ఫ్యాక్ట్ చెక్: కాంగ్రెస్ మంత్రి మహమ్మద్‌ అజారుద్దీన్ ను సీఎం రేవంత్ రెడ్డి అవమానించలేదు

కాంగ్రెస్ మంత్రి మహమ్మద్‌ అజారుద్దీన్ ను సీఎం రేవంత్ రెడ్డి అవమానించలేదు

Update: 2025-11-04 12:06 GMT

భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మహమ్మద్‌ అజహరుద్దీన్‌ మంత్రి అయ్యారు. రేవంత్‌ ప్రభుత్వం మంత్రి వర్గంలో ఆయన చేరిపోయారు. పదకొండేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన అజహరుద్దీన్‌ తాజాగా పెద్దల సభకు ఎంపికయ్యారు. కాంగ్రెస్‌ పార్టీతో ఆయన రాజకీయ ప్రయాణం సాగింది. రెండు పర్యాయాలు పార్లమెంట్‌కు, ఒకసారి అసెంబ్లీ స్థానానికి పోటీ చేశారు. ఒకసారి మాత్రమే ఆయన విజయం సాధించారు. 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో దిగి విజయం సాధించారు. 2014లో రాజస్థాన్‌లోని టోంక్‌ సవాయీ మాధోపుర్‌ లోక్‌సభ స్థానం కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2023 సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. రెండేళ్ల క్రితం జరిగిన సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌ నుంచి పోటీ చేసిన ఓటమి పాలైన అజహరుద్దీన్‌ ఉప ఎన్నికల్లో తిరిగి పోటీ చేసేందుకు ఆసక్తి కనబర్చగా కాంగ్రెస్‌ అధిష్టానం ఆయనను ఎన్నికల బరి నుంచి తప్పించి గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేసి సిఫార్సు చేసింది.


అయితే మహమ్మద్ అజారుద్దీన్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవమానించారంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అజారుద్దీన్ నమస్కారం పెడుతున్నా కూడా పట్టించుకోలేదంటూ ఆ పోస్టుల్లో చెబుతున్నారు.

"Big Insult To Minority Minister Azaruddin ji
This clearly shows how arrogant revanth is.

అజారుద్దీన్ 3 గారు నమస్కారం పెడ్తున్న పట్టించుకోని సీఎం...

మైనారిటీ లు అంటే అంత చిన్న చూప?

లేక నీ అనుచరుడికి రావాల్సిన మంత్రి పదవి అజారుద్దీన్ గారికి వచ్చింది అని అసహనామా ?" అంటూ పోస్టులు పెట్టారు.




వైరల్ అవుతున్న పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు



 



ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి. మహమ్మద్ అజారుద్దీన్ తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కరచాలనం చేశారు.

వైరల్ పోస్టుల్లోని వీడియో స్క్రీన్ షాట్ ను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా బోరబండలో జరిగిన పబ్లిక్ మీటింగ్ కు సంబంధించిన విజువల్స్ అని స్పష్టంగా తెలుస్తోంది.

ఆ మీటింగ్ ను పలు మీడియా సంస్థలు లైవ్ స్ట్రీమింగ్ చేశాయి. ఆ వీడియోలను ఇక్కడ చూడొచ్చు. ఈ వీడియోలలో ఎక్కడా కూడా సీఎం రేవంత్ రెడ్డి అజారుద్దీన్ ను అవమానించలేదు. అంతేకాకుండా ఆయన

Full View



Full View


Full View



వి6 మీడియా సంస్థ సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ ను లైవ్ స్ట్రీమింగ్ చేసింది. CM Revanth Reddy Live:Participate In Rally And Corner Meeting AtBorabanda|Jubilee HillsBypoll|V6News అనే టైటిల్ తో అప్లోడ్ చేసిన ఈ వీడియోలో 41:25 సమయం వద్ద అజారుద్దీన్ తో ఆప్యాయంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం, కరచాలనం చేయడం చూడొచ్చు.

Full View


అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ ఉంది.



 



ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బోరబండలో కార్నర్ మీటింగ్‌లో మాట్లాడారు. బోరబండ ప్రాంతంలోని ప్రధాన చౌరస్తాకు ఇకపై 'పీజేఆర్ బోరబండ చౌరస్తా'గా నామకరణం చేయబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా తెలిపారు. అంతేకాకుండా.. ఆ చౌరస్తాలో పీజేఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి.. దాన్ని స్వయంగా తానే ఆవిష్కరిస్తానని సీఎం ప్రకటించారు. అంతేకాకుండా గత ప్రభుత్వం మీద కూడా విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకు సంబంధించిన కథనాలను
ఇక్కడ
, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.


సీఎం రేవంత్ రెడ్డి అజారుద్దీన్ ను అవమానించారా అని తెలుసుకోడానికి సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేశాం. మాకు అందుకు సంబంధించిన ఎలాంటి కథనాలు లభించలేదు. అదే కానీ జరిగి ఉంటే తప్పకుండా వార్తల్లో నిలిచి ఉండేది.

కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా పోస్టులను వైరల్ చేస్తున్నారు.


Claim :  వైరల్ అవుతున్న పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News