ఫ్యాక్ట్ చెక్: బిరియానీ తయారీలో మురుగు నీటిని వాడుతున్నారంటూ వైరల్ అవుతున్న వీడియోను ఏఐ ద్వారా సృష్టించారు

భారతీయులు ఎక్కువగా తినే వంటకాల్లో బిరియానీ ఒకటి. అయితే ఈ బిరియానీలు తయారు చేసే విధానాలు, తయారు చేసే వ్యక్తులకు

Update: 2025-11-21 05:32 GMT

భారతీయులు ఎక్కువగా తినే వంటకాల్లో బిరియానీ ఒకటి. అయితే ఈ బిరియానీలు తయారు చేసే విధానాలు, తయారు చేసే వ్యక్తులకు సంబంధించి పలు వాదనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. అలాంటి ఓ వాదన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.


ఒక ముస్లిం వ్యక్తి మురుగునీటిని ఉపయోగించి ఆహారం వండుతున్నట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది వినియోగదారులు దీనిని నిజమైన సంఘటనగా భావించి వైరల్ చేస్తున్నారు.

"इनका किसी भी प्रकार का भोजन खाना दुश्वार है
क्योंकि ये खाने में गंदगी मिला कर खिलाते हैं
ऐसा करने के लिए उसी आसमानी किताब मे लिखा जो है!" అంటూ మతపరమైన కోణంలో పోస్టులను వైరల్ చేస్తూ ఉన్నారు. కావాలనే ఓ వర్గం వ్యక్తులు హిందువులు తినే వంటకాలను ఇలా తయారు చేస్తున్నారంటూ పోస్టులు పెడుతున్నారు.



ఇక తెలుగులో కూడా ఈ వీడియో వైరల్ అవుతూ ఉంది.



వైరల్ అవుతున్న పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇక్కడ చూడొచ్చు



 

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియోను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించారు.

వైరల్ వీడియో లోని స్క్రీన్ షాట్ ను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా కొన్ని వారాలుగా వైరల్ వీడియో ఆన్ లైన్ లో వైరల్ అవుతూ ఉంది. పలు ప్రాంతాల్లో జరిగినట్లుగా వీడియోలను వైరల్ చేస్తున్నారు.

ఈ వీడియోను నిశితంగా పరిశీలించగా, మురుగు నీటిని పోస్తున్నట్లుగా ఉన్న వ్యక్తి హావభావాలతో చాలా తేడాలను గమనించవచ్చు. నీటిని తీసుకునే విధానం, గరిటెను తిప్పే పద్ధతిలో చాలా మార్పులను మనం గమనించవచ్చు. ఇక అంత పెద్ద పాత్రను ఏ మాత్రం ఇబ్బంది లేకుండా ఒంటి చేత్తో వీడియోలోని వ్యక్తి ఎత్తడం గమనించాం.

ఇక వైరల్ వీడియోలో “సోరా AI” అనే వాటర్‌మార్క్ ఉంది. ఇది టెక్స్ట్ ప్రాంప్ట్‌ల నుండి వీడియోలను రూపొందించడానికి ఉపయోగించే ఏఐ టూల్. ఇవి AI-జనరేటెడ్ విజువల్స్ కు సంబంధించినవని స్పష్టం చేస్తున్నాయ్. ఈ వీడియో నిజమైన ఘటన కాదని తెలియజేస్తోంది.


క్లిప్ లో “@dark.wab48” అనే వాటర్‌మార్క్ కూడా మేము గమనించాము. ఈ యూజర్‌నేమ్‌ను ఆన్‌లైన్‌లో వెతకగా @dark.wab48లో పోస్ట్ చేయబడిన అదే వీడియోను మేము కనుగొన్నాము. ఇక వివరణలో, వీడియో క్లిప్ AI ద్వారా ఉపయోగించి రూపొందించినట్లు స్పష్టం చేశాడు.


ఏఐ ద్వారా వైరల్ వీడియోను సృష్టించారా లేదా అని తెలుసుకోడానికి మేము పలు ఏఐ డిటెక్షన్ టూల్స్ ను ఉపయోగించి పరీక్షించాం. హైవ్ ఏఐ డిటెక్షన్ టూల్ వైరల్ వీడియో ఏఐ సృష్టి అని తేల్చింది.

అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు. ఏఐ ద్వారా సృష్టించారని ఈ వివరణ స్పష్టం చేస్తోంది. 



ఏదైనా మనం కొంచెం స్క్రిప్ట్ ఇస్తే చాలు. వీడియోలను సృష్టించగలిగే ఏఐ క్రియేట్ టూల్స్ మార్కెట్ లోకి వచ్చేసాయి. అలాంటి వాటిని ఉపయోగించి ఎంతో మంది వీడియోలను సృష్టిస్తూ ఉన్నారు. వీటిలో చాలా వీడియోలను గుర్తించడం కొంచెం సులువే!! ముఖ్యంగా నిడివి తక్కువగా ఉండడం, ముఖాలకు సంబంధించి సరైన స్పష్టత లేకపోవడం లాంటి ఎన్నో పొరపాట్లను ఈ ఏఐ ద్వారా సృష్టించిన వీడియోలలో చూసుకోవచ్చు.  


కాబట్టి, వైరల్ అవుతున్న విజువల్స్ ఏఐ ద్వారా సృష్టించారని, నిజమైన ఘటన కాదని తెలుస్తోంది.


Claim :  భారతీయులు ఎక్కువగా తినే వంటకాల్లో బిరియానీ ఒకటి. అయితే ఈ బిరియానీలు తయారు చేసే విధానాలు, తయారు చేసే వ్యక్తులకు
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News