ఫ్యాక్ట్ చెక్: ఏఐ ద్వారా సృష్టించిన వీడియోను చిరుత ట్రైన్ లో నిద్రపోతున్న వారిపై దాడి చేసిందంటూ ప్రచారం చేస్తున్నారు

ఐ ద్వారా సృష్టించిన వీడియోను చిరుత ట్రైన్ లో నిద్రపోతున్న వారిపై దాడి చేసిందంటూ

Update: 2026-04-08 04:13 GMT

అటవీ ప్రాంతాల్లో కూడా ఇండియన్ రైల్వేకు చెందిన ట్రాక్స్ ను వేశారు. చాలా సందర్భాల్లో ట్రైన్ ఢీకొని ఎన్నో అడవి జంతువులు ప్రాణాలు కోల్పోయాయి. ఈ ప్రమాదాలను తగ్గించడం కోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను భారతీయ రైల్వేలో ఉపయోగిస్తూ ఉన్నారు. రైల్వే ట్రాక్‌లపై వన్యప్రాణులను, ముఖ్యంగా ఏనుగులు, సింహాలు, పులులను రక్షించడానికి భారతీయ రైల్వే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత చొరబాటు గుర్తింపు వ్యవస్థ ను ప్రవేశపెట్టింది. ఈ అత్యాధునిక సాంకేతికత, జంతువుల ఉనికిని గుర్తించడానికి డిస్ట్రిబ్యూటెడ్ అకౌస్టిక్ సిస్టమ్ (DAS)ను ఉపయోగిస్తుంది. ఇది లోకో పైలట్‌లు, కంట్రోల్ రూమ్‌లను 0.5 కిలోమీటర్ల ముందుగానే అప్రమత్తం చేస్తుంది.

AI-ఆధారిత ఈ వ్యవస్థ, లోకో పైలట్‌లు, స్టేషన్ మాస్టర్‌లు, కంట్రోల్ రూమ్‌లకు రియల్ టైమ్ హెచ్చరికలను జారీ చేస్తుంది, తద్వారా వేగవంతమైన నివారణ చర్యలు తీసుకోవడానికి వీలు కల్పిస్తుంది. మొదట ఈశాన్య సరిహద్దు రైల్వేలో 141 కిలోమీటర్ల మేర అమలు చేశారు. ఈ వ్యవస్థ విజయవంతంగా పనిచేస్తోంది. దీని పనితీరు ఆధారంగా, భారతీయ రైల్వే వ్యాప్తంగా అమలు చేయడానికి ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

అయితే అటవీ ప్రాంతంలో రైలు ఆగిందని ఇంతలో ఓ చిరుతపులి కంపార్ట్మెంట్ లో నిద్రపోతున్న వ్యక్తుల మీద దాడి చేసిందంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.

వైరల్ పోస్టుకు సంబంధించిన ఆర్కైవ్ లింక్ ఇక్కడ ఉంది

https://archive.ph/YIxeM

వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ చూడొచ్చు




 



ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ వీడియోను ఏఐ ద్వారా సృష్టించారు.

ఇటీవలి కాలంలో చిరుతపులి ట్రైన్ లో వెళుతున్న ప్రయాణీకులపై దాడి చేసి గాయపరిచిందా అని తెలుసుకోవడం కోసం మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేశాం. అయితే మాకు ఎలాంటి రిపోర్టులు లభించలేదు.

ఇక వైరల్ వీడియోను నిశితంగా పరిశీలించగా అందులో పలు తేడాలు కనిపించాయి. పడుకున్న వ్యక్తుల హావభావాలు, వారు స్పందించిన విధానంలో ఎన్నో మార్పులను గమనించవచ్చు. ఇవి సాధారణంగా ఏఐ వీడియోలలో కనిపించే గుర్తులు. కాబట్టి ఇది ఏఐ వీడియో సృష్టి అనే అనుమానాలు కలిగాయి.

ఇక ఈ వీడియో కింద కామెంట్లలో కూడా ఏఐ అంటూ పలువురు అనుమానాలను వ్యక్తం చేశారు. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ ఉంది. 




ఇక వీడియో కింద గ్రోక్ కూడా ఈ వీడియో ఏఐ సృష్టి అంటూ తేల్చింది.

వైరల్ వీడియో ఏఐ ద్వారా సృష్టించారా లేదా అని తెలుసుకోడానికి మేము హైవ్ ఏఐ డిటెక్షన్ టూల్ ను ఉపయోగించాం. అయితే ఇది ఏఐ ద్వారా సృష్టించారని స్పష్టం చేసింది.



 

కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఏఐ ద్వారా సృష్టించిన వీడియోను నిజమైన ఘటనగా ప్రచారం చేస్తున్నారు.


Claim :  ట్రైన్ లో నిద్రపోతున్న వారిపై చిరుతపులి దాడి
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News