ఫ్యాక్ట్ చెక్: వైరల్ వీడియోలో హిందీ పాటకు డ్యాన్స్ చేస్తున్న వ్యక్తి కాష్ పటేల్ కాదు
వైరల్ వీడియోలో ఉన్నది కాష్ పటేల్ కాదు. కాష్ పటేల్ హిందీ పాటకు డ్యాన్స్ చేసిన వీడియోను హ్యాకర్లు లీక్ చేశారంటూ ప్రచారం
అమెరికాకు చెందిన అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ (FBI) డైరెక్టర్‌గా భారతీయ అమెరికన్ కాష్ పటేల్ పని చేస్తున్నారు. కాష్ పటేల్ వ్యక్తిగత ఈమెయిల్ హ్యాక్ అయింది. తామే ఈ హ్యాకింగ్‌కు పాల్పడినట్టు ఇరాన్‌కు చెందిన హండాలా హ్యాక్ టీమ్ ప్రకటించింది. పటేల్ వ్యక్తిగత ఇన్‌బాక్స్ నుంచి ఫొటోలు, రెస్యూమెను హ్యాకర్లు ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారు. ఈ దాడుల్లో 2010-2019 మధ్య కాలం నాటి కాష్ పటేల్ వ్యక్తిగత, వృత్తిపరమైన ఈమెయిల్స్, ఫొటోలు హ్యాక్ అయ్యాయి. కాష్ పటేల్ ఫొటోలు, డేటాను ఇంటర్నెట్‌లో పోస్టు చేసిన హ్యాకర్లు, హ్యాకింగ్‌కు గురైన బాధితుల జాబితాలో ఇకమీదట కాష్ పటేల్ పేరు ఉంటుందని తెలిపింది. ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ ఈమెయిల్ హ్యాక్ అయిన విషయాన్ని యూఎస్ జస్టిస్ డిపార్ట్‌మెంట్ కూడా ధ్రువీకరించింది. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్టు చెప్పారు.
పాలస్తీనా అనుకూల హ్యాకర్లు అయిన హండాలా బృందాన్ని ఇరాన్ ప్రభుత్వ సైబర్ నిఘా విభాగం ఉపయోగించుకుంటుందని కొన్ని నివేదికలు తెలిపాయి. అమెరికాకు చెందిన పలు సంస్థలను, పలు నేతలను టార్గెట్ చేసినట్లు హండాలా ప్రకటించింది.
ఇంతలో ఓ వ్యక్తి డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
"ఎఫ్ బి ఐ డైరెక్టర్ కాష్ పటేల్ హిందీ పాటకు డాన్స్ చేస్తున్న వీడియోను ఇరాన్ హ్యాకర్లు విడుదల చేశారు.
#FBI
#kashpatel
#iranihackers" అంటూ పోస్టులు పెట్టారు.
"ఎఫ్ బి ఐ డైరెక్టర్ కాష్ పటేల్ హిందీ పాటకు డాన్స్ చేస్తున్న వీడియోను ఇరాన్ హ్యాకర్లు విడుదల చేశారు.
ఇరాన్ సుప్రీమ్ లీడర్ గే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన నేపద్యం లో ఇలాంటి మహిళ నృత్యానికి సంబంధించిన పాటకు fbi డైరెక్టర్ డాన్స్ చేయడం చూసిన వీడియో వైరల్ అవుతుంది.
#FBI #kashpatel #iranihackers #UANow" అంటూ మరికొందరు పోస్టు పెట్టారు.
వైరల్ పోస్టుకు సంబంధించిన ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.
స్క్రీన్ షాట్ ఇక్కడ ఉంది
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వీడియోలో ఉన్నది కాష్ పటేల్ కాదు.
వైరల్ వీడియోలోని కీఫ్రేమ్‌లను ఉపయోగించి చేసిన రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా 2021 నుండి ఈ వీడియో ఆన్ లైన్ లో ఉందని స్పష్టంగా తెలుస్తోంది.
ఈ వీడియోకు పటేల్‌తో గానీ, ఆరోపించబడిన ఈమెయిల్ హ్యాక్‌తో గానీ ఎలాంటి సంబంధం లేదు. ఆ వైరల్ క్లిప్ లో 1985 నాటి 'రామ్ తేరీ గంగా మైలీ' సినిమాలోని "సున్ సాహిబా సున్" పాటకు, తన భార్య పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక వ్యక్తి ఆనందంగా నృత్యం చేస్తూ కనిపించాడు.
Do PeG Andar Mandakini Bahar,,#best #comedy #cover #dance #subscribe అనే టైటిల్ తో Eco Friendly అనే యూట్యూబ్ ఛానల్ లో 29 మార్చి 2021న వీడియోను అప్లోడ్ చేసినట్లుగా మేము గుర్తించాం.
ఇక వైరల్ వీడియోలో ఉన్నది కాష్ పటేల్ కాదంటూ కూడా పలు మీడియా సంస్థలు నివేదించాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
1985లో వచ్చిన 'రామ్ తేరీ గంగా మైలీ' చిత్రంలోని 'సున్ సాహిబా సున్' అనే బాలీవుడ్ పాటకు ఒక వ్యక్తి నృత్యం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది ఎఫ్‌బిఐ డైరెక్టర్ కాష్ పటేల్ ఈమెయిల్ ఖాతా నుండి లీక్ అయిన ఒక ప్రైవేట్ క్లిప్ అని పోస్టుల్లో చెప్పడంలో ఏ మాత్రం నిజం లేదు.
వైరల్ వీడియోలో ఉన్నది కాష్ పటేల్ కాదు.