ఫ్యాక్ట్ చెక్: ఎత్తైన వినాయకుడి విగ్రహం థాయ్ ల్యాండ్ లో ఉంది.. ఇండోనేషియాలో కాదు

ఇలాంటి సమయంలో ఫేస్‌బుక్ పోస్ట్ వైరల్‌గా మారింది

Update: 2023-09-24 16:32 GMT

భారతదేశంలోను, ఇతర దేశాలలోని హిందువులు గణేష్ చతుర్థిని జరుపుకున్నారు. ఇలాంటి సమయంలో ఫేస్‌బుక్ పోస్ట్ వైరల్‌గా మారింది. కన్నడ భాషలో ఓ పోస్టు వైరల్ గా మారింది. "ప్రపంచంలోనే ఎత్తైన గణపతి విగ్రహం. ఇది భారతదేశంలోనిది కాదు. ఇది ఇస్లామిక్ దేశమైన ఇండోనేషియాలో ఉంది. సనాతన ధర్మం మూలాలు ప్రపంచం మొత్తం ఉన్నాయి" అనే క్యాప్షన్‌తో పోస్ట్‌ను షేర్ చేశారు.   


Full View

అదే తరహా పోస్టు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓ వీడియోకు సంబంధించిన ఏరియల్ షాట్ కూడా గతంలో వైరల్ అయింది. ప్రపంచంలోనే ఎత్తైన వినాయకుడి విగ్రహం అంటూ వీడియోను పోస్టు చేశారు.


2022 లో కూడా సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. "128-foot tall Ganesha statue standing in Muslim Indonesia." అంటూ వీడియోను పోస్టు చేశారు. ముస్లిం దేశంలో ప్రపంచంలోనే ఎత్తైన వినాయకుడి విగ్రహం ఉందంటూ పోస్టులు పెట్టారు.

ఫ్యాక్ట్ చెకింగ్:
రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ చేయగా.. ఇండోనేషియాలో అత్యంత ఎత్తైన వినాయకుడి విగ్రహం ఉందని చేస్తున్న ప్రచారంలో నిజం లేదని.. ఆ విగ్రహం థాయ్‌లాండ్‌ లో ఉందని స్పష్టంగా తేలింది. థాయ్‌లాండ్‌లోని క్లాంగ్ కుయెన్ జిల్లాలో ఉన్న గణేశ ఇంటర్నేషనల్ పార్క్‌లో 128 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. యూట్యూబ్‌లో వైరల్ అవుతున్న పోస్టులకు సంబంధించిన వీడియోను కనుగొన్నాము.
వైరల్ పోస్ట్, వీడియోలలో కనిపించే వినాయక విగ్రహం థాయ్‌లాండ్‌లో ఉందని యుట్యూబ్ లో అప్లోడ్ చేసిన వీడియోల ద్వారా స్పష్టంగా తెలుస్తోంది.

Full View

shriganesh.com వెబ్‌సైట్ లో ఈ విగ్రహానికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. "ఈ విగ్రహం 40,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఇదొక కాంస్య విగ్రహం. ప్రపంచంలోనే ఎత్తైన వినాయకుడి విగ్రహం. ఈ విగ్రహానికి నాలుగు చేతులు ఉన్నాయి. పనసపండు, చెరకు, అరటి, మామిడి వినాయకుడి చేతిలో ఉన్నాయి.
గూగుల్ మ్యాప్స్ స్ట్రీట్ వ్యూ ద్వారా ఎత్తైన వినాయకుడి విగ్రహం థాయ్‌లాండ్‌లోని క్లాంగ్ కుయెన్ జిల్లాలోని బ్యాంగ్ తలాత్‌లో ఉన్నట్లు నిర్ధారించాము.

ఈ విగ్రహం ఏర్పాటు చేసిన పార్క్ కు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ లో వివిధ కోణాల నుండి వినాయకుడి విగ్రహం ఫోటోలను మనం చూడొచ్చు.

కాబట్టి, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వినాయకుడి విగ్రహం ఇండోనేషియాలో లేదు. థాయ్‌లాండ్‌లో ఉంది.


Claim :  The world's tallest standing Ganesha statue is in the Islamic nation of Indonesia.
Claimed By :  Facebook Users
Fact Check :  False
Tags:    

Similar News