ఫ్యాక్ట్ చెక్: తెలంగాణ ప్రభుత్వం వాహన దారులకు భారీ రాయితీ కల్పించిందనే వాదన నిజం కాదు
తెలంగాణ ప్రభుత్వం వాహన దారులకు భారీ రాయితీ
తెలంగాణ పోలీసులు గతంలో పెండింగ్ లో ఉన్న చలాన్ లను వసూలు చేసేలా భారీగా రాయితీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణలోని వాహన యజమానులకు పెద్ద ఉపశమనంగా, కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్‌లను క్లియర్ చేయడానికి 2023 డిసెంబర్ లో భారీ డిస్కౌంట్ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం 2023, డిసెంబర్ 26 నుండి 2024, జనవరి 10 వరకు కొనసాగింది. వాహనదారులు చలాన్‌లను డిస్కౌంట్ ద్వారా కట్టేసి సెటిల్ చేసుకున్నారు.
మరోసారి అదే తరహాలో డిస్కౌంట్లు ఇవ్వనున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి.
"తెలంగాణ ప్రభుత్వం వాహన దారులకు భారీ రాయితీ కల్పించింది.
బైకుల పై 80% అంటే 700 రూపాయలు ఉంటే 140 రూపాయలు కడితే చాలు.
కార్లపై 60% అంటే 2000 ఉంటె 800 కడితే చాలు.
డిసెంబరు 26 నుండి జనవరి పది వరకు ఈ అవకాశం.
మీసేవ ఈ చాలన ద్వార మీరు. చెల్లించవచ్చు.
- తెలంగాణ పోలీస్" అంటూ ట్విట్టర్ లో ఓ పోస్టు వైరల్ అవుతూ ఉంది.
ఇదే తరహాలో ఫేస్ బుక్ లో కూడా ఓ పోస్టు వైరల్ అవుతూ ఉంది.
*తెలంగాణ ప్రభుత్వం వాహన దారులకు భారీ రాయితీ కల్పించింది..*
*వాహనదారులు ఎదుర్కుంటున్న ఫైన్ విషయాలలో తీపి కబురు*
*బైకుల పై 80% అంటే 700 రూపాయలు ఉంటే 140 రూపాయలు కడితే చాలు.*
*కార్లపై 60% అంటే 2000 ఉంటె 800 కడితే చాలు*
*డిసెంబరు 26 నుండి జనవరి పది వరకు ఈ అవకాశం..*
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని పోలీసులు ధృవీకరించారు.
మరోసారి తెలంగాణ పోలీసు విభాగం చలాన్లపై ఏదైనా డిస్కౌంట్ ను ప్రకటించిందో లేదో తెలుసుకోడానికి కీవర్డ్ సెర్చ్ చేశాం. కానీ మాకు ఎక్కడా కూడా అలాంటి కథనాలు కనిపించలేదు. ఈ డిస్కౌంట్ ఆఫర్ డిసెంబర్ 26, 2023 నుండి జనవరి 10, 2024 వరకు కొనసాగిందని మాకు వార్తా నివేదికలు కనిపించాయి.
గతేడాది తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానం మేరకు 2023 డిసెంబర్ లో డిస్కౌంట్ ఆఫర్ ను తీసుకొచ్చింది. పెండింగ్‌లో ఉన్న చలాన్‌లను సెటిల్ చేయడానికి 90 శాతం వరకూ తగ్గింపును ప్రకటించింది, యజమానులు చలాన్ మొత్తంలో 10 శాతం మాత్రమే చెల్లించాలి, మిగిలిన 90 శాతం మాఫీ చేశారు. ద్విచక్ర వాహనాలు, మూడు చక్రాల వాహనాలకు, చలాన్ మొత్తంలో 80 శాతం మినహాయింపు ఇచ్చారు. కార్లు, ఇతర తేలికపాటి మోటారు వాహనాలు, ట్రక్కులు, ఇతర భారీ మోటారు వాహనాల విషయంలో 60 శాతం తగ్గింపు ఇచ్చారు. 15 ఫిబ్రవరి 2024న 'సియాసత్ డైలీ' ప్రచురించిన నివేదికలో తెలంగాణలో ట్రాఫిక్ చలాన్‌లపై రాయితీకి చివరి తేదీని మొదట జనవరి 10, 2024గా నిర్ణయించారు, ఆ తర్వాత రెండుసార్లు పొడిగించారు. మొదట జనవరి 31, 2024 వరకూ ఆ తర్వాత 15 ఫిబ్రవరి 2024 వరకు పొడిగించారు.
అందుకు సంబంధించిన లింక్ ను ఇక్కడ, ఇక్కడ మీరు చూడొచ్చు.
అయితే ఇటీవలి కాలంలో ఇలాంటి డిస్కౌంట్ లు ప్రకటించి ఉంటే అది తప్పకుండా ప్రముఖ వార్తగా నిలిచి ఉండేది. కానీ అలాంటి కథనాలు ఏవీ కనిపించలేదు.
మా తదుపరి విచారణలో భాగంగా హైదరాబాద్ పోలీసుల సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించాం. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తమ అధికారిక X హ్యాండిల్, ఫేస్‌బుక్ పేజీలో పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్‌లపై రాయితీలు ప్రకటించారనే పోస్టులు నకిలీవని స్పష్టం చేశారు. 2024 డిసెంబర్‌లో పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్‌లపై తెలంగాణ పోలీసులు ఎలాంటి తగ్గింపులను ప్రకటించలేదని తేల్చి చెప్పారు.

ఇదే విషయాన్ని పలు మీడియా సంస్థలు కూడా కథనాలుగా ప్రచురించాయి. తెలంగాణ పోలీసులు ట్రాఫిక్ చలాన్లపై ఎలాంటి డిస్కౌంట్ ఇవ్వలేదనే కథనాలను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
నిజ నిర్ధారణ సంస్థలు కూడా ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చాయి. వాటిని ఇక్కడ చూడొచ్చు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు 2024, డిసెంబర్ లో ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్లు ప్రకటించలేదు.
Claim : తెలంగాణ ప్రభుత్వం వాహన దారులకు భారీ రాయితీ కల్పించింది
Claimed By : Social Media Users
Fact Check : Unknown