ఫ్యాక్ట్ చెక్: తిరుమలలో చాగంటి కోటేశ్వర రావుకు అవమానం జరిగిందనే వాదనలో నిజం లేదన్న టీటీడీ
తిరుమలలో చాగంటి కోటేశ్వర రావుకు అవమానం
తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందిన ప్రవచనకారులలో చాగంటి కోటేశ్వర రావు ఒకరు. చాగంటి కోటేశ్వర రావు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. చాగంటి కేవలం శని, ఆదివారాల్లో మాత్రమే ప్రవచనాలు చెబుతారు. కాకినాడలోని ఒక దేవాలయంలో ఆయన ప్రవచనాలను ఇస్తూ వస్తున్నారు. చాగంటి ప్రవచనాలు చెప్పినందుకు డబ్బులు తీసుకోరు. ఎక్కడికైనా బయట నగరాలకు వెళ్లి ప్రవచనాలు ఇవ్వాల్సి వస్తే.. సొంత డబ్బుతో స్లీపర్ క్లాస్ టికెట్ కొనుక్కుని ప్రయాణం చేస్తారు. నిర్వాహకుల నుంచి ఎలాంటి డబ్బు తీసుకోరు.
ఇక ఆయనకు ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం ఆయనకు ప్రభుత్వ సలహాదారు పదవిని ఇచ్చింది. చాగంటికి 'స్టూడెంట్స్ ఎథిక్స్ అండ్ వాల్యూ స్ సలహాదారుడి' గా బాధ్యతలు అప్పగించింది. ఏపీ ప్రభుత్వం 59 మందికి నామినేటెడ్ పదవులు కేటాయిస్తూ రెండో జాబితా విడుదల చేయగా.. చాగంటి కోటేశ్వరరావు కు క్యాబినెట్ ర్యాంకుతో కీలక పదవి కేటాయించారు.
తిరుమలలో చాగంటి కోటేశ్వర రావుకు అవమానం జరిగిందంటూ పలు సోషల్ మీడియా ఖాతాలలో పోస్టులు, కొన్ని మీడియా ఛానల్స్ లో కథనాలు వచ్చాయి.
"చాగంటి కోటేశ్వరరావుకు TTDలో ఘోర అవమానం
క్యాబినెట్ హోదాలో కూటమి ప్రభుత్వం ఆయనను సలహాదారుగా నియమించింది
తిరుమలలో ఇలాంటివి కామన్ అయిపోయాయి
సనాతన పరిరక్షకుడినని చెప్పుకునే పవన్ కళ్యాణ్ జరిగిన దానిపై వెంటనే విచారణకు ఆదేశించి జరిగిన అవమానానికి అతనికి క్షమాపణ" అంటూ @Kumar991957 లో పోస్టు పెట్టారు.
తిరుమలలో చాగంటి కోటేశ్వర రావుకు అవమానం జరిగిందంటూ పలు సోషల్ మీడియా ఖాతాలలో పోస్టులు, కొన్ని మీడియా ఛానల్స్ లో కథనాలు వచ్చాయి.
"చాగంటి కోటేశ్వరరావుకు TTDలో ఘోర అవమానం
క్యాబినెట్ హోదాలో కూటమి ప్రభుత్వం ఆయనను సలహాదారుగా నియమించింది
తిరుమలలో ఇలాంటివి కామన్ అయిపోయాయి
సనాతన పరిరక్షకుడినని చెప్పుకునే పవన్ కళ్యాణ్ జరిగిన దానిపై వెంటనే విచారణకు ఆదేశించి జరిగిన అవమానానికి అతనికి క్షమాపణ" అంటూ @Kumar991957 లో పోస్టు పెట్టారు.
"కేబినెట్ హోదా ఇస్తున్నాం అంటూ చాగంటి కోటేశ్వరరావు గారిని తిరుమలలో అవమానించిన కూటమి ప్రభుత్వం టిటిడి" అంటూ మరో పోస్టును కూడా చూడొచ్చు.
"తిరుమలలో చాగంటి కోటేశ్వరరావుకు అవమానం" అంటూ సాక్షిలో కథనాన్ని ప్రచురించారు. ఆ లింక్ ను ఇక్కడ మీరు చూడొచ్చు.
"తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు అవమానం జరిగింది. దర్శన సమయంలో వయసు రీత్యా బయోమెట్రిక్ నుంచి ఆయన వెళ్లే వెసులుబాటు ఉంది. కానీ చాగంటిని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఆలయంలోకి అనుమతించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి." అని కథనంలో ఉంది.
"చాగంటికి అవమానం! | TTD Insulted Chaganti Koteswara Rao! | Journalist YNR" అంటూ Journalist YNR యూట్యూబ్ పేజీలో ఓ వీడియోను పోస్టు చేశారు.
వైరల్ అవుతున్న పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదంటూ టీటీడీ వివరణ ఇచ్చింది.
ఈ ఘటన గురించి వివరాలను తెలుసుకోవడం కోసం మేము టీటీడీ అఫీషియల్ వెబ్ సైట్ ను ఓపెన్ చేశాం.
"బ్రహ్మర్షి శ్రీ డా. చాగంటి కోటేశ్వర రావు గారికి అవమానం అంటూ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న వార్త పూర్తిగా అవాస్తవం" అంటూ టీటీడీ వెబ్ సైట్ లో కథనాన్ని మేము చూశాం. ఆ లింక్ ను మీరు ఇక్కడ చూడొచ్చు.
