ఫ్యాక్ట్ చెక్: ఇజ్రాయెల్ పై ఇరాన్ చేసిన దాడులను భారత ప్రధాని నరేంద్ర మోదీ ఖండిస్తూ పోస్టు పెట్టలేదు

ఇజ్రాయెల్ పై ఇరాన్ చేసిన దాడులను భారత ప్రధాని నరేంద్ర మోదీ ఖండిస్తూ

Update: 2026-03-28 17:40 GMT

ఇరాన్‌లో పాలన మార్పు తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగా, అమెరికా- ఇజ్రాయెల్ దేశాలు టెహ్రాన్‌పై క్షిపణుల వర్షాన్ని కురిపించారు. ఆ దేశ సర్వోన్నత నాయకుడిని, దేశ నాయకత్వాన్ని తుడిచిపెట్టడానికి ప్రయత్నం చేశారు. ఇరాన్ కూడా అందుకు తగ్గట్టుగా స్పందించింది. హోర్ముజ్ జలసంధిని అడ్డుకోవడం ద్వారా ప్రపంచ ఇంధన సరఫరాలపై తన పట్టును బిగించింది.


అయితే ఇస్లామిక్ రిపబ్లిక్ పతనమవ్వలేదు. ఇరాన్ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్, అయతోల్లా ఖమేనీ 56 ఏళ్ల కుమారుడు మొజ్తబాను తమ కొత్త సర్వోన్నత నాయకుడిగా నియమించింది.

పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, ఇరాన్ ఇజ్రాయెల్‌పై చేస్తున్న చర్యలను ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రవాదంగా అభివర్ణించారని, ఇజ్రాయెల్‌కు పూర్తి మద్దతు తెలిపారని పేర్కొంటూ ఒక ట్వీట్ స్క్రీన్‌షాట్ సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతూ ఉంది.

వైరల్ పోస్టుకు సంబంధించిన ఆర్కైవ్ లింక్ ఇక్కడ ఉంది

అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు



 



ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

వైరల్ పోస్టులకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడం మేము కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాం. అయితే ఎక్కడా కూడా మాకు ఇటీవల చోటు చేసుకున్న ఉద్రిక్తతల నడుమ ఆయన ఇలాంటి పోస్టులు పెట్టారనే కథనాలు మాకు లభించలేదు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యొక్క 'ఎక్స్' ఖాతాను పరిశీలించాం. ఇజ్రాయెల్‌పై ఇరాన్ చేస్తున్న దాడులు ఉగ్రవాదమని పేర్కొంటూ ఆయన చేసిన ఇటీవలి పోస్టులేవీ మాకు కనపడలేదు.

అయితే సెప్టెంబర్ 8, 2025 నాటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన అసలు పోస్ట్‌ మాకు కనిపించింది. సెప్టెంబర్ 2025లో ఇజ్రాయెల్‌లో జరిగిన ఒక ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా ఆ పోస్ట్ ఉంది, ఆ దాడిలో ఆరుగురు మరణించారు.

"ఈరోజు జెరూసలంలో అమాయక పౌరులపై జరిగిన హేయమైన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాము. భారతదేశం అన్ని రూపాల్లో, అన్ని రకాల ఉగ్రవాదాన్ని ఖండిస్తుంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ నిలబడుతుంది," అని ఆ పోస్ట్‌లో ఉంది.

వైరల్ పోస్టులో ఉన్న ఒరిజినల్ ట్వీట్ ఇక్కడ చూడొచ్చు



దీన్ని బట్టి ఇది ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలకు సంబంధం లేదని స్పష్టం చేస్తుంది. 2025 సెప్టెంబరులో ఈ సంఘటనను ప్రస్తావించిన నివేదికలను కనుగొనడానికి కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాం. సెప్టెంబరులో ఆరుగురు ఇజ్రాయెలీయులను చంపిన ఘటనను పలు మీడియా సంస్థలు నివేదించాయి. ఆ నివేదికలను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.

"జెరూసలేం ఉత్తర శివార్లలోని రద్దీగా ఉన్న బస్ స్టాప్ వద్ద పాలస్తీనా సాయుధులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, మరో 12 మంది గాయపడ్డారు. విధుల్లో లేని ఒక సైనికుడు, ఒక పౌరుడు జరిపిన కాల్పుల్లో సాయుధుడు మరణించారు. మృతులలో 79 ఏళ్ల మాజీ హృద్రోగ నిపుణుడు, 43 ఏళ్ల రబ్బీ, ఇటీవల స్పెయిన్ నుంచి వలస వచ్చిన 25 ఏళ్ల యువకుడు ఉన్నారు. మరో 26 మంది గాయపడగా, వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, మంత్రి ఇటామర్ బెన్-గ్విర్‌తో కలిసి జెరూసలేంలో దాడి జరిగిన ప్రదేశాన్ని సందర్శించారు." అని నివేదికలు తెలిపాయి.

ఇక అదే సమయంలో ప్రధాని మోదీ ఈ ఘటనను ఖండించిన నివేదికను పలు మీడియా సంస్థలు కూడా ప్రసారం చేశాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.

కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. 2025 సెప్టెంబరులో ప్రధాని మోదీ చేసిన ట్వీట్ ను ఇప్పటికి ఆపాదిస్తూ ఉన్నారు.


Claim :  ఇజ్రాయెల్ పై ఇరాన్ చేసిన దాడులను భారత ప్రధాని నరేంద్ర మోదీ ఖండిస్తూ. ప్రస్తుత పరిస్థితులకు, ప్రధాని మోదీ చేసిన ట్వీట్ కు ఎలాంటి సంబంధం లేదు
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News