ఫ్యాక్ట్ చెక్: హోర్ముజ్ జలసంధి గుండా వెళ్ళడానికి భారత చమురు ట్యాంకర్ ఇరాన్‌కు చైనీస్ యువాన్‌లో చెల్లింపులు జరపలేదు

హోర్ముజ్ జలసంధి గుండా వెళ్ళడానికి భారత చమురు ట్యాంకర్ ఇరాన్‌కు

Update: 2026-03-26 03:21 GMT

ఇరాన్‌తో ఘర్షణను ముగించే దిశగా వాషింగ్టన్ పురోగమిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నారు. వైట్ హౌస్‌లో మాట్లాడుతూ, ఇరాన్‌లోని సరైన వ్యక్తులతో అమెరికా సంప్రదింపులు జరుపుతోందని, శత్రుత్వాన్ని విరమించుకోవడానికి ఒక ఒప్పందానికి రావడానికి టెహ్రాన్ ఆసక్తిగా ఉందని ట్రంప్ తెలిపారు. తాము ప్రస్తుతం చర్చలు జరుపుతున్నామని ఆయన విలేకరులతో అన్నారు. చర్చల పరిధి లేదా స్వరూపంపై మరిన్ని వివరాలు అందించలేదు.


పలు భారతీయ ఎల్పీజీ ట్యాంకర్లు హోర్ముజ్ జలసంధిని దాటి భారతదేశానికి చేరుకున్నాయి. దీని కోసం ఇరాన్‌ అనుమతి పొందాయి. ఇరాన్‌తో భారత్‌ సంప్రదింపుల నేపథ్యంలో హోర్ముజ్ జలసంధిలోని నిర్దేశిత మార్గంలో నౌకలు ప్రయాణించాయి. ఈ సందర్భంగా ఇరాన్ నావికాదళం వాటికి మార్గనిర్దేశం చేసింది. నౌకల మీదున్న జెండా, మూలం, గమ్యస్థానం, సిబ్బంది జాతీయతతో సహా వివరణాత్మక సమాచారాన్ని ఇరాన్‌ నేవీ సేకరించింది. భారత ట్యాంకర్లలోని సిబ్బంది వివరాలు నిర్ధారించుకున్న తర్వాత నిర్దేశిత మార్గంలో ఆ నౌక ప్రయాణించేందుకు ఇరాన్‌ నేవీ అనుమతించింది.

ఇంతలో హోర్ముజ్ జలసంధి గుండా వెళ్ళడానికి భారత్ కు చెందిన చమురు ట్యాంకర్ ఇరాన్‌కు చైనీస్ యువాన్‌లో చెల్లింపులు జరిపిందనే వాదనలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి

ఆ పోస్టులకు సంబంధించిన ఆర్కైవ్ క్లెయిమ్స్ ను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు

వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇక్కడ ఉన్నాయి



 



ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

సంబంధిత కీవర్డ్స్ ను ఉపయోగించి మేము గూగుల్ సెర్చ్ చేశాం. అయితే హోర్ముజ్ జలసంధి గుండా వెళ్ళడానికి భారత్ కు చెందిన చమురు ట్యాంకర్ ఇరాన్‌కు చైనీస్ యువాన్‌లో చెల్లింపులు జరిపిందనే వాదనలకు బలం చేకూరేలా ప్రముఖ మీడియా సంస్థలు, లేదా భారత ప్రభుత్వ విభాగాలు ప్రకటన చేయలేదు.

హోర్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణించే ఒక్కో సరుకు రవాణా నౌక నుంచి 2 మిలియన్ డాలర్లు చొప్పున వసూలు చేసేందుకు ఇరాన్‌ సిద్ధమవుతున్నట్టు వచ్చిన కథనాలపై ఇరాన్ స్పందించింది. భారతదేశంలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఈ వార్తలపై స్పందిస్తూ అవన్నీ అసత్యాలని కొట్టిపడేసింది. నిరాధార ఆరోపణలను నమ్మవద్దని సూచించింది. సరుకు రవాణా నౌకల నుంచి టోల్ ఫీజు వసూలు చేయాలనే ప్రతిపాదన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని, అది ఇరాన్ ప్రభుత్వ అధికారిక వైఖరిని సూచించదని రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.




ఐక్యరాజ్యసమితికి ఇరాన్ కీలక సమాచారాన్ని అందించింది. ఇరాన్ తో శత్రుత్వం లేని దేశాల నౌకలు హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించవచ్చని తెలిపింది. ఇరాన్ అధికారులతో ముందస్తుగా సమన్వయం చేసుకుంటే శత్రుత్వం లేని నౌకలు హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించవచ్చని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి (UNSC), అంతర్జాతీయ మారీటైమ్ ఆర్గనైజేషన్ (IMO) కి ఇరాన్ తెలియజేసింది.

అందుకు సంబంధించిన కథనాలు ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.


ఇక వైరల్ అవుతున్న పోస్టులను భారత విదేశీ వ్యవహారాలు, మంత్రిత్వ శాఖ ఖండించింది. అలాంటి ఘటన ఏదీ చోటు చేసుకోలేదని వెల్లడించింది.




కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.


Claim :  వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని MEA టీమ్ తెలిపింది
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News