ఫ్యాక్ట్ చెక్: జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల గురించి మాట్లాడుతూ ఇటీవలి కాలంలో ఎలాంటి వీడియోను విడుదల చేయలేదు
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల గురించి మాట్లాడుతూ ఇటీవలి కాలంలో ఎలాంటి వీడియోను
జనవరి 18.. దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి. ఆయనకు ప్రజలు, ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌కు ఆయన అభిమానులు, రాజకీయ నాయకులు భారీగా పోటెత్తారు. ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు నివాళులర్పించారు. ఎన్టీఆర్ మనవడు, హరికృష్ణ కుమారుడు, నటుడు కళ్యాణ్ రామ్ తాత సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళి అర్పించారు. ఆయన వెంట పెద్ద సంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు.
హైదరాబాద్ లో జూనియర్ ఎన్టీఆర్ లేకపోవడంతో ఆయన ఎన్టీఆర్ ఘాట్ కు రాలేదని పలు నివేదికలు చెబుతున్నాయి.
రాజకీయాల్లోకి రావాలంటే ఇలా ఉండాలి అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఒక వీడియోను షేర్ చేశారంటూ కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్ లో వీడియోలను పోస్టు చేశారు.
వైరల్ పోస్టుకు సంబంధించిన లింక్ ను ఇక్కడ చూడొచ్చు
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను మనం గమనించవచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది.
తారక్ ఇటీవలి కాలంలో అలాంటి వీడియోను ఏమైనా పోస్టు చేశారా అని ఆయన అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్ ను వెతికాం. అయితే అందులో ఇందుకు సంబంధించి ఎలాంటి పోస్టులు మాకు లభించలేదు.
సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ జనవరి 14న ట్వీట్ వేశారు.
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది.
తారక్ ఇటీవలి కాలంలో అలాంటి వీడియోను ఏమైనా పోస్టు చేశారా అని ఆయన అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్ ను వెతికాం. అయితే అందులో ఇందుకు సంబంధించి ఎలాంటి పోస్టులు మాకు లభించలేదు.
సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ జనవరి 14న ట్వీట్ వేశారు.
ఇక సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ చేయగా ఇటీవలి కాలంలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల గురించి మాట్లాడినట్లుగా ఎలాంటి మీడియా కథనం కూడా మాకు లభించలేదు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల గురించి మాట్లాడి ఉంటే అది తప్పకుండా మీడియా దృష్టిని ఆకర్షించి ఉండేది.
ఇక మేము వైరల్ వీడియో లోని స్క్రీన్ షాట్ తీసుకుని, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం.
20 నవంబర్ 2021న "వ్యక్తిగత దూషణలు సరికాదు.. అసెంబ్లీ ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం" అంటూ TV9 తెలుగు ఈ వీడియోను పోస్టు చేసింది.
ఇటీవల పోస్టు చేసిన వీడియో నాలుగు సంవత్సరాల కిందట నుండి ఆన్ లైన్ లో అందుబాటులో ఉంది.
దీన్ని క్యూగా తీసుకుని సెర్చ్ చేయగా పలు మీడియా సంస్థలు ఈ వీడియోను 2021, నవంబర్ లో పోస్టు చేశాయి.
అందుకు సంబంధించిన కథనాలు ఇక్కడ, ఇక్కడ ఉన్నాయి.
"మాట మన వ్యక్తిత్వానికి ప్రమాణం. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు చాలా సర్వ సాధారణం. అవి ప్రజా సమస్యలపై జరగాలే కానీ, వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత విమర్శలుగా ఉండకూడదు. ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటన నా మనసును కలచి వేసింది. ఎప్పుడైతే మనం ప్రజా సమస్యలను పక్కన పెట్టి, వ్యక్తిగత దూషణలకు దిగుతున్నామో, ముఖ్యంగా మన ఆడపడుచుల గురించి పరుష పదజాలంతో మాట్లాడుతున్నామో అది ఒక అరాచక పాలనకు నాంది పలుకుంది. స్త్రీ జాతిని గౌరవించటం అనేది మన సంస్కృతి. మన నవ నాడుల్లో, మన జవ జీవాల్లో మన రక్తంలో ఇమిడిపోయిన ఒక సంప్రదాయం. దాన్ని రాబోయే తరాలకు జాగ్రత్తగా అప్పగించాలి. అంతేకానీ, మన సంస్కృతిని కలచి వేసి, కాల్చేసి ఇదే రాబోయే తరాలకు బంగారు బాట వేస్తున్నామనుకుంటే అది మన తప్పు. అది మనం చేసే చాలా పెద్ద తప్పు. ఈ మాటలు నేను ఒక వ్యక్తిగత దూషణకు గురైన కుటుంబానికి చెందిన సభ్యుడిగా మాట్లాడటం లేదు. ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా ఈ దేశానికి చెందిన ఒక పౌరుడిగా సాటి తెలుగువాడిగా మాట్లాడుతున్నా. రాజకీయ నాయకులకు ఒకటే విన్నపం. ఈ అరాచక సంస్కృతిని ఇక్కడే ఆపేయండి. ప్రజాసమస్యలపై పోరాడండి. రాబోయే తరానికి బంగారు బాట వేసేలా నడవడిక ఉండేలా జాగ్రత్త పడండి. ఇది నా విన్నపం మాత్రమే. ఇది ఇక్కడితో ఆగిపోతుందని మనసారా కోరుకుంటున్నా"అని ఎన్టీఆర్ వీడియోలో మాట్లాడారు.
జూనియర్ ఎన్టీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో నవంబర్ 20, 2021న ఈ వీడియోను పోస్టు చేశారు.
2021, నవంబర్ నెలలో అసెంబ్లీలో జరిగిన పరిణామాల నేపథ్యంలో వాకౌట్ చేసిన టీడీపీ అధినేత, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో కన్నీరు పెట్టుకున్నారు. ఆ సమయంలో ఎన్టీఆర్ ఈ వీడియోను విడుదల చేశారు.
కాబట్టి, వైరల్ అవుతున్న వీడియో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల గురించి మాట్లాడిన వీడియో ఇటీవలిది కాదు.
Claim : వైరల్ వీడియో ఇటీవలిది కాదు. 2021లో చోటు చేసుకున్నది
Claimed By : Social Media Users
Fact Check : Unknown