ఫ్యాక్ట్ చెక్: వైరల్ అవుతున్న వీడియోలో ఉన్న వ్యక్తి దీపు చంద్ర దాస్ కాదు

వైరల్ అవుతున్న వీడియోలో ఉన్న వ్యక్తి దీపు చంద్ర దాస్ వాదనలో ఎలాంటి నిజం లేదు

Update: 2025-12-26 10:32 GMT

బంగ్లాదేశ్‌లోని మైమెన్‌సింగ్ నగరంలో దైవదూషణ ఆరోపణలపై ఒక గుంపు దీపు చంద్ర దాస్‌ను కొట్టి చంపిందని వార్తలు వచ్చాయి. దాస్ వయస్సు 25 సంవత్సరాలు. బంగ్లాదేశ్ లో హిందూ మైనారిటీ సమాజానికి చెందినవాడు. అతను మైమెన్‌సింగ్‌లో నివసిస్తున్నాడు, అక్కడ అతను జీవనోపాధి కోసం ఫ్యాక్టరీ కార్మికుడిగా పనిచేసేవాడు. స్థానిక, ప్రత్యక్ష సాక్షుల కథనాల ప్రకారం, దీపు చంద్ర దాస్‌ దైవదూషణలు చేశాడనే ఆరోపణలు ఫ్యాక్టరీ ప్రాంగణంలోనూ, చుట్టుపక్కల ప్రాంతాలలో వేగంగా వ్యాపించాయి, ఇది కాస్తా ఉద్రిక్తతకు దారితీసింది. తరువాత కోపంతో ఉన్న ఒక గుంపు దాస్‌పై దాడి చేసి, తీవ్రంగా కొట్టింది. దాడి కారణంగా అతను అక్కడికక్కడే మరణించాడు. ఆ హత్య తర్వాత, ఆ గుంపు దాస్ మృతదేహాన్ని ఢాకా-మైమెన్‌సింగ్ హైవే పక్కన వదిలివేసి నిప్పంటించింది. దీంతో రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయిందని భాలుకా మోడల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ అబ్దుల్ మాలెక్ తెలిపారు.

తన కొడుకు మరణానికి దారితీసిన సంఘటనలను దీపు చంద్ర దాస్ తండ్రి రవిలాల్ దాస్ వివరించారు. ఈ సంఘటన గురించి మొదట సోషల్ మీడియా ద్వారా కుటుంబం తెలుసుకున్నట్లు తెలిపారు. ఫేస్‌బుక్ నుండి తాము చాలా విషయాలు వినడం ప్రారంభించాము, అరగంట తర్వాత బంధువులు నా కొడుకును తీసుకెళ్లారని చెప్పారు. వారు అతన్ని చెట్టుకు కట్టేసినట్లు, తన కొడుకుపై కిరోసిన్ పోసి నిప్పంటించిందని రవిలాల్ దాస్ చెప్పారు. తన కుమారుడి కాలిన శరీరాన్ని బయట వదిలేశారని వాపోయారు.

అయితే బంగ్లాదేశ్ పోలీసులు దీపు చంద్ర దాస్‌ను నిరసనకారులకు అప్పగించారంటూ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అతని మరణానికి ముందు ఉగ్రవాదులకు అప్పగించినట్లు చూపించే ఒక వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. అతడు వద్దని వేడుకుంటున్నా కూడా పోలీసులు వినకుండా నిరసనకారులకు దీపు చంద్ర దాస్ ను అప్పగించారని వైరల్ అవుతున్న పోస్టుల ద్వారా తెలుస్తోంది. ఆ లింక్స్ ను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు. పలు తెలుగు మీడియా సంస్థలు ఈ వీడియోను ప్రచురించాయి. 

వైరల్ పోస్టులకు సంబంధించిన ఆర్కైవ్ లింక్స్ ను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు
వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ ఉంది



 



ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వీడియోలో ఉన్నది దీపు చంద్రదాస్ కాదు.

వైరల్ వీడియోలోని కీఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాము. బంగ్లాదేశ్ వార్తా సంస్థ Bhorer Kagoj 18 నవంబర్ 2025న అప్‌లోడ్ చేసిన వైరల్ క్లిప్ మాకు కనిపించింది. “ఈ ఢాకా కాలేజీ విద్యార్థికి ఏమి జరిగింది?” అనే క్యాప్షన్‌తో వీడియోను. ఈ వీడియో దీపు చంద్ర దాస్ హత్యకు
సంబంధించినది కాదని
స్పష్టం చేస్తుంది.



ఈ సంఘటనకు దీపు చంద్ర దాస్ హత్యోదంతానికి దాదాపు ఒక నెల ముందు జరిగినది. మతాన్ని అవమానించాడనే పుకార్ల నేపథ్యంలో, బంగ్లాదేశ్ హిందూ యువకుడు దీపు చంద్ర దాస్‌ను 2025 డిసెంబర్ 18న మైమెన్‌సింగ్ జిల్లాలోని ఒక రహదారిపై దారుణంగా కొట్టి చంపి, అతని మృతదేహాన్ని దహనం చేశారు. పోలీసులు, అధికారులు దైవదూషణ ఆరోపణకు మద్దతు ఇచ్చే ఎటువంటి ఆధారాలు కనుగొనలేదని పేర్కొన్నారు.

@dhakatoday_news అనే యూట్యూబ్ ఛానల్ లో కూడా ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అప్లోడ్ చేశారు. నవంబర్ 18 నుండి వీడియో ఆన్ లైన్ లో ఉంది.

Full View


వీడియోలో, ఆ వ్యక్తి ఢాకా కాలేజీ లోగో, "మోమిన్" అనే పేరు ముద్రించబడిన జెర్సీని ధరించి ఉన్నాడు. అతను తాను ఢాకా కాలేజీకి చెందినవాడినని, ఎటువంటి నిరసనతో సంబంధం లేదని వేడుకుంటున్నట్లు వినవచ్చు.





 


స్థానిక బంగ్లాదేశ్ వార్తా సంస్థ నివేదించిన అదే సంఘటనకు సంబంధించిన నిడివి ఎక్కువ ఉన్న వీడియోను కూడా మేము కనుగొన్నాము. వీడియోలో ఆ వ్యక్తి తన పేరును అబ్దుల్ మోమిన్ అని పేర్కొన్నాడు. అతను గాయపడినందున ఒక పోలీసు అధికారి అతనికి సహాయం చేస్తున్నట్లు కనిపిస్తుంది.


Full View



వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని పలు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు కూడా కథనాలను ప్రచురించాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.

ఢాకా కళాశాల విద్యార్థి వీడియోను బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడు దీపు చంద్ర దాస్ హత్యకు సంబంధించిన విజువల్స్ గా పోల్చుతున్నారు.


Claim :  వైరల్ అవుతున్న వీడియోలో ఉన్న వ్యక్తి దీపు చంద్ర దాస్ వాదనలో ఎలాంటి నిజం లేదు
Claimed By :  social media users
Fact Check :  Unknown
Tags:    

Similar News