ఫ్యాక్ట్ చెక్: ఏఐ వీడియోను ఓ మహిళ జూ లోని సింహాల ఎన్ క్లోజర్ లోకి దూకేసినా ఎలాంటి ప్రమాదం జరగలేదంటూ ప్రచారం చేస్తున్నారు

ఏఐ వీడియోను ఓ మహిళ జూ లోని సింహాల ఎన్ క్లోజర్ లోకి దూకేసినా ఎలాంటి ప్రమాదం జరగలేదంటూ

Update: 2026-03-27 09:48 GMT

జూలో పని చేస్తున్నవాళ్లు, జూలో జంతువులను చూడడానికి వెళ్లిన వాళ్లు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే కొన్ని కొన్ని సార్లు ఊహించని ప్రమాదానికి గురవుతూ ఉంటారు. ఇటీవల కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా త్యావరెకొప్ప జూలో ఒక హిప్పోపొటమస్ దాడిలో తీవ్రంగా గాయపడిన 27 ఏళ్ల పశువైద్యురాలు మరణించారు. బాధితురాలు డాక్టర్ సమీక్షా రెడ్డిని ఇటీవల కర్ణాటక అటవీ శాఖ ఒప్పంద ప్రాతిపదికన నియమించింది. ఈ విషాద ఘటనపై దర్యాప్తు చేసేందుకు సీనియర్ పశువైద్యులు, అటవీ అధికారులతో కూడిన బృందాన్ని నియమించినట్లు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. జూ అధికారులు విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం, డాక్టర్ రెడ్డి ఒక పక్షికి ఫాలో-అప్ నిర్వహించేందుకు జూకి వెళ్లారు. రాత్రి సుమారు 11.45 గంటలకు, ఆమె థర్మల్ కెమెరాను ఉపయోగించి గర్భవతి అయిన ఒక హిప్పోపొటమస్ శరీర ఉష్ణోగ్రతను పర్యవేక్షించేందుకు ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించారు. ఈ ప్రక్రియ జరుగుతున్న సమయంలో, ఆ జంతువు దూకుడుగా మారి ఆమెపై దాడి చేసిందని జూ అధికారులు తెలిపారు. డాక్టర్ రెడ్డిని వెంటనే శివమొగ్గలోని ఆసుపత్రిలో చేర్పించగా, ఆమె చికిత్స పొందుతూ మరణించినట్లు అటవీ శాఖ మంత్రి తెలిపారు.


ఇంతలో ఓ మహిళ సింహాల ఎన్ క్లోజర్ లో ప్రవేశించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఓ సింహం ఆమె దగ్గరకు వెళ్లి ఆమెను ఏమీ చేయకుండా అక్కడి నుండి వెళ్లిపోయినట్లు వీడియోలో ఉంది. ఈ ఘటన జంషెడ్ పూర్ లో చోటు చేసుకున్నట్లుగా పోస్టులు పెట్టారు.

వైరల్ పోస్టుకు సంబంధించిన ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు

వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ ఉంది



 



ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వీడియోను ఏఐ ద్వారా సృష్టించారు.

ఒక మహిళ పొరపాటున సింహం ఎన్ క్లోజర్ లో పడిపోగా, ఆమెను తర్వాత రక్షించారని వీడియోను పోస్టు చేశారు. ఆ వీడియోలో, భయంతో వణికిపోతున్న ఆ మహిళ వద్దకు ఒక సింహం వెళ్లడం, ఆమె కదలకుండా అక్కడే ఉండటం, ఆ తర్వాత ఆమెకు ఎలాంటి హాని చేయకుండా వెళ్ళిపోవడం వంటి విజువల్స్ వీడియోలో చూడొచ్చు. ఈ విజువల్స్ లో ఎన్నో తేడాలను మేము గుర్తించాం. మహిళ హావభావాలలో తేడాలు గమనించాం. ఇలాంటివి సాధారణంగా ఏఐ వీడియోలలో కనిపించే తప్పులు.

ఇక ఇలాంటి ఘటన ఏదైనా జంషెడ్ పూర్ లో చోటు చేసుకుందా అని తెలుసుకోడానికి మేము గూగుల్ సెర్చ్ చేశాం. అయితే ఎక్కడా కూడా అలాంటి ఘటన చోటు చేసుకున్నట్లుగా మీడియా నివేదికలు లభించలేదు.

ఇక వైరల్ వీడియో లోని కీఫ్రేమ్స్ ను తీసుకుని మేము గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. Shawn Arranha అనే ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారు షేర్ చేసిన ఒక వీడియో మాకు లభించింది.


జనవరి 1, 2026న పోస్ట్ చేసిన ఆ వీడియో, వైరల్ పోస్ట్‌లోని వీడియో ఒకటేనని మేము గుర్తించాం. పోస్ట్‌తో పాటు పంచుకున్న వివరాలను విశ్లేషించగా, ఆ వీడియోను సోరా అనే ఏఐ కంటెంట్ జనరేషన్ ప్లాట్‌ఫామ్ ఉపయోగించి సృష్టించినట్లు ఆ వినియోగదారు తెలిపారు.



 

ఇక వైరల్ అవుతున్న వీడియో ఏఐ ద్వారా సృష్టించారా అని తెలుసుకోవడం కోసం మేము హైవ్ మోడరేట్ టూల్ ను ఉపయోగించాం. అది ఖచ్చితంగా ఏఐ సృష్టి అంటూ తేల్చింది.

అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ ఉంది.



 



కాబట్టి, వైరల్ అవుతున్నవాదనలో ఎలాంటి నిజం లేదు. ఓ మహిళ జూ లోని సింహాల ఎన్ క్లోజర్ లోకి దూకేసినా ఎలాంటి ప్రమాదం జరగలేదంటూ వైరల్ అవుతున్న వీడియోను ఏఐ ద్వారా సృష్టించారు.


Claim :  ఓ మహిళ సింహాల ఎన్ క్లోజర్ లోకి దూకేసినా ఆమెను సింహాలు ఏమీ చేయలేదు
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News