"ప్రముఖ ఆథ్యాత్మిక ప్రవచన కర్త బ్రహ్మర్షి శ్రీ డా.చాగంటి కోటేశ్వర రావు గారు ప్రతి ఏడాది జనవరి మాసంలో తిరుమల వచ్చి శ్రీవారిని సందర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా జనవరి 14న శ్రీవారి దర్శనం, జనవరి 16వ తేదీ సాయంత్రం తిరుపతి మహతి ఆడిటోరియంలో ప్రవచనాలు ఇచ్చేందుకు 2024, డిసెంబర్ 20న టిటిడి ప్రొసిడింగ్స్ ఇచ్చింది. డా. చాగంటి కోటేశ్వర రావు గారికి ఉన్న కేబినేట్ ర్యాంక్ ప్రోటోకాల్ ప్రివిలేజ్ ప్రకారం జనవరి 14న శ్రీవారి దర్శనం ఏర్పాట్లను చేసింది. అందులోభాగంగా, రాంబగీఛ గెస్ట్ హౌస్ నుంచి శ్రీవారి ఆలయానికి వారిని తీసుకెల్లేందుకు బగ్గీస్ ను, శ్రీవారి ఆలయానికి బయోమెట్రిక్ ద్వారా అనుమతించేందుకు టిటిడి ఏర్పాట్లను చేసింది. అయితే వయసు రీత్యా శ్రీవారి ఆలయానికి బయోమెట్రిక్ ద్వారా వెళ్లే సదుపాయం ఉన్నా వారు సున్నితంగా తిరస్కరించడం జరిగింది. పలువురు ప్రముఖులు, సాధారణ భక్తుల తరహాలోనే వైకుంఠం కాంప్లెక్స్ నుండి శ్రీవారి ఆలయానికి చేరాలని వారే స్వయంగా సూచించారు. వారి సూచనల మేరకు వారే స్వయంగా వైకుంఠం కాంప్లెక్స్ నుంచి ఆలయానికి చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు.
అదేవిధంగా జనవరి 8వ తేదీన తిరుపతిలో జరిగిన తోపులాట ఘటన నేపథ్యంలో శ్రీ చాగంటి వారి ప్రవచన కార్యక్రమాన్ని మరొక తేదీకి వాయిదా వేస్తే బాగుంటుందని వారి దృష్టికి టిటిడి అధికారులు తీసుకెళ్లగా, ఈ విన్నపాన్ని శ్రీ చాగంటి వారు అంగీకరించారు. తదుపరి వారి అపాయింట్మెంట్ తేదీలను మరోసారి తీసుకుని ప్రవచనాలు ఏర్పాటు చేసేందుకు టిటిడి నిర్ణయించింది. వాస్తవం ఇలా ఉండగా బయోమెట్రిక్ ద్వారా కాకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి శ్రీవారి ఆలయంలోకి అనుమతించారని, చివరి నిమిషంలో పరిపాలనా కారణాల రీత్యా శ్రీ చాగంటి వారి ప్రవచనాల కార్యక్రమాన్ని టిటిడి రద్దు చేసినట్లు టిటిడిని పలుచన చేసేలా వాస్తవాలను వక్రీకరించి అసత్యపు వార్తను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాము." అంటూ టీటీడీ వెబ్ సైట్ లో వివరణను మేము చూశాం.
టీటీడీ అధికారిక ట్విట్టర్ పేజీని చూడగా.. అందులో వదంతులను ఖండిస్తూ చేసిన పోస్టును మేము గుర్తించాం. చాగంటి ప్రవచనాల కార్యక్రమాన్ని టీటీడీ రద్దు చేసినట్లు వాస్తవాలను వక్రీకరించి అసత్యపు వార్తను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అందులో హెచ్చరించారు.
టీటీడీ ఛైర్మెన్ బీఆర్ నాయుడు ట్విట్టర్ ఖాతాను పరిశీలించగా.. చాగంటి కోటేశ్వర రావు గారికి అవమానం అంటూ జరుగుతున్న ప్రచారం నిజం కాదంటూ ఓ పోస్టును పెట్టారు.
"బ్రహ్మర్షి శ్రీ డా.చాగంటి కోటేశ్వర రావు గారికి అవమానం అంటూ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న వార్త పూర్తిగా ఆవాస్తవం.
అసలు వాస్తవం .. " అంటూ ట్వీట్ ను మేము గుర్తించాం. టీటీడీ విడుదల చేసిన అధికారిక ప్రకటనను ఆయన షేర్ చేశారు.
సంబంధిత కీవర్డ్స్ తో మేము గూగుల్ సెర్చ్ చేయగా పలు మీడియా సంస్థలు ఈ వివాదంలో టీటీడీ ఇచ్చిన వివరణను ప్రచురించాయి.
ఆ కథనాలు ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
కాబట్టి, చాగంటి కోటేశ్వర రావుకి అవమానం అంటూ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని టీటీడీ స్పష్టం చేసింది.
Claim : తిరుమలలో చాగంటి కోటేశ్వర రావుకు అవమానం జరిగింది
Claimed By : Social Media Users, Media Outlets
Fact Check : Unknown