ఫ్యాక్ట్ చెక్: వైరల్ వీడియోలో ఉన్నది టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ కాదు

ఇరాన్ కు చెందిన అథ్లెట్ వీడియోను వైరల్ చేస్తున్నారు

Update: 2025-07-30 05:15 GMT

బహిరంగ కార్యక్రమంలో గిరిజన వర్గాలపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో తెలుగు నటుడు విజయ్ దేవరకొండపై రాయదుర్గం పోలీసులు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల చట్టం కింద కేసు నమోదు చేశారు. 2025 ఏప్రిల్ 26న రెట్రో సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందర్భంగా విజయ్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ, గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు నేనావత్ అశోక్ కుమార్ నాయక్ దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు.


మే 03, 2025 న, విజయ్ దేవరకొండ Xలో "ఏ సమాజాన్ని, ముఖ్యంగా మన షెడ్యూల్డ్ తెగలను బాధపెట్టడం లేదా లక్ష్యంగా చేసుకోవడం ఉద్దేశ్యం లేదు, వారిని నేను ఎంతో గౌరవిస్తాను, మన దేశంలో అంతర్భాగంగా భావిస్తాను" అని పోస్ట్ చేశారు. "నేను ఐక్యత గురించి మాట్లాడుతున్నాను. మనం ఎలా కలిసి ముందుకు సాగాలి అనే దాని గురించి మాట్లాడాను. భారతీయులందరినీ నా కుటుంబంగా, నా సోదరులుగా నేను చూస్తాను." అంటూ చెప్పారు.

ఇక విజయ్ దేవరకొండ నటించిన కింగ్‌డమ్ జులై 31న భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. ఇక ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సక్సెస్ చేశారు. ఈ సినిమా 160 నిమిషాల రన్‌టైమ్‌తో U/A తో సెన్సార్ చేశారు. నిర్మాతలు U/A సర్టిఫికెట్ కోరినందున, రక్తపాతానికి సంబంధించిన కొన్ని షాట్‌లపై చర్యలు తీసుకున్నారు.

అయితే స్టంట్స్ చేస్తున్న ఓ వ్యక్తికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఆ వీడియోలో ఉన్నది విజయ్ దేవరకొండ అంటూ పోస్టులను పెట్టారు. పార్కోవర్ ఎంత చక్కగా విజయ్ దేవరకొండ చేశాడో చూడండంటూ పోస్టులను వైరల్ చేస్తున్నారు.



Full View




వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు


 



ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు. వీడియోలో ఉన్నది విజయ్ దేవరకొండ కాదు.

విజయ్ దేవరకొండకు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలను నిశితంగా పరిశీలించాం. అయితే ఎక్కడా కూడా ఈ వీడియోను అప్లోడ్ చేసినట్లుగా మేము గుర్తించలేదు.

వైరల్ వీడియోకు సంబంధించిన కీ ఫ్రేమ్స్ ను తీసుకుని మేము గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం.

mostafa.hormati అనే ఇంస్టాగ్రామ్ పేజీలో ఇదే వీడియోను జులై 14న పోస్టు చేశారు.

"Pkfr اینم یه مودل سخترش

اللهم عجل لولیک الفرج .
O God please hasten the reappearance of Mahdi
از خدا و برای خدا
From God and for God
_______________________________________________________

________________________________________________
#parkouriran #parkourworld #parkourasia #parkourlifestyle #parkourfreerunning #pkfr #parkourlife #parkour #pk #pkfrtv #wejumptheworld #freestyle #freerunning #freerun #style #jamovement #instagram #iran #lifestyle" అనే టైటిల్ తో వీడియోను పోస్టు చేశారు.



హ్యాష్ ట్యాగ్ లను బట్టి సదరు వ్యక్తి ఇరాన్ కు చెందిన మొస్తఫా హోరామతి అన స్పష్టంగా తెలుస్తోంది. అతడి బయోలో కూడా ఇరాన్ కు చెందిన అథ్లెట్ అని ఉంది.

అతడి అకౌంట్ ను పరిశీలిస్తే పార్కోవర్ కు సంబంధించిన పలు వీడియోలు మాకు లభించాయి. మొస్తఫా హోరామతికి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అందులో కూడా ఇదే తరహా వీడియోలను పోస్టు చేసినట్లు మేము గుర్తించాం.

Full View


ఇక వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదని పలు ఫ్యాక్య్ చెక్ మీడియా సంస్థలు కూడా కథనాలను ప్రచురించాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.



కాబట్టి, వైరల్ అవుతున్న వీడియోలో ఉన్నది విజయ్ దేవరకొండ కాదు. ఇరాన్ కు చెందిన అథ్లెట్.


Claim :  ఇరాన్ కు చెందిన అథ్లెట్ వీడియోను వైరల్ చేస్తున్నారు
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News