల్లుతుంది.

ఇది ప్రయాణికులు 200 ట్రిప్పులు లేదా పాస్ యాక్టివేట్ చేయబడిన తేదీ నుండి ఒక సంవత్సరం, ఏది ముందుగా వస్తే అది టోల్-ఫ్రీగా ప్రయాణించడానికి అనుమతిస్తుంది. వార్షిక FASTag పాస్ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) నిర్వహించే టోల్ ప్లాజాలలో మాత్రమే పని చేస్తుంది. వార్షిక పాస్ కలిగి ఉన్నప్పటికీ రాష్ట్ర రహదారులు, ప్రైవేట్ నడిపే టోల్ రోడ్లు, ఎక్స్‌ప్రెస్‌వేలలో టోల్ చెల్లించాల్సి ఉంటుంది. FASTag వార్షిక పాస్ ప్రధానంగా తరచుగా ప్రయాణించే వారి కోసం లక్ష్యంగా చేసుకుంది. సుదూర హైవే ప్రయాణికులకు ఖర్చులను ఆదా చేస్తూ టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గిస్తుందని భావిస్తున్నారు. జాతీయ హైవే గ్రిడ్‌లో వినియోగదారుల సౌలభ్యాన్ని పెంచుతూ దేశంలో రోడ్డు మౌలిక సదుపాయాలను ఆధునీకరించడానికి భారత ప్రభుత్వం చేస్తున్న విస్తృత ప్రయత్నాల్లో ఇది కూడా ఒక భాగం.
అయితే టూ వీలర్లకు కూడా ఇకపై టోల్ ఫీజులు చెల్లించాల్సి రావొచ్చంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.
"ద్విచక్ర వాహనదారుల నుంచి టోల్ ఛార్జీలు వసూలు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఫాస్టాగ్ ద్వారా డిజిటల్ టోల్ ఫీ వసూలు వ్యవస్థలోకి టూ- వీలర్లను తీసుకురావాలనే లక్ష్యంతో విధాన పరమైన మార్పులు తీసుకుని రానున్నారు. టూ-వీలర్లకు సైతం టోల్ ఛార్జీల వసూలు జులై 15, 2025 నుంచే అమలలోకి తీసుకువస్తున్నారు" అంటూ పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.



"📢Big Breaking..

🔹ఇకపై.. బైకులకు టోల్ గేట్ ఫీజు..

భారతదేశంలో.. జూలై 15, 2025 నుండి, జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలకు టోల్ మినహాయింపు ముగియబోతోందని NHAI మరియు రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇకపై.. హైవే ఎంట్రీ పాయింట్ల వద్ద టోల్ చెల్లించడానికి సిద్ధంగా ఉండండి.." అంటూ మరొక యూజర్ చేసిన పోస్టును మేము గుర్తించాం. 




"జూలై 15 నుండి భారీ షాక్..!
ఇకపై బైక్స్‌కి టోల్ ఫ్రీ లేదు..!
🚫 రెండు చక్రాల వాహనాలపై టోల్ మినహాయింపు రద్దు
📍 జూలై 15, 2025 నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి
💰 ప్రతి హైవే టోల్ ప్లాజాలో ఫీజు వసూలు చేయబోతున్నారు" అంటూ మరికొందరు పోస్టులు పెట్టారు.

వైరల్ అవుతున్న పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు



 


ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
మేము అలాంటి ప్రకటన ఏదైనా కేంద్ర ప్రభుత్వం చేసిందా అని తెలుసుకోడానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు సంబంధించిన వెబ్ సైట్లు, సోషల్ మీడియా ఖాతాలను మేము పరిశీలించాం. వైరల్ అవుతున్న వాదనలకు బలం చేకూర్చే ప్రకటనలు ఏవీ లభించలేదు. 
టూ వీలర్లకు టోల్ ఫీజు అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదంటూ నివేదించాయి. భారత ప్రభుత్వం ద్విచక్ర వాహనాలపై యూజర్ ఛార్జ్ విధించాలని యోచిస్తున్నట్లు మీడియాలోని కొన్ని వర్గాలు నివేదించాయి. NHAI దగ్గర అటువంటి ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని స్పష్టం చేయాలనుకుంటోంది. ద్విచక్ర వాహనాలకు టోల్ ఛార్జీలను ప్రవేశపెట్టే ప్రణాళికలు లేవని FakeNews అంటూ కొట్టి పారేసింది.

https://x.com/NHAI_Official/status/1938155675445588222




 

జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలపై టోల్ పన్నును ప్రవేశపెట్టినట్లు మీడియాలో వస్తున్న తప్పుడు నివేదికలను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఖండించారు. అటువంటి ప్రతిపాదన ఏదీ లేదని, ద్విచక్ర వాహనాలకు పూర్తి టోల్ మినహాయింపు మారదని గడ్కరీ స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనాలకు టోల్ మినహాయింపు పూర్తిగా కొనసాగుతుందని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో స్పష్టం చేశారు.



ద్విచక్ర వాహనాలకు టోల్ మినహాయింపు పూర్తిగా కొనసాగుతుందని పలు మీడియా సంస్థలు కూడా కథనాలను ప్రచురించాయి. వైరల్ అవుతున్న వాదనలను ఖండించాయి సదరు మీడియా సంస్థలు.
వాటిని ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
ఇక ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ విభాగం కూడా వైరల్ అవుతున్న వాదనలను ఖండిస్తూ పోస్టు పెట్టింది.


కాబట్టి, టూ వీలర్లకు టోల్ ఫీజు అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు.


Claim :  జాతీయ రహదారులపై ఇకపై టూ-వీలర్లకూ టోల్ ఛార్జీలు
Claimed By :  Social Media Users, Media Channels
Fact Check :  Unknown
Tags:    

Similar News