ఫ్యాక్ట్ చెక్: భారతదేశంలో మాక్ డ్రిల్ ను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించలేదు
వైరల్ పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సాయుధ దళాలు పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ఉగ్రవాద శిబిరాలపై విరుచుకుపడ్డాయి. 'ఆపరేషన్ సిందూర్’ పేరిట నిర్వహించిన దాడుల తర్వాత ఇరు దేశాల సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిషేధిత ఉగ్రవాద సంస్థలైన జైషే మహమ్మద్ (జేఈఎం), లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ), హిజ్బుల్ ముజాహిదీన్‌లకు చెందిన మొత్తం తొమ్మిది స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ మే 7న దాడులు జరిపింది.
ఆపరేషన్ సింధూర్ గురించి విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాకు వివరించారు. విదేశాంగ, రక్షణ శాఖ సంయుక్తంగా మీడియా సమావేశాన్ని నిర్వహించారు. పహాల్గామ్ దాడి వెనక పాకిస్థాన్ అండదండలున్నట్లు రుజువులున్నాయని తెలిపారు. టీఆర్ఎఫ్ తీవ్రవాద సంస్థకు పాకిస్థాన్ సహకారం ఉందని తెలిపారు. గత ముప్ఫయి ఏళ్లుగా ఉగ్రవాదులకు పాకిస్థాన్ ఆశ్రయమిస్తుందని కల్నల్ సోఫియా ఖురేషీ చెప్పారు. ఎల్ఓసీలోని బింబర్ క్యాంప్ పై దాడి చేశామని చెప్పారు. ఇక్కడే లష్కర్ తోయిబా క్యాంప్ జరుగుతుందని కల్నల్ సోఫియా తెలిపారు.
ఇక మే 7న భారతదేశంలోని పలు ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. వైమానిక దాడులు జరిగే సమయంలో సామాన్య ప్రజలు ఎలా స్పందించాలో ఈ మాక్ డ్రిల్ ద్వారా తెలియజేయనున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 244 జిల్లాల్లో ఈ మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. సరిగ్గా సాయంత్రం నాలుగు గంటలకు నగరం అంతటా సైరన్లు మోగుతాయి. పోలీసు నియంత్రణ మైకులు, పారిశ్రామిక ప్రాంతాలు, అగ్నిమాపక సేవలు, గస్తీ వాహనాల నుండి సైరన్లు రెండు నిమిషాల పాటు మోగుతాయి. వైమానిక దాడి జరిగే అవకాశం ఉందంటూ హెచ్చరికలు వచ్చే ఆ సమయంలో ప్రజలు ప్రోటోకాల్‌లను అనుసరించాలని సూచించారు, ఆ సమయంలో వేగంగా ఆశ్రయం కోసం పరిగెత్తడం, అవసరమైన వస్తువులను సేకరించడం, బహిరంగ ప్రదేశాలను నివారించడం వంటివి ఉన్నాయి. సైరన్ మోగించిన తర్వాత పోలీసులు, అగ్నిమాపక, SDRF, వైద్య, రెవెన్యూ, స్థానిక సంస్థలు ప్రోటోకాల్ ప్రకారం స్పందిస్తాయి.
అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్ ను రద్దు చేశారంటూ కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రచారం చేస్తున్నారు.
వైరల్ అవుతున్న పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది.
కేంద్ర ప్రభుత్వం మాక్ డ్రిల్ ను రద్దు చేసిందా లేదా అని తెలుసుకోడానికి మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేశాం. అయితే మాకు అందుకు సంబంధించిన ఎలాంటి కథనాలు లభించలేదు. భారత ప్రభుత్వానికి చెందిన పలు సోషల్ మీడియా ఖాతాలను కూడా నిశితంగా పరిశీలించాం. ఎక్కడా కూడా మాక్ డ్రిల్ ను రద్దు చేసినట్లుగా ప్రకటనలు దొరకలేదు.
మాక్ డ్రిల్స్ ను ఆయా ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు పలు మీడియా సంస్థలు నివేదించాయి. అందుకు సంబంధించిన కథనాలు మాకు లభించాయి.
ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్ 3, ఖాన్ మార్కెట్, పుష్ప్ విహార్‌లోని బిర్లా విద్యా నికేతన్, ఢిల్లీ ప్రభుత్వం మాక్ డ్రిల్ నిర్వహించనున్న 55 ప్రదేశాలలో ఇవి కూడా ఒక భాగమని మీడియా నివేదికలు తెలిపాయి.
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మే 5న ఇచ్చిన ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా 'ఆపరేషన్ అభ్యాస్' అనే కోడ్‌నేమ్‌తో ఈ మార్క్ డ్రిల్స్ నిర్వహించనున్నారు. ఢిల్లీలో ఈ కసరత్తు సాయంత్రం 4 నుండి 7 గంటల మధ్య దాదాపు మూడు గంటల పాటు జరుగుతుంది. పాఠశాలల్లో ఈ డ్రిల్ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం వరకు జరుగుతుంది.
ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను ఈ కథనంలో చూడొచ్చు.
దేశంలోని పలు ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నట్లుగా నివేదికలు కూడా ఉన్నాయి.
గురుగ్రామ్ నగరంలో మాక్ డ్రిల్ కు సంబంధించిన సమాచారాన్ని పోలీసు అధికారులు పంచుకున్నారు.
ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి కూడా సాయంత్రం 7 గంటలకు మాక్ డ్రిల్ ఉంటుందని, భాగం కావాలంటూ ప్రజలను కోరారు.
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి.
Claim : వైరల్ పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ
Claimed By : Social Media Users
Fact Check : Unknown