ఫ్యాక్ట్ చెక్: పార్లమెంట్ లో ప్రధాని నరేంద్ర మోదీ, ఎంపీ రాహుల్ గాంధీ గొడవపడ్డారంటూ వైరల్ అవుతున్న ఫోటోను ఏఐ ద్వారా సృష్టించారు
పార్లమెంట్ లో ప్రధాని నరేంద్ర మోదీ, ఎంపీ రాహుల్ గాంధీ గొడవ
By - Sachin SabarishUpdate: 2026-02-06 17:54 GMT
ఢిల్లీలోని పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు 2026లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రధాని రాజీపడ్డారు అని రాసిన పోస్టర్లతో కాంగ్రెస్ , ఇతర ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ మెట్లపై నిరసనకు దిగారు. అయితే లోక్‌సభలో 8 మంది ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్‌కు నిరసనగా ఈ ఆందోళన జరిగింది. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం విషయంలో ప్రధాని మోదీ భారత రైతుల శ్రమను తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఇక పలువురు సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. స్పీకర్ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వకుండానే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభ ఆమోదం తెలిపింది. పార్లమెంట్ చరిత్రలో గత 22 ఏళ్లలో ఇలా జరగడం ఇదే తొలిసారి.
జనవరి 28న ప్రారంభమైన పార్లమెంటు బడ్జెట్ సమావేశాల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఘర్షణ పడుతున్నట్లు సోషల్ మీడియాలో ఓ చిత్రం వైరల్ అవుతూ ఉంది. లోక్‌సభ కార్యకలాపాల నుండి గాంధీ ప్రధానమంత్రి వద్దకు వెళ్లి ఆయన వైపు వేలు చూపుతున్నట్లు కనిపించే క్షణం ఇదని చెబుతున్నారు.
వైరల్ పోస్టులకు సంబంధించిన ఆర్కైవ్ లింక్స్ ను
ఇక్కడ,
ఇక్కడ చూడొచ్చు.
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ ఉంది.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న ఫోటో నిజమైనది కాదు. ఇది ఏఐ ద్వారా సృష్టించారు.
వైరల్ చిత్రంతో పాటూ పోస్టు చేస్తున్న వీడియోలకు సంబంధించి అలాంటి గొడవ ఇటీవల జరిగిందా అని నిర్ధారించగల విశ్వసనీయ మీడియా నివేదికలను కనుగొనడానికి Googleలో కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాం. అయితే విశ్వసనీయ వార్తా సంస్థలు లేదా చిత్రం ప్రామాణికతను ధృవీకరించే వీడియో ఫుటేజ్‌ల నుండి ఎటువంటి నివేదికలు రాలేదు. అలాంటి సంఘటన జరిగి ఉంటే, దానిని మీడియా తప్పకుండా నివేదించి ఉండేది.
అయితే పార్లమెంట్ ఆవరణలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సెషన్ ప్రారంభానికి ముందు పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద ప్రతిపక్ష ఎంపీలు నిరసనకు దిగారు. ఈ సమయంలో కేంద్ర మంత్రి వెళ్తుండగా.. ‘మిత్రద్రోహి వెళ్తున్నాడు.. ఆయనను చూడండి’ అంటూ రాహుల్ గాంధీ అన్నారు. బిట్టూ వైపు చేయి చాపి ‘హలో బ్రదర్, నా ద్రోహి మిత్రమా.. కంగారు పడకు, నువ్వు మళ్లీ తిరిగి కాంగ్రెస్‌లోకే వస్తావు' అంటూ చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీ కరచాలనం చేసేందుకు ప్రయత్నించినప్పటికీ, రవనీత్ బిట్టూ తిరస్కరించారు. రాహుల్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన బిట్టూ రాహుల్ గాంధీని దేశానికి శత్రువు అని అభివర్ణించారు. అందుకు సంబంధించిన కథనాలు
ఇక్కడ,
ఇక్కడ ఉన్నాయి.
ఈ ఘటన తప్ప 2026 బడ్జెట్ సమావేశాల సమయంలో మరే గొడవకు సంబంధించిన కథనాలు మాకు లభించలేదు.
ఇక వైరల్ చిత్రాన్ని నిశితంగా పరిశీలించాం. ఇది AI ద్వారా సృష్టించారనే అనుమానాలు బలపడ్డాయి. అంతేకాకుండా అందుకు సంబంధించి పలు సూచనలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు గొడవ జరుగుతున్న సమయంలో లోక్‌సభ హాల్ లోపల అనేక మంది కెమెరా ఆపరేటర్లు ఉన్నట్లు కనిపించింది, అలా జరగడం అసాధ్యం.
ఈ చిత్రం పాత లోక్‌సభ హాల్ ను చూపిస్తూ ఉంది, అయితే పార్లమెంటు ఉభయ సభల కార్యకలాపాలను కొత్త పార్లమెంటు భవనానికి మార్చారు.
వైరల్ చిత్రాన్ని హైవ్ ఏఐ డిటెక్షన్ టూల్ ద్వారా నిశితంగా పరిశీలించాం. ఈ చిత్రం AI ద్వారా సృష్టించిన కంటెంట్ అని ఫలితాలు సూచించాయి.
కాబట్టి, డిజిటల్ గా సృష్టించిన ఫోటోను నిజమైనదిగా ప్రచారం చేస్తున్నారు.
Claim : వైరల్ అవుతున్నది డిజిటల్ గా సృష్టించిన ఫోటో
Claimed By : Social Media Users
Fact Check : Unknown