ఫ్యాక్ట్ చెక్: భారీ ఆకారంలోని పీతలు సముద్రంలో నుండి బయటకు వచ్చాయంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు
న్యూజిలాండ్‌లో 3.5 అడుగుల అంతరించిపోయిన జెయింట్ పీతలు
పీతలు సముద్రాల వద్ద ఎక్కువగా సందడి చేస్తూ ఉంటాయి. చెరువులు, నదుల వద్ద కూడా పీతలు కనిపిస్తూ ఉంటాయి. పీతలను భారీగా పెంచి సొమ్ము చేసుకునే వారు కూడా ఉన్నారు. పీతలలో వైవిధ్యభరితమైన జాతులు ఉన్నాయి. 6,800 కంటే ఎక్కువ రకాలు ఉన్నాయి. అవి వివిధ ఆకారాలు, పరిమాణాలు, రంగులలో వస్తాయి, ప్రతి ఒక్కటి దాని నిర్దిష్ట నివాస స్థలం, జీవనశైలికి అనుగుణంగా ఉంటాయి. ఈ భూమిపై ఇవి మిలియన్ల సంవత్సరాలుగా పరిణామం చెందుతూ ఉన్నాయి.
పీతలు ప్రధానంగా జలచరాలు, ఇవి విస్తృతంగా సముద్ర, మంచినీటి వాతావరణాలలో నివసిస్తాయి. తీరప్రాంతాల వెంబడి, నదీముఖద్వారాలలో కూడా కనిపిస్తాయి. కొన్ని జాతులు ఉప్పునీటిలో మాత్రమే నివసిస్తాయి. పీతల్లో కొన్ని జాతులు ఒంటరి జీవితాలను గడుపుతాయి, మరికొన్ని జాతులు సమూహాలలో జీవిస్తాయి. పీతల ఆహార ప్రాధాన్యతలు వాటి జాతులు, ఆవాసాలను బట్టి మారుతూ ఉంటాయి. పీఠాలు ఆల్గే, డెట్రిటస్, చిన్న జంతువులతో సహా వివిధ రకాల సేంద్రియ పదార్థాలను కూడా తింటాయి. కొన్ని చిన్న చేపలను కూడా వేటాడతాయి.
న్యూజిలాండ్ లో భారీ పీతలు సముద్రంలో బయటకు వచ్చాయంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.
"న్యూజిలాండ్‌లో 3.5 అడుగుల అంతరించిపోయిన జెయింట్ పీతలు కనిపించాయి, శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోతున్నారు!
బ్రేకింగ్ న్యూస్: న్యూజిలాండ్‌లో 3.5 అడుగుల అంతరించిపోయిన జెయింట్ పీతలు కనిపించాయి, శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోతున్నారు!
న్యూజిలాండ్ తీరంలో ఒక ఆశ్చర్యకరమైన ఆవిష్కరణ జరిగింది! ఇప్పటివరకు అంతరించిపోయినట్లు భావించిన 3.5 అడుగుల పొడవైన జెయింట్ పీతలను శాస్త్రవేత్తలు చూశారు!
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ పీతలు వేల సంవత్సరాల క్రితం అంతరించిపోయాయి, కానీ ఇప్పుడు వాటి ఆవిష్కరణ సముద్ర జీవుల రహస్యాలపై కొత్త వెలుగును నింపింది.
ఈ ఆవిష్కరణ సముద్ర జీవుల చరిత్రను మార్చగలదా?
#BreakingNews #GiantCrab #ExtinctNoMore #NewZealandCrab #MarineLife #OceanDiscovery #AncientCreatures #CrabDiscovery #BackFromExtinction #NatureNews #WildlifeDiscovery #ScienceNews #ViralNews #RareFind #NatureLovers
#oceanlife #newzealand #wildlifephotography #NewsUpdate #wild#wildanimals #reels #viral #SANewsAndhraPradesh #sanewsandhrapradesh" అంటూ పోస్టు పెట్టారు.
https://www.facebook.com/reel/9440232716062772
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు

https://www.facebook.com/reel/
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఆ పీతలు కృత్రిమంగా తయారు చేశారని మేము నిర్ధారించాం.
మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేశాం. అయితే మాకు ఎలాంటి కథనాలు లభించలేదు. ఒకవేళ భారీ ఆకారం ఉన్న పీతలు బయటకు వచ్చి ఉంటే తప్పకుండా అది వార్తల్లో నిలిచి ఉండేది.
వైరల్ అవుతున్న వీడియో నుండి స్క్రీన్ షాట్ తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. MSN న్యూస్ పోర్టల్‌లో అందుకు సంబంధించిన వీడియో ఒకటి లభించింది.
https://www.msn.com/en-us/
"Massive crabs lifted by cranes in Chipiona, Spain
On June 23, 2024, near the shore in Chipiona, Spain, a surprising scene unfolded as two massive crabs awaited their turn to be lifted by cranes. In a video shared by @felixcebrian0, these giant crustaceans stood prominently, capturing the attention of onlookers with their impressive size." అంటూ ఆ వీడియోను పోస్టు చేశారు.
దీన్ని బట్టి స్పెయిన్‌లోని చిపియోనా తీరానికి సమీపంలో రెండు భారీ పీతలు ఉన్నాయి. ఈ క్లూ ద్వారా మేము ఆ లొకేషన్ కు సంబంధించిన ఫోటోలను గూగుల్ లో సెర్చ్ చేశాం.
పలువురు యూజర్లు అక్కడ ఉన్న ఈ భారీ పీతలను ఫోటోలు తీశారు. ఆ పీతలు కృత్రిమంగా తయారు చేశారని మేము నిర్ధారించాం. వాటిని ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
Ayuntamiento Chipiona అనే ఫేస్ బుక్ పేజీలో కూడా ఈ భారీ పీతలను క్రేన్ సాయంతో తరలిస్తున్నట్లు కూడా గుర్తించాం. ఆల్ఫ్రెడో జరాజాగా అనే కళాకారుడు వీటిని రూపొందించారని అందులో తెలిపారు.
ఆల్ఫ్రెడో జరాజాగా తన వెబ్‌సైట్‌లో ఈ భారీ శిల్పం "క్రాబ్స్ ఆన్ ది కోస్ట్" తయారీకి 4,300 కిలోగ్రాముల రీసైకిల్ చేసిన ఇనుము వాడారని తెలిపారు. సముద్ర వైవిధ్యాన్ని రక్షించడంపై అవగాహన పెంచడం ఈ ఆర్ట్ ద్వారా లక్ష్యంగా పెట్టుకున్నానని చెప్పారు.
ఆయన వెబ్ సైట్ లో పలు కళాఖండాలు కనిపించాయి.
https://alfredozarazaga.es/
కాబట్టి, వైరల్ అవుతున్న పీతలకు సంబంధించిన పోస్టుల్లో నిజం లేదు. ఈ పీతలు ఇనుముతో ఓ ఆర్టిస్టు తయారు చేసిన ఆకృతి.
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : న్యూజిలాండ్‌లో 3.5 అడుగుల అంతరించిపోయిన జెయింట్ పీతలు
Claimed By : Social Media Users
Fact Check : Unknown