ఫ్యాక్ట్ చెక్: ఏఐ వీడియోలను రాజా సాబ్ సినిమా థియేటర్లలోకి తీసుకుని వెళ్లిన నిజమైన మొసళ్లుగా ప్రచారం చేస్తున్నారు
రాజా సాబ్ సినిమా థియేటర్లలోకి నిజమైన మొసళ్లను తీసుకుని
బాహుబలి సిరీస్ భారీ విజయం తర్వాత, ప్రభాస్ భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ గా మారాడు. ‘సలార్’ ‘కల్కి 2898 AD’తో రెండు వరుస బ్లాక్‌బస్టర్‌లను అందించిన తర్వాత, దర్శకుడు మారుతితో కలిసి ‘ది రాజా సాబ్’ కోసం చేతులు కలిపాడు. ఇది రొమాంటిక్ హారర్ కామెడీగా మొదలై రొమాంటిక్ హారర్ ఫాంటసీ చిత్రంగా మారింది. ఈ సినిమా ప్రీమియర్లు జనవరి 8న పడ్డాయి.
ఈ సినిమా కోసం వెళ్లిన ప్రభాస్ అభిమానులు తమ చేతుల్లో మొసళ్లను పట్టుకున్నట్లుగా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఇవి నిజమైన మొసళ్ళు అంటూ ప్రచారం చేస్తున్నారు.
వైరల్ అవుతున్న పోస్టులను ఇక్కడ చూడొచ్చు.
https://x.com/MySelf_Preety/status/2009309946358452510
https://x.com/ivdsai/status/2009293379692052521
వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియోను ఏఐ ద్వారా సృష్టించారు.
మొసళ్లను అలా థియేటర్ల లోకి తీసుకుని వెళ్లడం చట్టరీత్యా నేరం. అలాంటి ఘటనలు నిజంగా చోటు చేసుకుని ఉండి ఉంటే మీడియా సంస్థలు తప్పకుండా నివేదించి ఉండేవి. కానీ మాకు అలాంటి కథనాలు ఏవీ లభించలేదు.
వైరల్ వీడియో లోని స్క్రీన్ షాట్ ను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా మాకు ఈనాడుకు సంబంధించిన కథనం లభించింది.
"ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. అయితే కొందరు మాత్రం ఇవి ఏఐతో చేసిన వీడియోలంటూ కామెంట్స్ పెడుతున్నప్పటికీ ఈ సినిమా విడుదల సందర్భంగా మొసలి మాత్రం హైలైట్ అవుతోంది." అంటూ ఈనాడు వివరణ ఇచ్చింది.
వీడియోలను నిశితంగా పరిశీలించగా అందులో ఎన్నో తేడాలు మనం గమనించవచ్చు. కొన్ని వీడియోలలో స్క్రీన్ ఓ వైపు ఉండగా.. సీటింగ్ మరో వైపు ఉంది. ఇలా ఏ థియేటర్ లోనూ ఉండదు. ఇక మనుషుల్లో హావభావాలు ఏ మాత్రం కనిపించలేదు. ఎవరూ మాట్లాడకపోయినా రాజా సాబ్ అంటూ అరుపులు వస్తూ ఉండడం మనం ఆ వీడియోలో గమనించాం. ఈ కారణాలన్నీ ఇది ఖచ్చితంగా కృత్రిమ మేధతో సృష్టించిందేనని తెలుస్తోంది.
ఇక వైరల్ వీడియోను మేము ఏఐ డిటెక్షన్ టూల్స్ ద్వారా విశ్లేషించాము. ఆ వీడియో ఏఐ సృష్టి అంటూ ఫలితాలు తేల్చాయి. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇక్కడ చూడొచ్చు. డీప్ ఫేక్ డిటెక్ట్ అయినట్లుగా తేల్చాయి.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ వీడియోను ఏఐ ద్వారా సృష్టించారు.
Claim : రాజా సాబ్ సినిమా థియేటర్లలోకి నిజమైన మొసళ్లను తీసుకుని
Claimed By : Social Media Users
Fact Check : Unknown