ఫ్యాక్ట్ చెక్: పాత విమాన ప్రమాదం ఫోటోలు ముంబైలో ఇటీవల జరిగిందని అబద్ధపు ప్రచారం జరుగుతోంది

The viral image of a plane crash is NOT a recent Mumbai incident. Fact Check confirms the photo is from the 2018 Air Niugini Flight 73 crash in Micronesia.

Update: 2025-10-18 10:30 GMT

Air Niugini Flight 73

ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం, దేశం లో పలు చోట్ల పడుతున్న భారీ వర్షాల కారణంగా చాలా మంది విమాన ప్రయాణం చేయడానికి భయపడుతున్నారు. విమాన భద్రత, వాతావరణం గురించి ఉన్న ఈ ఆందోళనను అవకాశంగా తీసుకుని, కొందరు సోషల్ మీడియాలో పాత ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ, అవి ఇటీవల జరిగిన విమాన ప్రమాదాలుగా ప్రచారం చేస్తున్నారు. నీటిలో సగం మునిగిపోయిన ఒక ప్యాసింజర్ విమానం ముంబైలో ఇటీవల జరిగిన విమాన ప్రమాదంగా చూపుతూ సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు.

చాలా మంది సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఫేస్ బుక్ లో మునిగిపోయిన విమానం, దాని చుట్టూ ఉన్న రెస్క్యూ పడవలను చూపిస్తున్న ఒక చిత్రాన్ని షేర్ చేస్తున్నారు. ఇది ముంబైలో ఇప్పుడు జరిగిన విమాన ప్రమాదం అంటూ ప్రచారం జరుగుతోంది.

ఈ చిత్రాలతో పాటు షేర్ చేసిన క్యాప్షన్ హిందీలో ఇలా ఉంది: “मुंबई में समुद्र में बड़ी दुखद घटना विमान क्रैश, सभी यात्री सुरक्षित निकाल लिए गए हैं एक दो घायल हुए हैं उनको हॉस्पिटल भेज दिया गया —  मुंबई.” దీనిని తెలుగులోకి అనువదించగా, "ముంబై సముద్రంలో విమానం కూలిపోయింది. ప్రయాణీకులందరూ సురక్షితంగా ఉన్నారు. గాయపడిన ఒకరిద్దరిని ఆసుపత్రికి పంపించారు- ముంబైలో." అని అర్థం వస్తుంది.

Full View


Full View

క్లెయిం స్క్రీన్‌షాట్ ఇక్కడ ఉంది.



ఫ్యాక్ట్ చెక్:

వైరల్ ఫోటో ముంబైలో జరిగిన ఇటీవలి విమాన ప్రమాదాన్ని చూపుతోందనే ఈ ప్రచారం నిజం కాదు.

ఈ ప్రచారాన్ని పరిశోధించడానికి, ముందుగా ఆ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాము. ఈ సెర్చ్‌లో ఈ ఫోటో చాలా ఏళ్ల క్రితం నుంచే ఇంటర్నెట్‌లో ఉందని తెలుస్తోంది. ఫేస్ బుక్ లో ఉన్న పాత పోస్ట్‌లు లభించాయి. ఈ పోస్ట్ క్యాప్షన్ ఇంగ్లిష్ లో ఇలా ఉంది "An Air Niugini Boeing 737-800 missed the runway while attempting to land on a small island in Micronesia and crashed into the sea on Friday.

Live video from the Facebook account of Jumeta Esenaf shows a swarm of fishing boats coming to the rescue as the aircraft sinks off the coast of the Federated States of Micronesia. All passengers were reportedly rescued safely from the submerged aircraft.

Air Niugini confirmed there were 35 passengers and 12 crew members and said it had received reports that "the weather was very poor with heavy rain and reduced visibility at the time of incident." ఈ క్యాప్షన్ వల్ల ఈ చిత్రాలు 2018 నాటివని నిర్ధారణ అయ్యింది.

Full View

ఈ ఫోటో అసలు ఎక్కడిదో తెలుసుకోవడానికి లోతుగా పరిశోధించాము. ఈ చిత్రం ఎయిర్ న్యుగిని విమానం 73 ప్రమాదానికి సంబంధించినదని స్పష్టమైంది. ఈ బోయింగ్ 737-800 ప్యాసింజర్ జెట్ ప్రమాదం సెప్టెంబర్ 28, 2018 నాడు జరిగింది. ఈ విమానం రన్‌వేకు కొద్ది దూరంలో ల్యాండ్ అయ్యే క్రమంలో, ఫెడరేటెడ్ స్టేట్స్ ఆఫ్ మైక్రోనేషియా లోని వెనో ద్వీపంలోని విమానాశ్రయం దగ్గర ఉన్న చూక్ లగూన్‌లో కూలిపోయింది. విమానం రన్‌వేకు సుమారు 145 మీటర్ల ముందు నీటిలో దిగింది.

బిబిసి, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ లాంటి వార్తా సంస్థలు ఈ సంఘటన గురించి వివరంగా కధనాలు రాసాయి. ఈ కథనాలు వైరల్ అవుతున్న ఫోటోలను షేర్ చేసాయి. ఈ ఫోటోలు విమానం మైక్రోనేషియా సముద్రంలో పడిపోయినట్టు చూపిస్తున్నాయి. ఆ ప్రమాదంలో, స్థానిక ప్రజలు, ఊ.శ్. నేవీ డైవర్లు త్వరగా స్పందించి 46 మందిని (35 మంది ప్రయాణీకులు మరియు 12 మంది సిబ్బంది) రక్షించారు. అయితే, దురదృష్టవశాత్తు ఒక ప్రయాణీకుడు మరణించాడు. పైలట్లు సరైన నియమాలను పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారిక నివేదికలో తేలింది.

వైరల్ ఫోటో ముంబైలో ఇటీవల జరిగిన విమాన ప్రమాదం అని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజం కాదు. ఈ ఫోటో ఎయిర్ న్యుగిని విమానం 73 ప్రమాదానికి సంబంధించినది, ఇది సెప్టెంబర్ 28, 2018న ఫెడరేటెడ్ స్టేట్స్ ఆఫ్ మైక్రోనేషియాలోని చూక్ లగూన్లో జరిగింది. ఈ వాదన నిజం కాదు.

Claim :  ముంబైలో సముద్రంలో విమానం కూలిపోయింది. ప్రయాణీకులందరూ సురక్షితంగా బయటపడ్డారు
Claimed By :  Facebook Users
Fact Check :  Unknown
Tags:    

Similar News