ఫ్యాక్ట్ చెకింగ్: సెప్టెంబర్ 30 నాటికి ATMల నుండి 500 నోట్లను పంపిణీ చేయడాన్ని నిలిపివేయాలని RBI బ్యాంకులకు సూచించలేదు
ATMల నుండి 500 నోట్లను పంపిణీ చేయడాన్ని నిలిపివేయాలని
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ.2,000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన దాదాపు రెండు సంవత్సరాల తర్వాత కూడా, రూ.6,181 కోట్ల విలువైన 2000 రూపాయల నోట్లు ఇంకా కేంద్ర బ్యాంకుకు తిరిగి రాలేదు.
రూ.2,000 నోట్ల ఉపసంహరణ ప్రకటించిన మే 19, 2023న రూ.3.56 లక్షల కోట్లు విలువ ఉన్న రూ.2,000 నోట్ల మొత్తం విలువ మే 31, 2025 నాటికి రూ.6,181 కోట్లకు తగ్గిందని RBI ఇటీవల ఒక ప్రకటనలో తెలిపింది. మే 19, 2023 నాటికి చెలామణిలో ఉన్న రూ.2,000 నోట్లలో 98.26 శాతం తిరిగి వచ్చాయని వివరించారు. చెలామణి నుండి ఉపసంహరించుకున్నప్పటికీ, రూ.2,000 నోట్ చట్టబద్ధమైన ద్రవ్యంగా కొనసాగుతోంది. రిజర్వ్ బ్యాంక్ కు చెందిన 19 ఇష్యూ కార్యాలయాలలో రూ. 2,000 నోట్లను మార్చుకునే సౌకర్యం అందుబాటులో ఉందని RBI తెలిపింది. దేశంలోని ఏ పోస్టాఫీసు నుండైనా ఆర్‌బిఐ జారీ చేసిన ఏ కార్యాలయానికైనా పోస్ట్ ద్వారా రూ. 2000 నోట్లను పంపితే ఆ డబ్బును మీ అకౌంట్ నెంబర్ లోకి క్రెడిట్ చేస్తారు.
ఇంతలో ఏటీఎంల నుండి 500 రూపాయల నోట్లు రావంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.
"సెప్టెంబర్ 30 నాటికి ATMల నుండి 500 నోట్లను పంపిణీ చేయడాన్ని నిలిపివేయాలని RBI అన్ని బ్యాంకులను కోరింది.
మార్చి 31 నాటికి అన్ని బ్యాంకులలో 75% BANKS ATM మరియు తరువాత 90% ATM లక్ష్యం.
ఇకపై ATMలు 200 మరియు 100 నోట్లను మాత్రమే పంపిణీ చేస్తాయి." అంటూ పోస్టులు పెట్టారు.
"RBI has asked all banks to stop
disbursing 500₹ notes by 30 sep
from ATM.
Target is 75% of all banks
BANKS ATM & then 90% ATM
by 31 Mar26.
ATM going forward will only
disburse only 200₹ and
100₹ notes only.
#Public torture is Real" అంటూ ఇంగ్లీష్ లో కూడా పోస్టులు పెట్టారు.
ఇంతలో ఏటీఎంల నుండి 500 రూపాయల నోట్లు రావంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.
"సెప్టెంబర్ 30 నాటికి ATMల నుండి 500 నోట్లను పంపిణీ చేయడాన్ని నిలిపివేయాలని RBI అన్ని బ్యాంకులను కోరింది.
మార్చి 31 నాటికి అన్ని బ్యాంకులలో 75% BANKS ATM మరియు తరువాత 90% ATM లక్ష్యం.
ఇకపై ATMలు 200 మరియు 100 నోట్లను మాత్రమే పంపిణీ చేస్తాయి." అంటూ పోస్టులు పెట్టారు.
"RBI has asked all banks to stop
disbursing 500₹ notes by 30 sep
from ATM.
Target is 75% of all banks
BANKS ATM & then 90% ATM
by 31 Mar26.
ATM going forward will only
disburse only 200₹ and
100₹ notes only.
#Public torture is Real" అంటూ ఇంగ్లీష్ లో కూడా పోస్టులు పెట్టారు.
వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
వైరల్ పోస్టుల ప్రామాణికతను ధృవీకరించడానికి, మేము RBI అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాం. ముఖ్యంగా పత్రికా ప్రకటనలు, సర్క్యులర్‌లను సమీక్షించాము. ఎక్కడా కూడా ATMల ద్వారా 500 రూపాయల నోట్లను పంపిణీ చేయడాన్ని నిలిపివేయాలని RBI బ్యాంకులను ఆదేశించినట్లు వాదనకు మద్దతు ఇచ్చే ఎటువంటి సమాచారం మాకు దొరకలేదు.
ఆ తర్వాత మేము సంబంధిత కీవర్డ్ శోధనను నిర్వహించాము. RBI అన్ని బ్యాంకులను ATMల ద్వారా ₹500 నోట్లను పంపిణీ చేయడాన్ని నిలిపివేయాలని ఆదేశించిందని సూచించే ఎటువంటి విశ్వసనీయ నివేదికలు లభించలేదు.
మేము RBI వెబ్‌సైట్‌లో మరిన్ని వివరాల కోసం శోధించాము. 28 ఏప్రిల్ 2025న RBI జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ATMల ద్వారా 100, 200 రూపాయల నోట్లను కూడా పంపిణీ చేసేలా చూసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులు, వైట్ లేబుల్ ATM ఆపరేటర్లను (WLAOలు) ఆదేశించింది.
30 సెప్టెంబర్ 2025 నాటికి, అన్ని ATMలలో 75% కనీసం ఒక క్యాసెట్ నుండి ₹100 లేదా ₹200 డినామినేషన్ నోట్లను పంపిణీ చేయడానికి కాన్ఫిగర్ చేయాలని సూచించింది. ఈ సంఖ్య 31 మార్చి 2026 నాటికి 90%కి పెరుగుతుంది. రోజువారీ లావాదేవీలకు అధిక డిమాండ్ ఉన్న సాధారణంగా ఉపయోగించే డినామినేషన్‌లకు ప్రజలకు అందించడమే ఈ చర్య లక్ష్యం అని RBI తెలిపింది. అంతే తప్ప ఈ సర్క్యులర్‌లో 500 రూపాయల నోటు గురించి ప్రస్తావనే లేదు.
https://rbi.org.in/Scripts/
ఇక 500 రూపాయల గురించి ప్రచారంలో వాదనల్లో ఎలాంటి నిజం లేదంటూ PIB ఫ్యాక్ట్ చెక్ టీమ్ కూడా ధృవీకరించింది.
500 రూపాయల నోట్ల గురించి జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని పలు మీడియా సంస్థలు ఇటీవల కథనాలను ప్రచురించాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
కాబట్టి, ఏటీఎంలలో ఇకపై 500 రూపాయల నోట్లను ఇష్యూ చేయరంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు.
Claim : ATMల నుండి 500 నోట్లను పంపిణీ చేయడాన్ని నిలిపివేయాలని
Claimed By : Social Media Users
Fact Check : Unknown