ఫ్యాక్ట్ చెక్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు చెందిన పాత వీడియోను ఇటీవలిదిగా వైరల్ చేస్తున్నారు

వైరల్ వీడియో పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత

Update: 2025-03-10 09:26 GMT

2024 ఎన్నికల్లో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచిన పిఠాపురం నియోజకవర్గంలో మార్చి 14న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి నాలుగు లక్షలకు పైగా కార్యకర్తలు, నాయకులు హాజరవుతారని పార్టీ అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్టుగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది.

ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు, 2014లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. ఆ సంవత్సరం ఆయన పోటీ చేయలేదు, కానీ 2019లో, పార్టీ వామపక్షాలు మరియు BSPతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ సమయంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ ఓడిపోయారు.
ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా పార్టీని పునర్నిర్మించారు, 2024లో అది గణనీయమైన విజయానికి దారితీసింది. NDA కూటమిలో భాగంగా పోటీ చేసిన జనసేన 21 అసెంబ్లీ సీట్లు, రెండు పార్లమెంటరీ సీట్లను గెలుచుకుంది, 100% స్ట్రైక్ రేట్‌ను సాధించింది. విజయం తర్వాత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

సనాతన ధర్మం కోసం ఎంత వరకూ అయినా పోరాడుతానని పవన్ కళ్యాణ్ అంటున్నారు. సనాతన ధర్మం పరిరక్షణ కోసం జనసేన అధ్వర్వంలో ఓ విభాగాన్ని ఏర్పాటు చేశారు. నరసింహ వారాహి గణం పేరుతో ప్రత్యేక విభాగాన్ని కూడా ప్రకటించారు. సనాతన ధర్మం పరిరక్షణే ఈ విభాగం లక్ష్యమని తెలిపారు.

అయితే పవన్ కళ్యాణ్ ఇఫ్తార్ పార్టీలో పాల్గొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

"इफ्तार पार्टी में बढ़ चढ़ कर हिस्सा लेते जोसफ विजय चंद्रशेखर ,

कुछ भाजपाई जलनखोर कहेंगे कि कोई हिंदुओं का धर्म रक्षक है।" అంటూ పోస్టు పెట్టారు. ఇఫ్తార్ పార్టీలో జోసెఫ్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. కొందరు బీజేపీ నేతలు ఈయన్ను హిందూ ధర్మ రక్షకుడిగా భావిస్తున్నారని ఆ పోస్టుల్లో ఉంది.





వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు:



 

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వీడియో ఇటీవలిది కాదు. వైరల్ అవుతున్న ఫోటోలలో ఉన్నది తమిళనటుడు జోసెఫ్ విజయ్ కాదు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేయగా పవన్ కళ్యాణ్ ఇటీవలి కాలంలో ఇఫ్తార్ కార్యక్రమంలో పాల్గొన్నట్లు మాకు ఎలాంటి నివేదికలు లభించలేదు.

అవి మార్చి 2019 నాటివి. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు జనసేన అభ్యర్థి ఇంట్లో పవన్ కళ్యాణ్ ఉన్నారు.

వైరల్ అవుతున్న వీడియో నుండి కీఫ్రేమ్స్ ను తీసుకుని మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాము. 25 మార్చి 2019న ది హన్స్ ఇండియా ప్రచురించిన కథనం మాకు కనిపించింది.

ఆ నివేదికలో పవన్ కళ్యాణ్ ఆరు ఫోటోలు ఉన్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో ఎన్నికల ప్రచారంలో ఆయన 'ఖురాన్, బిర్యానీని ఆస్వాదిస్తున్నట్లు' చూపించారని పేర్కొన్నారు. 'Pawan Kalyan enjoys Quran, biryani during election campaign in Guntur' అనే టైటిల్ తో కథనాన్ని ప్రచురించారు.

ది హన్స్ ఇండియా మరో నివేదికలో, 2019 సార్వత్రిక ఎన్నికలకు ప్రచారం చేస్తున్నప్పుడు కళ్యాణ్ జనసేన పార్టీ అభ్యర్థి షేక్ జియా ఉర్ రెహమాన్ ఇంటికి వెళ్ళారని ఉంది. రెహమాన్ గుంటూరు తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేశారు.

"గుంటూరు జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా జ‌న‌సేన అధ్య‌క్షులు శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు గుంటూరు తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి జ‌న‌సేన అభ్య‌ర్ధిగా పోటీ చేస్తున్న శ్రీ షేక్ జియా ఉర్‌ రెహ్మాన్ ఇంటిని సంద‌ర్శించారు." అంటూ జనసేన పార్టీ ఫేస్ బుక్ పేజీలో ఫోటోలను మేము గుర్తించాం.

Full View


2019 సంవత్సరంలో రంజాన్ నెల మే- జూన్ మధ్య వచ్చింది.



 


పవన్ కళ్యాణ్ గుంటూరు పర్యటనలో భాగంగా బిరియానీ తిన్నారంటూ పలు వీడియోలను యూట్యూబ్ లో 2019లో అప్లోడ్ చేశారు.

Full View

Full View

జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ జియా ఉర్ రెహమాన్ ఇంట్లో పవన్ కళ్యాణ్ ఉన్న ఆరేళ్ల కిందటి విజువల్స్, ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇఫ్తార్ పార్టీలో ఉన్న విజువల్స్ గా షేర్ చేస్తున్నారు. 


Claim :  వైరల్ వీడియో పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News