ఫ్యాక్ట్ చెక్: దక్షిణాఫ్రికాలోని సుద్వాలా గుహలలో 6000 సంవత్సరాల పురాతన శివలింగం కనిపించడం నిజం కాదు

భారతదేశంలో అనేక ప్రసిద్ధ శివాలయాలు ఉన్నాయి. వాటిలో 12 జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయి. అత్యంత పవిత్రమైనవిగా, కొన్ని వేల

Update: 2025-08-12 11:59 GMT

6000 year old Shivling

భారతదేశంలో అనేక ప్రసిద్ధ శివాలయాలు ఉన్నాయి. వాటిలో 12 జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయి. అత్యంత పవిత్రమైనవిగా, కొన్ని వేల సంవత్సరాలకు చెందినవని నమ్ముతారు. భారతదేశం వెలుపల కూడా అనేక శివాలయాలు కనిపిస్తాయి. నేపాల్‌లోని పశుపతినాథ్ ఆలయం, ఇండోనేషియాలోని ప్రంబనన్ ఆలయం, పాకిస్తాన్‌లోని కటస్రాజ్ ఆలయంలో శివుడిని దర్శించుకోవడం కోసం దేశ విదేశాల నుండి భక్తులు తరలి వెళ్తూ ఉంటారు. 

దక్షిణాఫ్రికాలోని సుద్వాలా గుహలో 6000 సంవత్సరాల పురాతన శివలింగం ఉందని పేర్కొంటూ శివలింగం ఉన్న ఆలయ ప్రాంగణాన్ని చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోందిపోస్ట్‌లోని శీర్షికలో ఇలా వివరించారు. “దక్షిణాఫ్రికాలో 6000 సంవత్సరాల పురాతన శివలింగం కనుగొన్నారు. ఈ శివలింగం ఒక రహస్యమైన గుహలో ఉంది, అక్కడ ఇతర విగ్రహాలు కూడా ఉన్నాయి. సనాతన ధర్మం అత్యంత పురాతనమైనది. అనాది కాలం నుండి అక్కడ ఉందని ఎటువంటి సందేహం లేదు. సనాతన ధర్మాన్ని అంతం చేయాలని, చాలామంది ప్రయత్నించారు కానీ వారు దానిని అంతం చేయలేకపోయారు. హర్ హర్ మహాదేవ్”

“*दक्षिण अफ्रीका में 6000 साल पुराना शिवलिंग मिला* यह शिवलिंग एक रहस्यमयी गुफा में मिला जहाँ अन्य मूर्तियाँ भी थीं। इसमें कोई संदेह नहीं है कि सनातन धर्म सबसे प्राचीन धर्म है और अनादि काल से चला आ रहा है। कई लोगों ने कोशिश की, लेकिन वे इसे समाप्त नहीं कर पाए। हर हर महादेव” అంటూ హిందీ క్యాప్షన్ లో కూడా పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి.
Full View

Full View

Full View

క్లెయిం ఆర్కైవ్ లింక్ ని ఇక్కడ చూడొచ్చు.

ఫ్యాక్ట్ చెక్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ దృశ్యాలు దక్షిణాఫ్రికాకు చెందినవి కావు. భారతదేశంలోని వివిధ దేవాలయాలకు సంబంధించిన శివలింగాలను చూపిస్తున్నాయి. వీడియోను సరిగ్గా గమనించగా, వీడియోలో రెండు వేర్వేరు శివలింగాలు కనిపించాయి. కాబట్టి మేము వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి, Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను ఉపయోగించాం.

మొదటి ఫోటో:


‘@Pateshwar, Satara cave temples’ అనే క్యాప్షన్ తో ఫిబ్రవరి 27, 2022న ఒక ఇన్‌స్టాగ్రామ్ యూజర్ అప్లోడ్ చేసిన చిత్రాన్ని మేము కనుగొన్నాము.

మరొక ఇన్‌స్టాగ్రామ్ యూజర్ వీడియోలో కనిపిస్తున్న శివలింగం చిత్రాన్ని ‘పటేశ్వర్ ఆలయం’ అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు.

సతారాలోని పటేశ్వర్ ఆలయం గురించి ఇటీవల అప్లోడ్ చేసిన ఒక వీడియోను కూడా మేము కనుగొన్నాము. ఇది వైరల్ వీడియోలో కనిపించే అదే శివలింగాన్ని చూపిస్తుంది. వీడియోలోని వివరణలో పురాతన శివాలయమని ఉంది. 16వ శతాబ్దానికి చెందినదని నమ్ముతారు. ఆలయ సముదాయంలో ప్రత్యేకమైన రాతితో చెక్కబడిన వెయ్యికి పైగా శివలింగాలు ఉన్నాయి. బ్రహ్మ, విష్ణువు, మహిషాసురమర్దిని, అష్టమాత్రుల విగ్రహాలు, అద్భుతమైన నల్ల రాతి శిల్పాలు, ఖగోళ మూలాంశాలు అక్కడ ఉన్నాయి.

Full View


రెండో ఫోటో:


వైరల్ వీడియోలో కనిపించిన రెండవ శివలింగం కోసం రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతకగా, అది కేరళలోని కొట్టుకల్ లో ఆదిమలతురలోని ఆజిమల శివాలయంకు చెందిన శివలింగమని మేము కనుగొన్నాము.
సుద్వాలా గుహలు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన గుహలు. ఇవి దాదాపు 240 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి. సుద్వాలా గుహలు మిలియన్ల సంవత్సరాలుగా అత్యంత అద్భుతమైన సహజ నిర్మాణాలకు నిలయంగా ఉన్నాయి. మంత్రముగ్ధులను చేసే ఫ్లోస్టోన్ నిర్మాణాలను ఈ ప్రాంతంలో చూడవచ్చు, ఒక్కో నిర్మాణం ప్రత్యేకమైన కథను చెబుతుంది. ఈ అద్భుతమైన నిర్మాణాలు భూమి గతాన్ని తెలియజేస్తాయి.
Sudwala experience.com
వెబ్ సైట్ లో గుహలో వివిధ రాతి నిర్మాణాలను మనం చూడవచ్చు.

ఈ వాదన 2018 నుండి ఆన్‌లైన్‌లో ఉంది. పలు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని నిర్ధారించాయి.

కాబట్టి, వైరల్ వీడియో దక్షిణాఫ్రికాలోని సుద్వాలా గుహలలో శివలింగాన్ని చూపించడం లేదు. రెండు శివలింగాలు భారతదేశ దేవాలయాలలో భాగం. వైరల్ అవుతున్న వాదన నిజం కాదు.
Claim :  వైరల్ వీడియో దక్షిణాఫ్రికాలోని సుద్వాలా గుహలలో 6000 సంవత్సరాల పురాతన శివలింగాన్ని చూపిస్తోంది
Claimed By :  Social media users
Fact Check :  Unknown
Tags:    

Similar News