ఫ్యాక్ట్ చెక్: ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రంగు గురించి కించపరిచే వ్యాఖ్యలు చేయలేదు.

2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి తప్పుడు వాదనలతో కూడిన అనేక వీడియోలు

Update: 2024-05-23 10:34 GMT

2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి తప్పుడు వాదనలతో కూడిన అనేక వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ చేస్తున్నారు. గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చర్మం రంగుపై భారత ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు చేశారని సోషల్ మీడియాలో 15 సెకన్ల నిడివి ఉన్న వీడియో వైరల్ అవుతూ ఉంది.

"ముర్ఖ్ మోడీ కో రాస్ట్రోపతి కో సన్మాన్ దేనా జ్ఞాన్ నేహి హై" అనే వాదనతో వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో యూజర్లు వీడియోను షేర్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాష్ట్రపతికి మర్యాద ఇవ్వడం తెలియదన్నది వైరల్ పోస్టుల సారాంశం.
Full View

Full View


ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ప్రధాని మోదీ ఒరిజినల్ క్లిప్ ను కాకుండా.. ఆయన మాటలను ఎడిట్ చేసి వీడియోను షేర్ చేశారు.
చర్మం రంగు గురించి జాత్యహంకార ప్రకటన చేసినందుకు మాజీ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సభ్యుడు సామ్ పిట్రోడాను ప్రధాని మోదీ విమర్శించారని వైరల్ వీడియో ద్వారా కనుగొన్నాం.
“Narendra Modi statement on Honorable President Draupadi skin color” అనే కీవర్డ్స్ ను ఉపయోగించి గూగుల్ సెర్చ్ చేయగా.. మే 9, 2024న టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కథనాన్ని ప్రచురించింది. “చర్మం రంగు కారణంగా రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ముకు కాంగ్రెస్ పార్టీ ఓటు వేయలేదు: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ” అని చెప్పినట్లుగా ఆ కథనంలో ఉంది.
“కరీంనగర్‌లో బుధవారం జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌ పార్టీ జాత్యహంకార ధోరణితో వ్యవహరిస్తూ ఉందని విమర్శించారు. ద్రౌపది ముర్ము ముదురు రంగులో ఉన్నందున రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆమెకు ఓటు వేయలేదు" అని మోదీ అన్నారు. సామ్ పిట్రోడా ఇటీవల చర్మం రంగుపై చేసిన వ్యాఖ్యలను ఉదహరించారు ప్రధాని మోదీ.
టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదికలో.. “ఇటీవల ది స్టేట్స్‌మన్‌కి ఇంటర్వ్యూ ఇస్తూ పిట్రోడా భారతదేశంలోని ప్రజల వైవిధ్యం గురించి వ్యాఖ్యలు చేశారు. తూర్పున ఉన్న ప్రజలు చైనీస్‌లా కనిపిస్తారు, పశ్చిమంలో ఉన్నవారు అరబ్బుల్లా కనిపిస్తారు, ఉత్తరాన ఉన్న ప్రజలు శ్వేతజాతీయుల్లా కనిపిస్తారు. దక్షిణాది ప్రజలు ఆఫ్రికన్స్ లా అని కనిపిస్తారు" అని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ కూడా విమర్శలు గుప్పించారు.
“BJP supporters during PM Narendra Modi's meeting in Warangal.” అనే క్యాప్షన్ తో టైమ్స్ ఆఫ్ ఇండియాలో కథనాన్ని కూడా మేము చూశాం.
మేము వరంగల్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభకు సంబంధించి సెర్చ్ చేసినప్పుడు, నరేంద్ర మోదీ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారానికి సంబంధించిన వీడియో కనిపించింది.
వీడియోలో 43.56 టైమ్ దగ్గర.. ప్రధాని మోదీ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గురించి వ్యాఖ్యలు చేశారు. "కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో ముర్ముకు ఎందుకు ఓటు వేయలేదు?" అని ప్రశ్నించారు.
అలాగే, ప్రసంగం సందర్భంగా శామ్ పిట్రోడా చర్మం రంగుపై చేసిన వ్యాఖ్యలను మోదీ విమర్శించారు.


Full View

45.06 టైమ్ స్టాంప్ వద్ద, సోషల్ మీడియాలో వైరల్ అయిన అసలు ప్రసంగాన్ని మేము కనుగొన్నాము.

Full View


బీజేపీ ప్రెస్ రిలీజ్ ను కూడా మేము కనుగొన్నాం..


 

ది సౌత్ ఫస్ట్ ప్రచురించిన కథనం ప్రకారం.. "ద్రౌపది ముర్ము చర్మం రంగు కారణంగా కాంగ్రెస్ ఆమెను రాష్ట్రపతి పదవికి వ్యతిరేకించింది అంటూ మోదీ వ్యాఖ్యలు చేశారు" అని ఉంది.
వైరల్ వీడియో ఎడిట్ చేశారని.. తప్పుడు వాదనతో వైరల్ చేస్తున్నారని స్పష్టమైంది. ఒరిజినల్ వీడియోలో, చర్మం రంగు గురించి సామ్ పిట్రోడా చేసిన జాత్యహంకార వ్యాఖ్యలను నరేంద్ర మోదీ విమర్శించారు.


Claim :  భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై ప్రధాని మోదీ విమర్శలు చేశారు
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News