ఫ్యాక్ట్ చెక్: వైరల్ ఫోటోకు అహ్మదాబాద్ లో ఇటీవల చోటు చేసుకున్న విమాన ప్రమాదానికి ఎలాంటి సంబంధం లేదు

వైరల్ ఫోటో అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి

Update: 2025-06-14 02:44 GMT

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. విమానంలో ప్రయాణిస్తున్న 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో సహా మొత్తం 242 మందిలో 241 మంది మృతి చెందినట్లు ఎయిర్ ఇండియా అధికారికంగా ధ్రువీకరించింది. ఒకే ఒక్కరు ప్రాణాలతో బయటపడగా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన రమేష్ విశ్వాస్ కుమార్ తో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రమేష్ తో ప్రధాని చాలా సేపు మాట్లాడారు. 11A సీటులో కూర్చున్న ప్రాణాలతో రమేష్ విశ్వాస్ కుమార్ ప్రాణాలతో బయటపడ్డారు.

రమేష్ విశ్వాస్ కుమార్ ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. అయితే ఆయనతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా మాట్లాడారు. విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే పేలుడు శబ్దం వినిపించిందని, తాను సీటుతో సహా కింద పడిపోయాని, లేచి చూస్తే చుట్టు మృతదేహలు, మంటలు, విమాన శకలాలు ఉన్నాయని, తేరుకుని తనకు తాను నడుచుకుంటూ వచ్చానని ప్రధాని నరేంద్ర మోదీతో తో రమేష్ విశ్వాస్ కుమార్ చెప్పాడు. టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే ఈ ప్రమాదం జరిగిందని ఆయన మోదీకి వివరించారు. రమేష్ విశ్వాస్ కుమార్ గత ఇరవై ఏళ్లుగా బ్రిటన్ లో ఉంటున్నారు. తాను కుటుంబసభ్యులను కలుసుకునేందుకు వచ్చి తిరుగు ప్రయాణంలో లండన్ కు బయలుదేరారు. మధ్య సీట్లో కూర్చున్న విమానంలో మధ్య సీట్లో కూర్చున్న రమేష్ విశ్వాస్ కుమార్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే ఈ ప్రమాదంలో అతనితో పాటు ప్రయాణిస్తున్న సోదరుడు కనిపించడం లేదని రమేష్ విశ్వాస్ కుమార్ అందరినీ అడుగుతుండటం కలచి వేస్తుంది.

ఇంతలో విమాన ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ అంటూ పలు ఫోటోలు విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. అలాంటి ఫోటోలో పచ్చని కొండల పక్కన ఎయిర్ ఇండియా విమానం పడి ఉంది. ఇది జూన్ 12, 2025న అహ్మదాబాద్ లో చోటు చేసుకున్న ప్రమాదమని ప్రచారం చేస్తున్నారు.

Full View


Full View


వైరల్ అవుతున్న పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు


 

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న ఫోటో 2020 ఆగస్టు 7న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం IX-1344 కూలిపోయిన ఘటనకు సంబంధించింది

జూన్ 12, 2025న అహ్మదాబాద్ నుండి లండన్ కు బయలుదేరిన విమానం కొండల్లో కూలిపోలేదు. మెడికల్ కాలేజీ హాస్టల్ పై కూలిపోయింది.

242 మంది ప్రయాణికులతో లండన్‌కు వెళ్తున్న బోయింగ్ 787 విమానం బి.జె. మెడికల్ కాలేజీలోని రెసిడెన్షియల్ హాస్టల్ బ్లాక్‌పై కూలిపోయింది. ఈ ప్రమాదం వలన అనేక మంది ప్రాణాలు కోల్పోగా, డజన్ల కొద్దీ గాయపడ్డారు. ఈ ప్రమాదంలో బిల్డింగ్ గోడలు పగిలి, కిటికీలు విరిగి, భారీ మంటలు చెలరేగినప్పుడు చాలా మంది విద్యార్థులు, కార్మికులు, కుటుంబాలు భవనం లోపల ఉన్నారు. బి.జె. మెడికల్ కాలేజీ పై విమానం కూలింది అనడానికి పలు కథనాలు లభించాయి.

వాటిని ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.

ఇక వైరల్ అవుతున్న ఫోటోను తీసుకుని మేము గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం

2020 ఆగస్టు 7న కోజికోడ్‌లో జరిగిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన ప్రమాదానికి సంబంధించిన కథనాలు మాకు లభించాయి. పైలట్ తప్పిదం వల్ల జరిగిందని ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) నివేదికను విడుదల చేసింది. ప్రమాదానికి కారణం PF (పైలట్ ఫ్లయింగ్) SOP (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్)ని పాటించకపోవడం, ఆ సమయంలో అతను అస్థిరమైన విధానాన్ని కొనసాగించి టచ్‌డౌన్ జోన్ దాటి ల్యాండ్ అయ్యాడని నివేదికలు తెలిపాయి.

పలు మీడియా సంస్థలు అప్లోడ్ చేసిన ఫోటోలలో వైరల్ ఇమేజ్ ను చూడొచ్చు.

ఈ విమాన ప్రమాదంలో 20 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. ఆగస్టు 7న కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన B737-800 విమానం కూలిపోయింది. దుబాయ్ నుండి వస్తున్న విమానం విమానాశ్రయంలో రన్‌వేను దాటి.. ఆ తరువాత ముక్కలుగా విరిగిపోయింది. ఈ విమానంలో 190 మంది ఉన్నారు. ఇద్దరు పైలట్లు సహా 20 మంది మరణించారు, అనేక మంది గాయపడ్డారు. పలు యాంగిల్స్ లో
ఇదే ఫోటోను
మనం చూడొచ్చు.

పలు యూట్యూబ్ ఛానల్స్ లో కూడా వైరల్ ఫోటోతో సరిపోలే విజువల్స్ మాకు లభించాయి.

Full View



2020 ఆగస్టు 7న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన ప్రమాదం విజువల్స్ ను జూన్ 12, 2025న అహ్మదాబాద్ లో చోటు చేసుకున్న ప్రమాదంగా ప్రచారం చేస్తున్నారు.

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.


Claim :  వైరల్ ఫోటో అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News