ఫ్యాక్ట్ చెక్: స్టాలిన్ గ్లోవ్స్ ధరించిన చిత్రం కోవిడ్ సమయంలో తీసినది.. ఇటీవలిది కాదు

ఈ ఫోటోలలో స్టాలిన్ గ్లోవ్స్ వేసుకుని పిల్లలను పట్టుకుని ఉండగా.. బీజేపీ చీఫ్ అన్నామలై అలాంటిది ఏదీ చేయలేదు.

Update: 2023-09-19 04:49 GMT

తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై ఒక్కొక్కరుగా పిల్లలను పట్టుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.

ఈ ఫోటోలలో స్టాలిన్ గ్లోవ్స్ వేసుకుని పిల్లలను పట్టుకుని ఉండగా.. బీజేపీ చీఫ్ అన్నామలై అలాంటిది ఏదీ చేయలేదు. సోషల్ మీడియా వినియోగదారులు ఎం.కె.స్టాలిన్ పిల్లల కులం పట్ల వివక్ష చూపారని.. బీజేపీ నేత అన్నామలై గ్లోవ్స్ వేసుకోలేదని ప్రచారం చేస్తూ ఉన్నారు. పిల్లల కులంపై స్టాలిన్ వివక్ష చూపారని ఆరోపిస్తూ ఉన్నారు.
"ఇద్దరి మధ్య ఉన్న తేడాను గమనించండి. సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తున్న వారి ప్రవర్తన.. దాన్ని పాటిస్తున్న వారి ప్రవర్తనను మీరు గమనించవచ్చు" అంటూ పోస్టులు పెడుతున్నారు. తమిళ భాషలో పలువురు పోస్టులు పెట్టారు.

Full View

ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న ఫోటోలను తీసుకుని గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. ఇదే ఫోటో 2021 లో కూడా వైరల్ అయినట్లు గుర్తించాం. Sun TV News ఫిబ్రవరి 2021న అప్లోడ్ చేసిన వీడియోను మేము గుర్తించాం. 'Election’ అనే కేటగిరీ కింద ఫోటోలను అప్లోడ్ చేశారు.


డేట్‌లైన్‌ను దృష్టిలో ఉంచుకుని, ఈ చిత్రం ఇటీవల తీసింది కాదని.. రెండేళ్ల క్రితం తీశారని గుర్తించాం. 2021లో తమిళనాడులోని కాంచీపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా స్టాలిన్ పిల్లలను పలకరించినప్పుడు తీసిన చిత్రం.
2021లో కోవిడ్ ప్రబలిన సంగతి తెలిసిందే. కోవిడ్ వేగంగా వ్యాప్తి చెందకుండా ఆ సమయంలో ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు విధించిన సమయంలో మాస్క్‌లు, శానిటైజర్లు, గ్లోవ్స్‌ని ఉపయోగించాల్సి వచ్చింది. ఎం.కె.స్టాలిన్ ఎన్నికల ప్రచారంలో ప్రజలను పరామర్శించే సమయంలో ప్రోటోకాల్‌లను పాటించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నేతలంతా మాస్కులు, గ్లౌజులు ధరించి సామాజిక దూరం పాటించారు.
ఫిబ్రవరి 24, 2021న టైమ్స్ ఆఫ్ ఇండియా ఇలాంటి మరొక చిత్రాన్ని షేర్ చేసింది. ఇక్కడ కూడా, స్టాలిన్ పిల్లవాడిని పట్టుకున్న సమయంలో గ్లౌజులు ధరించడం చూడవచ్చు.




 


అన్నామలై పిల్లలను పట్టుకున్న చిత్రం ఈ ఏడాది తీసినది. ఆగస్టు 2023లో పోలిమర్ న్యూస్ అందుకు సంబంధించిన వార్తలను నివేదించింది. తమిళనాడులోని కరియాపట్టిలో అన్నామలై శిశువును పట్టుకొన్నాడు. ఆ సందర్భంలో ఈ వీడియో తీశారు.

Full View

కాబట్టి, ఎంకే స్టాలిన్ గ్లోవ్స్ ధరించి శిశువును తన చేతుల్లో పట్టుకొని ఉన్న చిత్రం కోవిడ్ -19 ప్రోటోకాల్ అమలులో ఉన్నప్పుడు తీసినట్లు స్పష్టమైంది. ఇందులో ఎలాంటి కుల వివక్ష లేదు.


Claim :  Stalin discriminates against the baby’s caste by wearing gloves while holding it
Claimed By :  Facebook Users
Fact Check :  False
Tags:    

Similar News