ఫ్యాక్ట్ చెక్: మహేంద్ర సింగ్ ధోనిని యూకే పోలీసులు అరెస్ట్ చేయలేదు

ముసుగు ధరించిన ఒక వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు ఎస్కార్ట్ చేస్తూ తీసుకెళ్తుండగా

Update: 2025-11-16 12:35 GMT

ఐపీఎల్ 2026 కు సంబంధించి జరిగిన ట్రేడింగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. మహేంద్ర సింగ్ ధోనికి డిప్యూటీగా వ్యవహరించిన రవీంద్ర జడేజాను వదులుకుంది. సంజూ శాంసన్ ను ట్రేడింగ్ ద్వారా తీసుకుంది. ధోని మరో సంవత్సరం పాటూ అలరించబోతున్నట్లు అధికారికంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రకటించింది.

ముసుగు ధరించిన ఒక వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు ఎస్కార్ట్ చేస్తూ తీసుకెళ్తుండగా, ఆ వ్యక్తి వెనుక అనేక మంది పరిగెత్తుకుంటూ వెళ్తున్నట్లు చూపించే ఒక సోషల్ మీడియా వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతూ ఉంది. ఈ వీడియోలో ముసుగు ధరించిన వ్యక్తి మాజీ భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని అని, అది అతన్ని UK పోలీసులు అరెస్టు చేసినట్లు చూపిస్తుందని సోషల్ మీడియా వినియోగదారులు ఆరోపించారు.

అందుకు సంబంధించిన క్లెయిమ్స్ ఇక్కడ చూడొచ్చు.


ఇదే పోస్టులు 2022 లో కూడా వైరల్ అయ్యాయి




వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు



 



ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

మహేంద్ర సింగ్ ధోనిని యూకే పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. ఒకవేళ అలాంటిది జరిగి ఉంటే అది ఖచ్చితంగా మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ హైలైట్ అయి ఉండేది.

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని అభిమానులు చుట్టుముట్టగా కారు వద్దకు అధికారులు తీసుకెళ్లడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే దీనిని ధోనిని UK పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సూచిస్తూ పోస్టులు పెట్టారు.

ఈ వీడియో 2022 నాటిది, ఎంఎస్ ధోని భారతదేశం, ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే చూడటానికి UKకి వెళ్ళినప్పుడు చోటు చేసుకుంది. అతని అరెస్టుకు సంబంధించిన నివేదికలు లేదా ఆధారాలు లేవు.

వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, మలయాళ వార్తా సంస్థ మనోరమ న్యూస్ షేర్ చేసిన నిడివి ఎక్కువ ఉన్న వీడియో మాకు దొరికింది, ఈ వీడియోను జూలై 17, 2022న ప్రచురించింది.


Full View


సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేయగా భారత మాజీ కెప్టెన్ అరెస్టు చేయలేదని అనేక ఇతర వార్తా నివేదికలు తెలిపాయి. జూలై 2022లో ఇంగ్లాండ్‌లో ధోనితో సెల్ఫీలు తీసుకోవడానికి అభిమానుల గుంపు ముందుకు రావడంతో సెక్యూరిటీ అధికారులు ధోనిని తీసుకెళ్లారు. భారత మాజీ కెప్టెన్ ధోని చివరకు తన కారులో చేరుకున్నారు. ధోనికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారని ఈ ఘటన చూపిస్తుంది. ధోని 2020 లో అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. ఇప్పుడు ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు.

2022 లో వచ్చిన ప్రముఖ మీడియా కథనాలను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.

వైరల్ పోస్టుల్లోని కథనాలనే ఇక్కడ స్క్రీన్ షాట్స్ గా వాడారు.

కాబట్టి, 2022లో అభిమానుల తాకిడి నుండి ధోనిని అధికారులు తప్పిస్తున్న వీడియోను ధోని అరెస్ట్ గా ప్రచారం చేస్తున్నారు.


Claim :  చుట్టు ముట్టిన అభిమానుల నుండి ధోనిని సెక్యూరిటీ సిబ్బంది పక్కకు తీసుకుని వెళ్తున్నారు
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News