ఫ్యాక్ట్ చెకింగ్: ఐసీసీ పాకిస్థాన్ క్రికెట్ బోర్డును ఒక సంవత్సరం పాటూ బ్యాన్ చేసిందంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు
ఐసీసీ పాకిస్థాన్ క్రికెట్ బోర్డును ఒక సంవత్సరం పాటూ బ్యాన్
2026 టీ20 ప్రపంచ కప్ భారత్-శ్రీలంకలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే భారత్ లో తమ జట్టు మ్యాచ్ లను నిర్వహించడానికి పాకిస్థాన్ జట్టు ఒప్పుకోలేదు. దీంతో పాకిస్థాన్ మ్యాచ్ లన్నీ శ్రీలంకలో నిర్వహించనున్నారు. అయితే ఈ ప్రపంచ కప్ లో లీగ్ మ్యాచ్ లో పాకిస్థాన్ భారత్ తో ఆడడానికి ఒప్పుకోలేదు. ఈ విషయాన్ని పాకిస్థాన్ ప్రభుత్వం వెల్లడించింది. ఫిబ్రవరి 15న ఐసీసీ ప్రపంచ కప్ లీగ్ మ్యాచ్ లో భారత్ తో పాకిస్థాన్ తలపడనుంది. ఈ మ్యాచ్ జరగకపోతే పాకిస్థాన్ పై ఐసీసీ పలు ఆంక్షలు విధించే అవకాశం ఉంది.
2026 T20 ప్రపంచ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కొలంబోలో భారత్‌తో జరిగే గ్రూప్ A మ్యాచ్‌లో పాకిస్తాన్ పాల్గొనడంపై అనిశ్చితి నెలకొంది. ఫిబ్రవరి 7 నుండి ప్రారంభమయ్యే టోర్నమెంట్‌లో పాకిస్థాన్ జాతీయ జట్టు పాల్గొనడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ, ఫిబ్రవరి 15న భారత్‌తో జరిగే హై ప్రొఫైల్ మ్యాచ్‌కు పాకిస్తాన్ మైదానంలోకి దిగబోమని ప్రకటించింది.
అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఒక సంవత్సరం నిషేధం విధించిందని పేర్కొంటూ మీడియా ఒక చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నిషేధం కింద, పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) కూడా ఒక సంవత్సరం పాటు నిలిపివేనున్నారు. ICC ఆదాయంలో పాకిస్తాన్ వాటా తగ్గించనున్నారని ఆ లెటర్ లో ఉంది.
"నిన్నటి సమావేశంలో పాకిస్తాన్‌కు సంబంధించిన అంశాలను ఐసిసి లేవనెత్తింది, అక్కడ 14-2 ఓట్లు వచ్చాయి. ఓటింగ్ తర్వాత, పాకిస్తాన్ క్రికెట్‌ను ఒక సంవత్సరం నిషేధించాలని మేము నిర్ణయించాము. పిఎస్‌ఎల్‌ను ఓ సంవత్సరం నిషేధించనున్నారు. వార్షిక ఆదాయంలో పాకిస్తాన్ వాటా 5.75% నుండి 2.25% కు తగ్గించనున్నారు. 2040 సంవత్సరం వరకు పాకిస్తాన్ ఎటువంటి ఐసిసి టోర్నమెంట్‌లను నిర్వహించడానికి అనుమతించము. క్రీడ యొక్క సమగ్రత, స్ఫూర్తిని అన్ని విధాలుగా నిలబెట్టాలని ఐసిసి నిర్ణయిస్తుంది. ధన్యవాదాలు." అని ఆ లెటర్ లో ఉంది. కింద జై షా సంతకం కూడా అందులో చూడొచ్చు.

ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేశాం. అయితే మాకు ఎక్కడా కూడా పాకిస్థాన్ ను ఐసీసీ బ్యాన్ చేసినట్లుగా నివేదికలు లభించలేదు.
అంతేకాకుండా టీ20 ప్రపంచ కప్- 2026 మొదటి మ్యాచ్ లో పాకిస్థాన్ ఆడింది. ఆ మ్యాచ్ కు సంబంధించిన స్కోర్ బోర్డు ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
మ్యాచ్ కు సంబంధించిన హైలైట్స్ ఇవిగో!!

ఇక అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) అధికారిక ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, X హ్యాండిల్‌లో పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై ఎటువంటి నిషేధాన్ని ప్రకటించిన నోటీసు కనుగొనబడలేదు.
ఫిబ్రవరి 1, 2026న ICC అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసిన మీడియా ప్రకటనను మేము గమనించాము.
ఆ ప్రకటనలో ప్రపంచ క్రికెట్ పర్యావరణ వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున PCB నిర్ణయాన్ని పరిశీలిస్తుందని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కూడా వ్యక్తం చేసింది. 2026 ICC పురుషుల T20 ప్రపంచ కప్‌లో ఎంపిక చేసుకుని పాల్గొనాలనే నిర్ణయం గురించి పాకిస్తాన్ ప్రభుత్వం చేసిన ప్రకటనను ICC గుర్తించింది.
పలు మీడియా సంస్థలు ఐసీసీ అధికారిక లెటర్ ను పోస్టు చేశాయి. వైరల్ పోస్టులోని లెటర్ ను, ఒరిజినల్ ఐసీసీ ప్రకటనము పోల్చి చూస్తే, ఫాంట్‌లో తేడా కనిపిస్తుంది. అసలు పత్రికా ప్రకటనలో జై షా సంతకం లేదు, వైరల్ లెటర్ లో మాత్రం జై షా సంతకం కనిపిస్తుంది.
ఫిబ్రవరి 5, 2026న పలు మీడియా కథనాలలో బంగ్లాదేశ్‌కు మద్దతుగా ఫిబ్రవరి 15న జరగనున్న టీ20 ప్రపంచ కప్ 2026లో జరగనున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ను బహిష్కరించాలని పాకిస్తాన్ నిర్ణయించింది. బంగ్లాదేశ్ భారతదేశంలో ఆడటానికి నిరాకరించిన తర్వాత, ఐసిసి ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్‌ను తీసుకొచ్చింది. దీన్ని పాకిస్తాన్ ప్రశ్నిస్తోంది. అంతే తప్ప పాకిస్థాన్ ను ఐసీసీ రెండేళ్ల పాటూ నిషేధించినట్లుగా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : ఐసీసీ పాకిస్థాన్ క్రికెట్ బోర్డును ఒక సంవత్సరం పాటూ బ్యాన్
Claimed By : Social Media Users
Fact Check : Unknown