ఫ్యాక్ట్ చెక్: 2025 మే నెలలో చోటు చేసుకున్న డ్రోన్ దాడి ఘటనలను ఇటీవలిగా ప్రచారం చేస్తున్నారు

2025 మే నెలలో చోటు చేసుకున్న డ్రోన్ దాడి ఘటనలను ఇటీవలిగా

Update: 2026-01-18 05:52 GMT

భారత్ చేసిన ఆపరేషన్ సిందూర్ తర్వాత కూడా భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా డ్రోన్స్ ద్వారా రెచ్చగొట్టే చర్యలు తిరిగి ప్రారంభమయ్యాయి. జనవరి 9, 2026 నుండి, జమ్మూ కాశ్మీర్ సరిహద్దు సెక్టార్లలో బహుళ పాకిస్తానీ డ్రోన్లు కనిపించాయి. భారత ప్రభుత్వం ఇస్లామాబాద్‌ను ఈ చొరబాట్లను ఆపమని కోరింది. పాకిస్తాన్ పలు అంశాల కోసం డ్రోన్లను పంపే అవకాశం కూడా ఉంది. పేలోడ్‌లు లేకుండా పాకిస్తాన్ పంపే డ్రోన్ భారతదేశం ప్రతిస్పందనను తెలుసుకోడానికి కూడా అని పలువురు భావిస్తూ ఉన్నారు. భారతదేశం ఏ రాడార్ వ్యవస్థను యాక్టివేట్ చేసిందో పాకిస్తాన్ తనిఖీ చేయడానికి ఇలాంటి పనులు చేపట్టి ఉంటుంది. ఇక భారతదేశ సైనిక కదలిక ఏ రంగాలలో పెరుగుతుందో కూడా ఇలా డ్రోన్స్ ను పంపించి చేయనున్నారు.


ఇటీవల నౌషెరా సెక్టార్‌లో భారత సైన్యం ఒక పాకిస్తాన్ డ్రోన్‌ను కూల్చివేసినట్లు పేర్కొంటూ, రాత్రిపూట ఆకాశంలో ఎగురుతున్న పలు డ్రోన్‌లను తూటాలతో కుప్పకూల్చే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నియంత్రణ రేఖ వెంబడి డ్రోన్ చొరబాటుకు భారత దళాలు స్పందించిన దృశ్యాలను గ్రౌండ్ ఫుటేజ్‌గా అభివర్ణించిన అనేక మంది సోషల్ మీడియా వినియోగదారులు ఈ క్లిప్‌ను షేర్ చేశారు. జమ్మూ కాశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్ కార్యకలాపాలు జరుగుతున్నాయనే వాదనతో ఈ పోస్ట్ వెలుగులోకి వచ్చింది.


జనవరి 2026లో పాకిస్థాన్ పంపించిన డ్రోన్స్ అంటూ కొన్ని విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.

https://www.instagram.com/smoooth_editx/reel/DTYZ8xek3p5/

వైరల్ పోస్టులకు సంబంధించిన ఆర్కైవ్ లింక్స్ ను ఇక్కడ చూడొచ్చు

వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇదిగో



 



ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వీడియో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది.

వైరల్ అవుతున్న వాదనను తెలుసుకోవడం కోసం మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేశాం. జనవరి 16, 2026న కూడా జమ్మూకశ్మీర్ లో డ్రోన్స్ సంచారం కనిపించిందని పలు నివేదికలు లభించాయి. వాటిని
ఇక్కడ
, ఇక్కడ చూడొచ్చు.


జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్, సాంబా జిల్లాల్లో ఇండో-పాక్ సరిహద్దులో పాకిస్తాన్ డ్రోన్లు సంచరించాయి. దీంతో గురువారం (జనవరి 15, 2026) రాత్రి భద్రతా దళాలు సమర్థవంతంగా ప్రతి స్పందించాయి. పూంచ్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి), సాంబా జిల్లాలోని రామ్‌గఢ్ సెక్టార్‌లో డ్రోన్లు సంచరిస్తున్నట్లు పలు నివేదికలు తెలిపాయి. పూంచ్‌లోని ఎల్‌ఓసి వెంబడి ఉన్న పోస్టుల దగ్గర ఒక డ్రోన్ కనిపించింది. రామ్‌గఢ్ సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి మరొక డ్రోన్ కనిపించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

పాకిస్తాన్ నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి డ్రోన్‌లను పదేపదే ఉపయోగించి ఆయుధాలు, మాదకద్రవ్యాలు, ఉగ్రవాద సామాగ్రిని భారతదేశంలోకి తీసుకుని వచ్చేందుకు ప్రయత్నించింది. ఇలాంటి కవ్వింపు చర్యలకు భారతదేశం పూర్తిగా సిద్ధంగా ఉందని, భారతదేశం యొక్క దృఢ సంకల్పాన్ని పరీక్షించడానికి పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం కానివ్వమని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది స్పష్టం చేశారు.

ఇక వైరల్ వీడియోలోని కీఫ్రేమ్‌లను తీసుకుని గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. 2025 మే 8న అప్‌లోడ్ చేసిన అదే వీడియోను కలిగి ఉన్న ‘ssbcrackofficial’ అనే యూజర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ మాకు కనిపించింది. పోస్ట్ టైటిల్ లో “జమ్మూ, పంజాబ్‌లోని కీలకమైన భారత సైనిక స్థావరాలు, కీలకమైన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ప్రారంభించిన డ్రోన్ దాడి” అని ఆ పోస్ట్ లో ఉంది.



వైరల్ అవుతున్న పోస్టులోని వీడియో, ఈ వీడియో ఒకటేనని స్పష్టంగా తెలుస్తోంది.

దీన్ని క్యూగా తీసుకుని మేము గూగుల్ సెర్చ్ ను నిర్వహించాం, మే 8, 2025 నాటి NDTV నివేదికకు దారితీసింది. ఇటీవలి సోషల్ మీడియా పోస్ట్‌లో చూసిన వీడియో ఈ నివేదికలో ఉంది. పఠాన్‌కోట్, జైసల్మేర్, జమ్మూలలో పాకిస్తాన్ అనేక డ్రోన్ దాడులు నిర్వహించిందని తేలింది. జైసల్మేర్‌లో అనేక పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడి చేయడానికి పాకిస్తాన్ చేసిన ప్రయత్నాన్ని తిప్పికొట్టారని నివేదించింది.

మే 9న ప్రచురితమైన హిందూస్తాన్ టైమ్స్ నివేదికలో ఇటీవలి సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించిన నకిలీ ఫుటేజ్ కూడా ఉంది. జమ్మూలో అనేక పేలుళ్లు వినిపించాయని, ఇది నివాసితులలో భయాందోళనలను సృష్టించిందని అందులో పేర్కొంది. ఆ కథనం ఇక్కడ చూడొచ్చు.


వైరల్ అవుతున్న వీడియోలోని స్క్రీన్ షాట్స్ ను ఈ నివేదికలో ఉపయోగించారు.



 



కాబట్టి, వైరల్ అవుతున్న వీడియో 2025, మే నెల నుండి ఆన్ లైన్ లో అందుబాటులో ఉంది. 2026 సంవత్సరం జనవరి నెలలో చోటు చేసుకున్న ఘటన కాదు.

వైరల్ వీడియో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది.


Claim :  మే 2025 లో డ్రోన్ దాడి వీడియోను ఇటీవల జరిగినట్లు
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News