ఫ్యాక్ట్ చెక్: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ చండీయాగం నిర్వహించలేదని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి
బీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు గారు ఎర్రవెల్లిలోని తన నివాసంలో చండీ యాగం నిర్వహిస్తున్నారని జరుగుతున్న
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఇటీవల మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్) ను జైలులో పెట్టాల్సిన అవసరం లేదని, ఎందుకంటే ఆయన ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని, అది ఆయనకు చెర్లపల్లి సెంట్రల్ జైలుతో సమానమని అన్నారు. జైలులో ఖైదీలను పోలీసులు పర్యవేక్షిస్తున్నట్లే, కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కూడా పోలీసుల పర్యవేక్షణ ఉంటుందని, జైలులో ఖైదీలను కలవడానికి సందర్శకులు వచ్చే విధంగానే, రాజకీయ నాయకులు అప్పుడప్పుడు కేసీఆర్ ను కలవడానికి ఫామ్‌హౌస్‌కు వెళతారని రేవంత్ రెడ్డి అన్నారు.
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం (KLIS)పై జస్టిస్ పి.సి.ఘోష్ విచారణ కమిషన్ కేసీఆర్ పై ఆరోపణలు గుప్పించింది. చంద్రశేఖర్ రావు తన ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో నిర్బంధంలో ఉండటానికి, భవిష్యత్తులో అరెస్టు జరిగితే చర్లపల్లి సెంట్రల్ జైలులో ఉండటానికి మధ్య పెద్ద తేడా లేదని పేర్కొంటూ అరెస్టు జరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయనే వాదనను కూడా తీసుకుని వచ్చారు. చంద్రశేఖర్ రావు అరెస్టుపై తన అభిప్రాయాన్ని ఇలా చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. చంద్రశేఖర్ రావు ఇప్పటికే ప్రజా న్యాయస్థానంలో దోషిగా నిర్ధారించబడ్డారని, ఆయన శిక్షను అనుభవిస్తున్నారని ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చూస్తుంటే తెలుస్తోంది.
ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎక్కువగా తన ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. అక్కడే ఉంటూ పలువురు పార్టీ నేతలతో చర్చలు జరుపుతూ ఉన్నారు. తాజాగా ఆయన చండీయాగం నిర్వహిస్తున్నారనే వాదనతో కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
"కేసీఆర్ కీలక నిర్ణయం!
బీఆర్ఎస్ పార్టీకి పట్టిన శని, దరిద్రం
పార్టీలో అంతర్గత కొట్లాటలు, కవిత వ్యవహారం, రాజకీయ ప్రతికూల వాతావరణం నేపథ్యంలో చండీ యాగం చేయాలని నిర్ణయించుకున్న కేసీఆర్
ఇవాళ్టి నుంచి ఈనెల 6 వరకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో చండీ యాగం చేయనున్న కేసీఆర్ దంపతులు" అంటూ పోస్టులు పెట్టారు.
మరొక పోస్టులో
"కుటుంబంలో కలహాల దృశ్య చండీ యాగం చేయనున్న కేసీఆర్
కుటుంబంలో మనస్పర్థల దృశ్య యాగం చేస్తే మంచి జరుగుతుందన్న నమ్మకంతో
నేటి నుండి 6వ తేదీ వరకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో చండీ యాగం చేయనున్న గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ దంపతులు" అంటూ చెప్పారు.
వైరల్ అవుతున్న పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని బీఆర్ఎస్ వర్గాలు స్పష్టం చేశాయి.
మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేయగా ఇటీవలి కాలంలో కేసీఆర్ చండీయాగం నిర్వహించినట్లుగా ఎలాంటి కథనాలు మాకు లభించలేదు.
ఇక బీఆర్ఎస్ కు చెందిన brstechcell వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదంటూ పోస్టులను సోషల్ మీడియాలో పెట్టాయి. బీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు ప్రజా సంబంధాల అధికారి కార్యాలయం నుండి వైరల్ వాదనలో నిజం లేదంటూ వివరణ వచ్చింది.
"ఫేక్ న్యూస్ ఖండన
బీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు గారు ఎర్రవెల్లిలోని తన నివాసంలో చండీ యాగం నిర్వహిస్తున్నారని జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కె. చంద్రశేఖర్ రావు గారి కార్యాలయం నుంచీ గానీ, బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాల నుంచీ గానీ ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
అయినా కూడా, కనీస సమాచారం తెలుసుకోకుండా, వాస్తవాలను నిర్ధారించుకోకుండా, తమ ఇష్టం వచ్చినట్లుగా ఫామ్‌హౌస్‌లో చండీయాగం అంటూ ప్రముఖ ఛానెళ్లు, పత్రికలు ఈ దుష్ప్రచారాన్ని కొనసాగించడం బాధ్యతారాహిత్యం.
తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా, కె. చంద్రశేఖర్ రావు గారి ప్రతిష్ఠను భంగపరిచే విధంగా కొనసాగిస్తున్న ఇటువంటి అవాస్తవాలను, అసత్యాలను వార్తల పేరుతో చేసే దుష్ప్రచారాన్ని తక్షణమే నిలిపివేయాలి. తమ తమ ఛానెళ్ల నుంచి ఈ వార్తలను తొలగించాలని అన్ని పత్రికలు, ఛానెళ్ల యాజమాన్యాలను, ఎడిటర్లను కోరుతున్నాం.
* రమేశ్ హజారి, పి.ఆర్.ఓ
* బీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు గారి ప్రజా సంబంధాల అధికారి కార్యాలయం, హైదరాబాద్

పలు బీఆర్ఎస్ పార్టీకి చెందిన అకౌంట్స్ లో కూడా అలాంటి ప్రచారాన్ని ఖండిస్తూ పోస్టులు పెట్టారు.
ఇక పలు మీడియా సంస్థలు కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ లో చండీయాగం జరుగుతూ ఉందనే ప్రచారంలో నిజం లేదంటూ కథనాలను ప్రచురించాయి. వాటిని ఇక్కడ చూడచ్చు.
పార్టీ అధ్యక్షుడు మరియు మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఎర్రవెల్లిలోని తన నివాసంలో చండీ యాగం నిర్వహిస్తున్నట్లు వచ్చిన వార్తలను భారత రాష్ట్ర సమితి (BRS) ఖండించింది. అటువంటి ఆచారం నిర్వహించడం లేదని, చంద్రశేఖర్ రావు కార్యాలయం, BRS లేదా ఏదైనా అనుబంధ విభాగం ఈ కార్యక్రమానికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదని పార్టీ స్పష్టం చేసిందంటూ కథనాలు వెలువడ్డాయి.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : బీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు గారు ఎర్రవెల్లిలోని తన నివాసంలో చండీ యాగం నిర్వహిస్తున్నారని జరుగుతున్న దుష్ప్రచారాన్ని
Claimed By : Social Media Users, Media
Fact Check : Unknown