ఫ్యాక్ట్ చెక్: మొస్సాద్ కోసం గూఢచర్యం చేస్తున్న భారత ఇంజనీర్‌ను బహ్రెయిన్ పోలీసులు అరెస్ట్ చేయలేదు
మొస్సాద్ కోసం గూఢచర్యం చేస్తున్న భారత ఇంజనీర్‌ను బహ్రెయిన్ లో అదుపులోకి తీసుకున్నా
మొసాద్ ఇజ్రాయెల్ దేశ ప్రధాన జాతీయ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. ఇది నిఘా, రహస్య ఆపరేషన్లు, కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ చేపడుతూ ఉంటుంది. ఇజ్రాయెల్ ప్రధానికి నేరుగా నివేదించే ఈ సంస్థ. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన, రహస్య నిఘా సంస్థలలో ఒకటిగా పరిగణించబడుతుంది.
అయితే మొసాద్ కోసం గూఢచర్యం చేశాడన్న ఆరోపణలపై బహ్రెయిన్ అధికారులు ఒక భారత జాతీయుడిని అరెస్టు చేశారనే వాదనతో కొన్ని పోస్టులను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. నిందితుడిని నితిన్ మోహన్‌గా గుర్తించారు, వృత్తిరీత్యా అతను టెలికమ్యూనికేషన్స్ ఇంజనీర్ అని అతను మొస్సాద్‌కు సున్నితమైన సమాచారాన్ని అందించినట్లు ఆ పోస్టుల్లో ఆరోపణలు గుప్పించారు. నిందితుడు అనేక ముఖ్యమైన, వ్యూహాత్మక ప్రదేశాల వివరాలు కలిగిన భౌగోళిక సమాచారం, ఫోటోలు, వీడియోలను పంచుకున్నాడని ఆ పోస్టుల్లో తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని, మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రజలకు మరింత సమాచారం విడుదల చేయబడుతుందని వైరల్ పోస్టుల్లో తెలిపారు.
వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేశాం. అయితే ఈ అరెస్టును ధృవీకరించే అధికారిక ప్రకటన ఏదీ కనిపించలేదు.
మేము మొదట సంబంధిత కీవర్డ్ సెర్చ్ చేశాం. భారతీయ టెలికమ్యూనికేషన్స్ ఇంజనీర్ అయిన నితిన్ మోహన్‌ను, ఇజ్రాయెల్ మొస్సాద్‌కు రహస్య సమాచారాన్ని బదిలీ చేసినందుకు అరెస్టు చేశారన్నట్లు ఎటువంటి విశ్వసనీయ నివేదికలు కనుగొనలేదు.
మేము బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్‌ను కూడా తనిఖీ చేశాము, కానీ దేశంలో ఒక భారతీయుడిని అరెస్టు చేసినట్లు ఎటువంటి పత్రికా ప్రకటన కనుగొనలేదు. అయితే ఈ వదంతులను ఖండిస్తూ పెట్టిన పోస్టులు మాకు లభించాయి.
వైరల్ అవుతున్న ఈ వాదనలో ఎలాంటి నిజం లేదంటూ బహ్రెయిన్, భారత ప్రభుత్వాలు వివరణలు జారీ చేశాయి. బహ్రెయిన్ అవినీతి నిరోధక, ఆర్థిక, ఎలక్ట్రానిక్ భద్రతా జనరల్ డైరెక్టరేట్, ఈ వార్త అవాస్తవమని, అధికారిక వర్గాలకు తప్పుగా ఆపాదించబడిందని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
భారత ప్రభుత్వానికి చెందిన MEAFactCheck బృందం కూడా వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదంటూ స్పష్టం చేశాయి.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. మొసాద్ కోసం గూఢచర్యం చేశాడన్న ఆరోపణలపై బహ్రెయిన్ అధికారులు ఒక భారత జాతీయుడిని అరెస్టు చేశారనే వాదన నిజం కాదు.
Claim : వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు
Claimed By : Social Media Users
Fact Check : Unknown